అందరూ బాగుండాలనేది మా ఆలోచన

మంత్రి విడదల రజిని
 

విశాఖ:  రాష్ట్రంలో అందరూ బాగుండాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అని మంత్రి విడదల రజిని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైయస్‌ జగన్‌ ధ్యేయమన్నారు. విశాఖ గర్జన సభలో మంత్రి మాట్లాడారు.

ఉత్తరాంధ్ర ప్రజలు ఉగ్రరూపం దాల్చారు. విశాఖ గర్జన కోసం జనం ఉప్పెనలా వచ్చారు. ఉక్కు సంకల్పంతో జనం పోటెత్తారు. మూడురాజధానులకు మద్దతుగా నిలిచారు. విశాఖకు పాలనా రాజధాని కావాలని వారి మనోభావాలను తెలుసుకునేందుకు ఈ గర్జన నిర్వహించాం. అప్పుడు మద్రాస్, తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఓకే అన్నారు. ఇక్కడ రాజధాని రావాలని జనం భారీగా తరలివచ్చారు. రాలేని వారు టీవీల ముందు కూర్చున్నారు. మా వెనుకబాటు తనాన్ని పోగొట్టుకుంటామని మీరంతా వచ్చారు. ఈప్రాంతానికి మంచి జరగాలని జగన్ భావిస్తున్నారు. అమరావతి పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతాలు ఇస్తారు. 
సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మూడు రాజధానులు ఉండాల‌ని ఆలోచ‌న చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. అందులో అమరావతి ఉండాలి..అందరూ బాగుండాలన్నది మా ఆలోచన. చంద్రబాబు ప్రోదల్భంతో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని ఉద్యమిస్తుంటే చంద్రబాబు ఈ ప్రాంతం గురించి ఆలోచించడం లేదు. ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు, వాళ్ల బ్యాచ్‌కు వెన్నులో వణుకు పుట్టేలా ఈ గర్జనకు తరలివచ్చారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. అప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టే గర్జన ఇది.  

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top