పవన్.. మహిళా వాలంటీర్లను అవమానించాడు 

 మంత్రి వేణుగోపాలకృష్ణ
 

తూర్పు గోదావ‌రి జిల్లా: పవన్ కళ్యాణ్ మ‌హిళా వాలంటీర్ల‌ను అవ‌మానించాడ‌ని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు.  ఏలూరు వారాహియాత్ర సభలో పవన్ చేసిన వ్యాఖ్యలు దారుణమని ఖండించారు. మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని అన్నారు. వాలంటీర్లను జనం తమ కుటుంబంలో సభ్యులుగా చూస్తున్నారని, పవన్ కళ్యాణ్‌ను జనం క్షమించరని తేల్చి చెప్పారు. పవన్ కచ్ఛితంగా జనాగ్రహానికి గురికావాల్సిందేనని ఫైర్ అయ్యారు. 

Back to Top