తండ్రి సంకల్పించిన ప్రాజెక్టుల‌ను తనయుడు సాకారం చేయడం అరుదు

అంబటి రాంబాబు, జలవనరుల శాఖ మంత్రి
 

నెల్లూరు:   దివంగ‌త మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి  సంకల్పించిన సంగం, నెల్లూరు బ్యారేజీల‌ను ఆయ‌న‌ తనయుడు సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సాకారం చేయడం చరిత్రలో అరుదైన ఘ‌ట‌న అని మంత్రి అంబ‌టి రాంబాబు పేర్కొన్నారు. పెన్నానదిపై సంగం వద్ద నిర్మించిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన స‌భ‌లో జలవనరుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు మాట్లాడారు. ఆయ‌న‌ ఏమన్నారంటే...

 నెల్లూరు జిల్లా ప్రజల సుదీర్ఘకాలపు స్వప్నం, దివంగత వైయస్‌ఆర్‌ గారి జలయజ్ఞంలోని సంగం, నెల్లూరు బ్యారేజ్‌లను సీఎంగారు ప్రారంభించడం అద్భుతమైన సన్నివేశం. వైయస్‌ఆర్‌ గారు సీఎంగా ఉన్నప్పుడు ఈ రెండిటికీ శంకుస్ధాపన చేశారు, తండ్రి సంకల్పించిన ఈ రెండిటినీ తనయుడు సాకారం చేయడం చరిత్రలో అరుదుగా జరిగే సంఘటన, అందుకే ఇది అద్భుతమైన ఘటన. ఈ రెండు ఆనకట్టలు బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాతంత్య్రం రాకముందు 1882కు పూర్వం ఏర్పాటుచేశారు, దీని పరిధిలో ఎన్నో ఎకరాల ఆయుకట్టు సాగవుతుంది, కానీ ఆ తర్వాత విస్తీర్ణం పెరిగి రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు, వారు కొత్త బ్యారేజ్‌లు కావాలని కోరుకున్నారు, స్వాతంత్య్రం తర్వాత అనేక ప్రభుత్వాలు, ముఖ్యమంత్రులు వచ్చినా ఎవరూ దీనిపై దృష్టిపెట్టలేదు. కానీ వైయస్‌ఆర్‌ గారు దీనిపై దృష్టిపెట్టి సముద్రంలో కలిసిపోతున్న అనేక టీఎంసీల నీటిని వినియోగించుకోవాలనుకున్నారు, అందులో భాగంగానే 2006లో సంగం బ్యారేజ్‌ను, 2008లో నెల్లూరు బ్యారేజ్‌కు ఆయన శంకుస్ధాపన చేశారు. కానీ ఆ తర్వాత ప్రభుత్వాల సమయంలో పనులు జరగలేదు, ఏదైనా జరిగినా కమీషన్ల కోసమే జరిగాయి, కానీ శ్రీ జగన్‌ గారు సీఎం అయిన తర్వాత వీటిని పూర్తిచేసి జాతికి అంకితం చేశారు. మేకపాటి గారి కుటుంబం గురించి అందరికీ తెలుసు, మేకపాటి గౌతమ్‌ను మంచి శాఖకు మంత్రిగా చేశారు, కానీ ఆయన అకాలమరణం తర్వాత ఈ సంగం బ్యారేజ్‌కు మేకపాటి గౌతమ్‌ సంగం బ్యారేజ్‌గా నామకరణం చేశారు, ఈ రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించడమే కాదు, తరుచుగా కరువుకు గురవుతున్న ప్రాంతాలను దృష్టిలో పెట్టుకుని జలయజ్ఞం ప్రాజెక్ట్‌లు ఏవయితే డాక్టర్‌ వైయస్‌ఆర్‌ గారు మొదలుపెట్టినవి అన్నీ శ్రీ జగన్‌గారు ప్రారంభిస్తారు, ఇది దైవ సంకల్పం, మళ్ళీ మళ్ళీ జగనన్నే వస్తారు, అన్ని ప్రాజెక్ట్‌లు పూర్తిచేసి ప్రారంభిస్తారు, ధన్యవాదాలు అంటూ అంబ‌టి రాంబాబు త‌న ప్ర‌సంగాన్ని ముగించారు.

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top