బుడగ జంగాలకు కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలి

ఎమ్మెల్యే ఆర్థర్‌
 

అమరావతి: బుడగ జంగాల సామాజిక వర్గానికి ఏదో ఒక కులంలో చేర్పించి కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ కోరారు. సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేలు ఆర్థర్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి బుడగ సంగాల సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడారు. వారు మాట్లాడుతూ..స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా బుగడజంగాల ప్రజలు దయనీయమైన పరిస్థితిలో ఉన్నారన్నారు. ఈ రోజుకు కూడా ఆ సమాజిక వర్గం తంబూర చేతపట్టుకొని బు్రరకథలు చెప్పుకుంటూ..చాపలు అల్లుకుంటూ జీవనం సాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలను చదివించుకోవాలని బుగడజంగాల వారు ఆరాటపడుతున్నారని తెలిపారు. బుడగ జంగాలన ఏదో  ఒక కులంలో చేర్పి ఆదుకోవాలని మంత్రిని కోరారు.
 

Back to Top