దుర్గమ్మ సన్నిధిలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌

విజయవాడ: అందరికీ జ్ఞానం కలగాలని, మంచి జరగాలని సరస్వతి యాగం నిర్వహిస్తున్నామని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ అన్నారు. సరస్వతి మాత వసంత పంచమి సందర్భంగా విద్యార్థులకు మంత్రి వెల్లంపల్లి కంకణం, పెన్నులు, ప్రసాదం అందజేశారు. గురువారం అమ్మవారి జన్మనక్షత్రం కావండంతో ఇంద్రకీలాద్రీ దుర్గామాత సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ అమ్మఒడి పథకం ద్వారా రూ. 15వేలు ప్రతి విద్యార్థికి అందిస్తున్నామన్నారు. మధ్యాహ్నం భోజన పథకంలో నాణ్యమైన ఆహారం అందించాలని అధికారులకు ఆదేశించినట్లు ఆయన తెలిపారు.

Back to Top