ఎల్లో మీడియా రాతలు..టీడీపీ కూతలకు కరవు ప్రకటించాలా?

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి

డిజాస్టర్ మేనేజ్‌మెంట్ విధివిధానాల మేరకే ఎక్కడైనా కరవు మండలాలు ప్రకటిస్తారు

కనీస అవగాహన లేకుండా టీడీపీ లేఖలు...పచ్చ పత్రికల పిచ్చి రాతలు

కరవు రాకముందు నుంచే కరవంటూ గగ్గోలు పెట్టిన రామోజీ

ప్రభుత్వంపై బురద చల్లేలా ఎల్లో మీడియా కథనాలు

మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

రైతులను రెచ్చగొట్టాలనేదే టీడీపీ పన్నాగం.

రైతులకు ఏం ఒరగబెట్టారో చెప్పి యాత్రలు చేయండి

రైతులకు లెక్కలేనన్ని హామీలిచ్చి పంగనామాలు పెట్టింది మీరు కాదా?

రామోజీ.. బాబు హయాంలో కరవు మండలాలు కనిపించలేదా?

బాబు హయాంలో రైతులకు బీమా ఇచ్చారా? రుణమాఫీ చేశారా?:  మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి

జగన్ గారు రైతుల పక్షపాతి, రైతులకు మేలు చేస్తున్న ప్రభుత్వం ఇది

పచ్చ రాతలు చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు

7వ తేదీ పుట్టపర్తిలో రెండో విడత రైతు భరోసా విడుదల చేయనున్న సీఎం జగన్‌

రైతులను ఆదుకోవటానికి అన్నివేళలా ప్రభుత్వం సిద్ధం: మంత్రి శ్రీ కాకాణి గోవర్థన్‌రెడ్డి

నీటి పారుదల శాఖ ఇచ్చే వివరాల ప్రకారం రబీలో 2023 ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేశాం. ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం దృష్టి పెట్టడం జరిగింది. కరవు మండలాలను ప్రకటన విధానమే సరిగ్గా లేదని విమర్శలు చేస్తున్నారు. కరవు విధివిధానాలపై కేంద్ర ప్రభుత్వం సూచించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ లెక్కల ప్రకారమే ప్రకటించటం జరుగుతుంది. గతంలో సాధారణ వర్షపాతం ఎంత ఉండాలి? ఎంత తక్కువ ఉందో కూడా లెక్కలోకి తీసుకుంటారు. భూమిలో తేమ శాతం ఎంత ఉందో పరిగణలోకి తీసుకుంటారు. పంట విస్తీర్ణం ఎంత ఉండేది. ఎంత తగ్గిందో పరిగణలోకి తీసుకుని డిజాస్టర్ మేనేజ్‌మెంట్, రెవిన్యూ శాఖ కరవుపై జిల్లా కలెక్టర్‌కు రిపోర్టును అందజేస్తాయి. జిల్లా కలెక్టర్‌ ఇచ్చిన నివేదికల ప్రకారం ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం 103 కరవు మండలాలను ప్రకటించటం జరిగింది. 

 

చంద్రబాబు హయాంలో కరవు విలయతాండవం. అప్పుడు రైతులకు ఏమి మేలు చేశారో చెప్పి యాత్రలు చేయండి

కరవు మండలాలపై టీడీపీ రాజకీయం చేస్తోంది. చంద్రబాబు సీఎంగా ఉన్న 14 ఏళ్లు కరవు విలయతాండవం ఆడింది. కాబట్టి.. ఏదో ఒక విధంగా జగన్ గారి పరిపాలనలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం వచ్చింది. అయినా రైతాంగానికి ప్రభుత్వం సాయం చేస్తున్నా ఏదో విధంగా బురద చల్లాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. తద్వారా రైతులను ప్రభుత్వంపై రెచ్చగొట్టాలని దుర్మార్గమైన ఆలోచనకు టీడీపీ పూనుకుంది. దానికి పచ్చ పత్రికలు వంతపాడటం దురదృష్టకరం. రైతులకు మేలు చేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాలు మేనిఫెస్టోలో చెప్పిన దానికన్నా ఇంకా మిన్నగా అమలు చేస్తున్నాం. ప్రభుత్వంపై బురద చల్లటానికి తెలుగు రైతుల స్టీరింగ్ కమిటీ పేరుతో పంట పొలాలు పరిశీలిస్తారట. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఆరోజు వ్యవసాయ శాఖ మంత్రులుగా పత్తిపాటి పుల్లారావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రైతులకు ఏం ఒరగబెట్టారో చెప్పి పర్యటిస్తే బావుంటుంది. రైతులకు హామీలు ఇచ్చి  ఓట్లు దండుకుని మోసం చేసిన వారు ఏ ముఖం పెట్టుకుని రైతులను పరామర్శిస్తామనటం ఏమిటి? రైతు రథాల పేరుతో దండుకోవటం, నీరు-చెట్టు పేరుతో దోచుకున్నారు. దళారులను, వ్యాపారస్తులను పెట్టి రైతులకు గిట్టుబాటు ధర లేకుండా నడ్డి విరిచారు. మీ విధానాలతో రైతులు నష్టపోయారు. మీ చేష్టలతో, ప్రవర్తనతో నష్టపోయారు. 

 

వ్యవసాయంపై లోకేశ్ నాయుడు లేఖలా?

ఖరీఫ్‌లో, రబీలో ఏ పంటలు వేస్తారు. ఏ కాలువ కింద ఆయకట్టు సాగు అవుతుందో తెలియని వ్యక్తి లోకేశ్‌ కూడా వ్యవసాయంపై లేఖలు రాస్తారు. అసలు వ్యవసాయం, రైతుల సమస్యలపై లోకేశ్‌కు అవగాహన ఉందా? చర్చించగలవా? ఎన్నికలు వస్తున్నాయని రైతులను రెచ్చగొట్టాలని ఓట్లు దండుకోవాలని దుర్మార్గమైన ఆలోచనతో లోకేశ్ నాయుడు, అచ్చెన్నాయుడు లేఖలు రాశారు. 

 

వ్యవసాయం దండగ అన్నది చంద్రబాబు

గతంలో చంద్రబాబు హయాంలో వ్యవసాయం శుద్ధ దండగ అని ఆ రంగాన్నే నిర్వీర్యం చేశారు. ఈ ప్రభుత్వంలో రైతులకు జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారు. రామోజీ రావు ఒక వార్త రాశాడు. గుంటూరులో కరవు మండలాలను తగ్గించి ప్రకటన చేశారని విలేకరి ప్రశ్నించారు. ప్రభుత్వం అన్ని పరిగణలోకి తీసుకుని చేయటం జరిగిందని వివరించా. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ శాఖ విధివిధానాల ప్రకారం కరవు మండలాల ప్రకటన ఉంటుందని తెలియజేశా. అన్ని విధివిధానాలు పరిశీలించి కరవు మండలాల ప్రకటన పారదర్శకంగా చేయటం జరుగుతుంది. కనీస అవగాహన లేకుండా ఈనాడులో వార్త రాయటం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల విషయంలో వ్యవసాయ శాఖ జోక్యం చేసుకోదు. 

 

పుట్టపర్తిలో రెండో విడత రైతు భరోసా విడుదల చేయనున్న సీఎం జగన్‌

ఖరీఫ్‌కు సంబంధించి జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు లెక్కించిన తరువాత సెప్టెంబర్‌లో కరవు మండలాలు ప్రకటిస్తాం. సెప్టెంబర్ నెలాఖరు వరకు కరవుకు సంబంధించిన వివరాలన్నీ అక్టోబర్‌ 31 నాటికి కరవు మండలాలుగా ప్రకటించటం జరిగింది. రబీకి సంబంధించి అక్టోబర్‌ నుంచి మార్చి వరకు సీజన్ ఉంటుంది. మార్చి నెలాఖరు వరకు వచ్చిన వివరాలతో మార్చి నెలాఖరుతో కరవు మండలాలుగా ప్రకటించాలని ఆలోచన చేస్తున్నాం. వీటన్నింటితో పాటు రైతులకు అన్ని విధాలుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు. ఇప్పటికే మొదటి విడత రైతు భరోసా వేశాం. రెండో విడత రైతు భరోసా ఎల్లుండి (7.11.23) పుట్టపర్తి జిల్లాలో సీఎం జగన్ గారు బటన్‌ నొక్కి రైతుల ఖాతాల్లో జమ చేస్తారు. 

 

కరవు రావాలని జులై నుంచే ఈనాడులో రామోజీరావు రాతలు

ఈసారి వర్షపాతం లేదని.. ఎప్పుడు కరవు మండలాలు ప్రకటిస్తారో కూడా తెలియకుండా.. రామోజీరావు రాష్ట్రంలో కరవు రావాలని జులై నుంచే మొదలుపెట్టారు. ఈనాడు తెలుగుదేశం కరపత్రికగా మారిందని రైతులే అంటున్నారు. రైతులకు అండగా నిలబడటానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. రైతులను రెచ్చగొట్టేలా ఈనాడు రాతలు రాస్తున్నారు. ఇప్పుడు మొసలి కన్నీరు కార్చే రామోజీ.. చంద్రబాబు హయాంలో ఏనాడైనా కరవు మండలాల ప్రకటించి రైతులకు సాయం చేశారా? నష్టపోయిన రైతులకు బీమా ఇచ్చారా? రుణమాఫీ చేశారా? కానీ ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో రైతులకు సాయం అందుతోంది. నోటిఫైడ్ పంటలు నష్టపోయిన రైతులకు ఉచిత పంటల బీమా అందజేస్తున్నాం. సబ్సిడీపై విత్తనాలు ఇస్తున్నాం. రుణాలు రీషెడ్యూల్ చేస్తున్నామని మంత్రి కాకాణి వివరించారు.  పిచ్చి, పచ్చ రాతలు చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా రైతులను ఆదుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పనిచేస్తుందని కాకాణి స్పష్టం చేశారు. 

 

వర్షాభావ పరిస్థితుల్లో.. రైతులు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించాం

రాష్ట్రంలోని వర్షాభావ పరిస్థితులపై వ్యవసాయ రంగ నిపుణులతో, వాతావరణ శాఖ అధికారులతో సంప్రదించి కార్యాచరణపై చర్చించాం. రైతులకు అవసరమైన సూచనలు, సలహాలను ఆ రంగాల నిపుణులు ఇచ్చారు. దీంతో పాటు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ప్రకటించటం జరిగింది. సాగునీటి సలహా మండళ్ల సమావేశంలో వర్షాభావ పరిస్థితులపై  రైతులు ఎలాంటి పంటలు సాగు చేయాలో కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. రైతులకు సంపూర్ణ అవగాహన కల్పించటంతో పాటు, శాస్త్రవేత్తల బృందం, జలవనరుల బృందం వెళ్లి పంటలు ఎలా కాపాడటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో సూచనలు, సలహాలు అందజేయటం జరిగింది. 

 

1.13 లక్షల రైతులకు 80% సబ్సిడీతో 29 వేల క్వింటాళ్ల విత్తనాలు అందజేత

ఖరీఫ్‌లో సాధారణ వర్షపాతం 574.7 మి.మీ ఉంటే.. ఈసారి 487.2 మి.మీ దాదాపుగా 15% తక్కువగా నమోదు అయింది. దీనివల్ల సాగు విస్తీర్ణం కొంతమేర తగ్గింది. వర్షాభావ పరిస్థితుల్లో నీరు రాదేమో అనుకుని పంట వేసుకోలేదు. ప్రత్యామ్నాయ పంటలుగా ఉలవలు, అలసంద, మినుము, పెసర, కంది, రాగి, కొర్ర, జొన్న, మొన్నజొన్న, పొద్దుతిరుగుడు, తక్కువ పంట కాలం ఉండే వరి రకాలు ప్రోత్సహించాలని 1.13 లక్షల రైతులకు 80% సబ్సిడీతో రూ.26 కోట్ల విలువైన 29వేల క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేశాం.  

 

 నష్టపోయిన శనగ రైతులకు ఉచిత పంటల బీమా వర్తింపజేస్తాం

ముందస్తు రబీకి రైతులు వెళ్తారని శనగ పంటలకు సబ్సిడీని 25% నుంచి 40% పెంచి ఇవ్వటం జరిగింది. 89 వేల మంది రైతులకు రూ.40.45 కోట్ల విలువ చేసే శనగ విత్తనాలు అందజేయటం జరిగింది. నీరందక నష్టపోయిన శనగ పంట రైతులకు వారందరికీ ఉచిత పంటల బీమా పథకం వర్తింపజేస్తాం. నోటిఫైడ్ పంటలకు రైతులు కట్టాల్సిన ప్రీమియం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి వైఎస్ఆర్‌ ఉచిత పంటల బీమా పథకం క్రింద సాయం అందజేస్తాం.  ఈ-క్రాప్ అయిన నోటిఫైడ్ పంటకు ఏ రైతు ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఎంత పంట దిగుబడి వస్తుందో అంతకు సరిపడా పంట నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందజేయటం జరుగుతుంది. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ నిబంధనల మేరకు 103 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించటం జరిగింది. కరవు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో ఇన్‌పుట్ సబ్సిడీ, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ పథకం క్రింద 100-150 రోజులకు పెంచటం, లోన్ల రీషెడ్యూల్ చేయటం వంటి చర్యలు తీసుకోవటం జరుగుతుంది. 

 

రబీకి ప్రత్యామ్నాయ ప్రణాళిక సిద్ధం

రబీ కింద యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశాం. రబీలోనూ తక్కువ వర్షపాతం నమోదు అవ్వటంతో పంటలు ఆలస్యంగా సాగు చేసే అవకాశం ఉంది. రైతాంగాన్ని 4 మాసాల్లో పూర్తయ్యే వరి పంటలు వేసుకోమన్నాం. వరి నాటులు జనవరికి పూర్తి చేసుకుంటే మార్చి-ఏప్రిల్‌ నాటికి పంట చేతికి వచ్చే అవకాశం ఉంది. నార్లు పోసుకుని పంట వేయటం ఆలస్యం కాబట్టి నేరుగా విత్తు చేసుకోవమని చెప్పటం జరిగింది. కాలువ చివరి ప్రాంతాల్లో వరి కాకుండా ఇతర పంటలు వేసుకోమన్నాం. దీనికోసం రైతు భరోసా కేంద్రాల్లో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉంచటం జరిగింది.  

Back to Top