ఈనెల 17న బీసీల సంక్రాంతి సభ

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

విజయవాడ: ఈనెల 17వ తేదీన బీసీల సంక్రాంతి సభ నిర్వహించనున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో బీసీల సంక్రాంతి స‌భ‌ ఏర్పాట్లను మంత్రి వేణుగోపాలకృష్ణ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీసీల్లో పుట్టినందుకు అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. బీసీలంటే బ్యాక్‌ వర్డ్‌ క్లాసులు కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాసులని చెప్పిన సీఎం వైయస్‌ జగన్‌.. ఆ దిశగానే బలహీనవర్గాల సంక్షేమం కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి చరిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారన్నారు. బీసీల ఆర్థిక, రాజకీయ అభ్యున్నతికి సీఎం పెద్దపీట వేశారన్నారు. 50 శాతానికి పైగా మహిళలకు పదవులిచ్చి మహాత్మా జ్యోతి రావు పూలే ఆశయాలను సీఎం నెరవేర్చారన్నారు. ప్రతి బీసీ ఇంట్లో సీఎం వైయస్‌ జగన్‌ ఉంటారన్నారు. 

 

Back to Top