రేపల్లె రైల్వేస్టేషన్‌ ఘటన అత్యంత బాధాకరం

 మంత్రి విడదల రజిని
 

 గుంటూరు: రేపల్లె రైల్వే స్టేషన్  ఘటన అత్యంత బాధాకరమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని అన్నారు.  మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఒక మహిళగా, తల్లిగా తనకు చాలా బాధ వేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పొట్టకూటి కోసం వెళ్లిన ఒక మహిళపై అత్యాచారం చేయడం హేయమన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘటనను సీరియస్‌గా తీసుకోవాలని పోలీసులకు సూచించడంతో పాటు బాధితురాలికి మెరుగైన వైద్యం అందించాలని రిమ్స్ అధికారులను ఆదేశించారని తెలిపారు.

నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వం బాధితుల కుటుంబానికి అండగా ఉంటామనే అన్నారు. బాధితురాలికి రూ.2 లక్షల తక్షణ సాయం చెక్కును అందించారు. నిందితులకు కఠిన శిక్షపడేలా చేస్తామని పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top