ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధితో అమలు చేస్తున్నాం

మంత్రి విశ్వరూప్‌

అసెంబ్లీ: ఎన్నికల్లో ఇచ్చిన ప్రతీ హామీని చిత్తశుద్ధిగా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని మంత్రి విశ్వరూప్‌ అన్నారు. సీఎం వైయస్‌ జగన్‌ ప్రతి విషయాన్ని చాలా సూక్ష్మంగా ఆలోచిస్తారన్నారు. అసెంబ్లీలో మంత్రి విశ్వరూప్‌ మాట్లాడుతూ.. చెప్పింది చెప్పినట్లుగా అమలు చేస్తున్నారని, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని ఈర్ష్యతో కొన్ని పత్రికలు విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. సీఎం వైయస్‌ జగన్‌ చాలా సూక్ష్మంగా ఆలోచించి సంపూర్ణ పోషణ పథకాన్ని తీసుకువచ్చారన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో చిన్నారుల కోసం దగ్గరుండి మరీ మెనూను తయారు చేశారన్నారు. 18 నెలల పాలనలోనే మేనిఫెస్టోలోని అంశాలను 90 శాతం నెరవేర్చాడన్నారు. చంద్రబాబు 650 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా అమలు చేయలేదన్నారు. బాబు లాంటి వ్యక్తులకు మా ప్రభుత్వంపై విమర్శలు చేసే హక్కులేదన్నారు. 
 

Back to Top