గడప వ‌ద్దే స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం

 గిద్ద‌లూరులో వైయ‌స్ఆర్‌సీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు ఘ‌న స్వాగ‌తం
 

ప్ర‌కాశం:  వైయ‌స్ఆర్‌సీపీ అధినేత‌, ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల‌తో గిద్ద‌లూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా గ‌డ‌ప వ‌ద్దే త‌న దృష్టికి వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం చూపుతూ ముందుకు వెళ్తున్నారు. జగనన్న మూడున్నర ఏళ్ళ పాలనలో రాష్ట్రంలోని ప్రతి గడపలో అర్హతల ప్రకారం సంక్షేమ ఫలాలు లభించాయని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. గురువారం నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ని ర్వ‌హించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ పథకాల అమలు తీరును తెలుసుకునే నూతన ఒరవడికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్  శ్రీకారం చుట్టారన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వం అర్హులైన పేదలకు ప్రభుత్వ పథకాలను ఎలా కత్తిరించాలా అనే ఆలోచనతో పరిపాలన చేయగా నేడు మన జగనన్న ప్రభుత్వం అర్హులను వెతికి మరీ లబ్ధి చేకూర్చుతోందన్నారు. పారదర్శక పాలన అంటే ఇదే అని పేర్కొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top