ఈనాడును బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయి

రామోజీరావు రాతలపై మంత్రి చెల్లుబోయిన ఫైర్‌

విజయవాడ: బాధ్యత మరిచి తప్పుడు కథనాలు రాస్తున్న ఈనాడు పత్రికను ప్రజలు బహిష్కరించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ అన్నారు. ఈనాడు రామోజీరావు తప్పుడు రాతలపై మంత్రి ఫైర్‌ అయ్యారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌.అంబేడ్కర్‌కు అసలైన నివాళులర్పించిన నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌ అని కొనియాడారు. ప్రభుత్వంపై ఈనాడు తప్పుడు రాతలు రాస్తోందని, ప్రజలకు మంచి జరిగితే ఈనాడుకు నచ్చదన్నారు. అమ్మ ఒడి పథకం ద్వారా బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన జరుగుతుందన్నారు. రామోజీరావు ఈ నీచపు రాతల ద్వారా సమాజానికి ఇచ్చే సందేశమేంటీ..? చంద్రబాబు చెప్పే అబద్ధాలు రాయడమే రామోజీరావు పనా..? అని ప్రశ్నించారు. ఈనాడు వార్తలు అంబేద్కర్‌ను అవమానించినట్లుగానే తాము భావిస్తున్నామ‌ని, ఈనాడు పత్రిక యాజ‌మాన్యం తక్షణమే డా.బి.ఆర్.అంబేద్కర్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Back to Top