నేడు జోగి రమేష్‌ కుటుంబానికి వైయ‌స్‌ జగన్‌ పరామర్శ 

 విజయవాడ: టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన బీసీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ కుటుంబాన్ని వైయ‌స్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం పరామర్శించనున్నారు.  
వైయ‌ జగన్‌ గుంటూరు జిల్లా తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10.30 గంటలకు ఇబ్రహింపట్నానికి బయలుదేరుతారు. కనకదుర్గ వారధి, బస్‌ స్టాండ్‌, కనకదుర్గ ఫ్లైఓవర్‌, భవానీపురం, గొల్లపూడి, గుంటుపల్లి, తుమ్మలపాలెం మార్గంగా ఇబ్రహింపట్నంలోని మాజీ మంత్రి జోగి రమేష్‌ నివాసానికి చేరుకుంటారు.

ఇటీవల జరిగిన దాడిలో జోగి రమేష్‌ ఇంటిపై విధ్వంసం చోటుచేసుకోవడంతో పాటు కుటుంబ సభ్యులు భయాందోళనలకు గురయ్యారు. ఈ నేపథ్యంలో బాధిత కుటుంబానికి సంఘీభావం తెలిపేందుకు వైయస్‌ జగన్‌ స్వయంగా వెళ్లి పరామర్శించనున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి పరిస్థితులను తెలుసుకుంటారు.
పరామర్శ అనంతరం మధ్యాహ్నం వైయస్‌ జగన్‌ తిరిగి తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.  

Back to Top