మ‌త్స్య‌కారుల‌ను ఆర్థికంగా అభివృద్ధి చేస్తాం

రూ.280 కోట్ల‌తో జువ్వ‌ల‌దిన్నె వ‌ద్ద ఫిషింగ్ సెంటర్లు

మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌

నెల్లూరు: మ‌త్స్య‌, ఆక్వారంగాల అభివృద్ధికి ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి పాటుప‌డుతున్నార‌ని మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క శాఖ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ తెలిపారు. జువ్వ‌ల‌దిన్నె వ‌ద్ద కేంద్ర ప్ర‌భుత్వ స‌హ‌కారంతో రూ.280 కోట్ల‌తో ఫిషింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు మంత్రి తెలిపారు. నెల్లూరు జిల్లా బాగొలే మండలం జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు స్థలాన్ని రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ప‌రిశీలించారు. అనంత‌రం మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 4 ఫిషింగ్‌ హార్బర్లు, 8 ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, రెండేళ్లలో పనులు పూర్తి చేసి మత్స్యకారులకు అందిస్తామన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతులు పెంచి మత్స్యకారులను ఆర్థికంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇరిగేష‌న్ శాఖ మంత్రి డాక్ట‌ర్‌ అనిల్‌ కుమార్ యాదవ్‌‌ మాట్లాడుతూ.. త్వరలో రామాయపట్నం పోర్టు పనులు కూడా పూర్తి చేస్తామన్నారు. ఫిషింగ్‌ హర్భర్‌కు అనుబంధంగా ప్రాసెసింగ్‌ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. 

Back to Top