ఆద‌ర్శం..ఎమ్మెల్యే ఆర్థ‌ర్‌

పొలానికి వెళ్లి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అంద‌జేత 
 

నంద్యాల‌:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్ఫూర్తిగా నందికొట్కూరు వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ప‌ని చేస్తూ ప్ర‌జ‌ల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంటున్నాడు. నాయకుడంటే కుర్చీలో కూర్చుని సిద్ధాంత చర్చ చేసేవాడు కాదు. నాయ‌కుడంటే సేవ‌కుడు అన్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాట‌ల‌ను స్ఫూర్తిగా తీసుకున్న ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్లి సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నారు. సోమ‌వారం నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గం జూపాడుబంగ్లా మండ‌లం తాటిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబానికి ప్ర‌భుత్వం నుంచి మంజూరైన సీఎం రిలీప్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే ఆర్థ‌ర్ స్వ‌యంగా తీసుకెళ్లి పంట పొలంలో బాధిత కుటుంబ స‌భ్యుల‌కు అందించి దాతృత్వాన్ని చాటుకున్నాడు. గ‌తంలో ఏదైన సంక్షేమ ప‌థ‌కం అందాలంటే కార్యాల‌యాల చుట్టూ, నాయ‌కుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగేవారు. కానీ సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత ప్ర‌తి సంక్షేమ ప‌థ‌కం ఇంటి ముంగిట‌నే అందుతోంది. ఇందుకోస‌మే సీఎం వైయ‌స్ జ‌గ‌న్ గ్రామ‌, వార్డు స‌చివాల‌య‌, వాలంటీర్ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేశారు. ఈ వ్య‌వ‌స్థ స‌త్ఫాలితాలు ఇవ్వ‌డంతో ఎమ్మెల్యే ఆర్థ‌ర్ ఇదే విధానాన్ని అనుస‌రిస్తూ ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే వెళ్లి సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్నారు.  ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ప్రజలు ఉన్నచోటనే పరిపాలన అందించడం వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వం లక్ష్యమని, దానికి నిదర్శనమే గ్రామ స‌చివాల‌య, వాలంటీర్‌ వ్యవస్థ అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇంటి వద్ద నే పెన్షన్ ఇవ్వడం, సంక్షేమ పథకాలు అందించడం జరగలేదని గుర్తు చేశారు.  వైఎస్ జ‌గ‌న్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇటువంటి వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను ఆదర్శం తీసుకుని ముఖ్యమంత్రి సహాయనిది లబ్ధిదారులకు వారున్న చోట‌నే చెక్కులు అందించ‌డం సంతృప్తిగా ఉంద‌న్నారు. కార్యక్రమంలో నందికొట్కూరు మండల అగ్రికల్చర్ అధికారిణి శ్రావణి , పశుసంవర్ధక శాఖ అధికారిణి నిర్మల దేవి, తాటిపాడు గ్రామ సర్పంచ్   కృష్ణారెడ్డి , వైసీపీ నాయకులు ఉస్మాన్ భాష, తదితరులు పాల్గొన్నారు.

తాజా వీడియోలు

Back to Top