వికేంద్రీకరణతో సర్వతోముఖాభివృద్ధి

రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత
 

 

అసెంబ్లీ: వికేంద్రీకరణ నిర్ణయంతో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని, వికేందీకరణ బిల్లుకు గుంటూరు వాసిగా మద్దతు తెలుపుతున్నానని రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. అసెంబ్లీలో మంత్రి సుచరిత మాట్లాడుతూ.. ఈ బిల్లు ద్వారా శతాబ్దాల భవిష్యత్తుకు చక్కటి పునాది ఏర్పడుతుంది. ప్రభుత్వం ఏర్పటైన నాటి నుంచి తీసుకొస్తున్న సంస్కరణలు, నిర్ణయాలు చూస్తుంటే రాజకీయంగా విమర్శించి, విభేదించే వారు కూడా ప్రభుత్వ నిర్ణయాలను అంగీకరిస్తున్నారు. వర్గం, కులం, పార్టీలు చూడకుండా వివక్ష చూపకుండా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం ఆలోచన చేయడం గొప్ప విషయం. భవిష్యత్తు గొప్ప అభివృద్ధి సాధించాలంటే మొదట ప్రాంతీయ అసమానతలు, అవమానాలు, అభిప్రాయ భేదాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉంది. అలా జరగాలంటే అన్ని ప్రాంతాల ఆకాంక్షలను, అభిప్రాయాలను గౌరవించాల్సిన అవసరం ఉంది. ప్రాంతాల అభివృద్ధికి అసెంబ్లీ లాంటి దేవాలయంలో నిర్ణయాలు తీసుకున్నప్పుడు వారి ఆశలను సజీవంగా ఉంచగలుగుతాం. అప్పుడు మాత్రమే అన్ని ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి చూడగలుగుతాం. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందడుగు వేస్తుంది. ఇది రాష్ట్ర చరిత్రలోనే కాదు.. దేశ చరిత్రలో సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. అలాంటి గొప్ప నిర్ణయాన్ని అమలు చేస్తున్న సీఎం వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పనిచేస్తున్నందుకు గర్వంగా ఉంది. ప్రభుత్వం తీసుకుంటున్న వికేంద్రీకరణ నిర్ణయం చరిత్రలో మేలిమలుపు అవుతుంది. అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు విస్తరింపజేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూస్తే.. 43 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం ద్వారా మేలు చేశాం. 46 లక్షల మంది రైతు సోదరులకు రైతు భరోసా అందించడం జరిగింది. అలాగే ఆటో డ్రైవర్లు, మత్స్యకారులు, చేనేతలను ఇలా అందరినీ ఆదుకోవడం జరిగింది. గ్రామ సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ తీసుకువచ్చి యువతకు ఉద్యోగాలు కల్పించారు. ప్రభుత్వ పథకాలు గుమ్మం ముందుకు తీసుకువచ్చింది ఈ ప్రభుత్వమే. ఇది చాలా గొప్ప విషయం. మా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం, ఎక్కడా రైతులకు, రైతు కూలీలకు కష్టం, నష్టం జరగకుండా చూస్తున్నాం. ఇది వరకు 10 సంవత్సరాలు రైతులకు ఇస్తామన్న యాన్యూవిటీని 15 సంవత్సరాలు పెంచి ఘనత సీఎం వైయస్‌ జగన్‌కు దక్కుతుంది.

Back to Top