చంద్రబాబు ఇప్పటివరకు స్టే లు తెచ్చుకొని బ‌తికాడు

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ 

విశాఖ‌: చంద్రబాబు ఇప్పటివరకు స్టేలు తెచ్చుకొని బ‌తికాడని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో కూడా అలాగే తప్పించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ కుదరలేద‌న్నారు. మళ్లీ బయటకు వచ్చి సానుభూతి పొందాలని చూస్తున్నాడ‌ని త‌ప్పుప‌ట్టారు. అసెంబ్లీలో టిడిపి ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించార‌ని మండిప‌డ్డారు. దోచుకుతిన్నోళ్లను వదలిపెట్టాలని అసెంబ్లీ లో గొడవ చేశారు. అలా వదలటానికి కుదరద‌ని హెచ్చ‌రించారు. శాసనసభలో చంద్ర‌బాబు అవినీతిపై చర్చకు అవకాశం ఉన్నప్పటికీ టీడీపీ స‌భ్యులు చర్చించకుండా పారిపోయారు. అవినీతి జరిగిందని అసెంబ్లీలో ఉన్న టిడిపి ఎమ్మెల్యేలకి కూడా తెలుసు అన్నారు. స్కిల్‌ డెవలప్మెంట్ స్కాం లో అందరూ కలిసి దోచుకుతిన్నారు. సెక్షన్లు వర్తించవని అంటున్నారు తప్పా అవినీతి జరగలేదని అనడం లేదు. వైయ‌స్ఆర్‌సీపీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాల‌ని, దొంగలకు, దోపిడీదారులకు ప్ర‌జ‌లు గుణపాఠం చెప్పాల‌ని మంత్రి బొత్స స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top