పవన్‌ ట్వీట్లకు మంత్రుల కౌంటర్‌

 
తాడేపల్లి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ట్వీట్లకు మంత్రులు కౌంటర్‌ ఇచ్చారు. ప్యాకేజీ కోసం మొరిగే వాళ్లకు గర్జన అర్థమవుతుందా అని మంత్రి అంబటి రాంబాబు ట్వీట్‌ చేశారు. దత్త తండ్రి తరఫున దత్తపుత్రుడి మియావ్‌ మియాప్‌ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ ట్వీట్‌ చేశారు. కుంభకర్ణుడిలా 6 నెలలు నిద్రపోయి పవన్‌ విచిత్రమైన ట్వీట్‌ చేశారని, టీడీపీ, బీజేపీతో జత కట్టినప్పుడు ఉత్తరాంధ్రలో వలసలు గుర్తు రాలేదా అని ప్రశ్నించారు.  రోజుకో మాట, పూటకో వేషం వేసుకుంటే ప్రజలు కొడతారని మంత్రి ఆర్కే రోజా హెచ్చరించారు. 29 గ్రామాల కోసం 26 జిల్లాలు ఫణంగా పెట్టలేమన్నారు. అమరావతిలోనే కాదు..రాయలసీమ, ఉత్తరాంధ్రలోనూ రైతులున్నారని మంత్రి రోజా గుర్తు చేశారు. అమరావతి ఉద్యమం కాదు..అత్యాసప‌రుల ఉద్యమం ఇదన్నారు.

తాజా వీడియోలు

Back to Top