బినామీలను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు ఆరాటం

మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజ‌య‌వాడ‌: బినామీలను కాపాడుకోవడం కోసమే చంద్రబాబు ఆరాటమని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మూడు రాజధానుల కోసం దళితులు చేస్తున్నది ఉద్యమం కాదా? అని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభిమతం అన్నారు. అమరావతితో పాటు అన్ని ప్రాంతాలను అభివృద్ది చేస్తాం.

మూడు రాజధానులు వచ్చి తీరతాయని ఆయన స్పష్టం చేశారు. ఇన్‌ సైడర్‌ ట్రేడింగ్‌పై సుప్రీం తీర్పు అంటూ మాట్లాడుతున్నారు.. చంద్రబాబు చేసిన అక్రమాలు ఏమిటో అందరికీ తెలుసునన్నారు. మొన్నటి ఎన్నికల్లో అమరావతి కోసం ప్రజల్ని రెచ్చగొట్టాలని చంద్రబాబు ప్రయత్నం చేశారని, కానీ ప్రజలు దానికి భిన్నంగా తీర్పు ఇచ్చారన్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయాలన్నదే తమ సంకల్పం అని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. 

Back to Top