మహిళాభివృద్ధిని అడ్డుకుంటుంది చంద్రబాబే..

‘వైయస్‌ఆర్‌ ఆసరా’ ఉత్సవాలు చూసి ఓర్వలేక డైవర్ట్‌ పాలిటిక్స్‌

23 సీట్లతో కన్నుపొడిచినా బాబుకు ఇంకా బుద్ధిరాలేదు

ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేందుకు టీడీపీ కుట్ర

మహాభారతంలోని విలనిజం నుంచి స్ఫూర్తి పొందిన బాబు

పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం: ప్రతి పల్లె, పట్టణంలో పెద్ద ఎత్తున జరుగుతున్న ‘వైయస్‌ఆర్‌ ఆసరా’ ఉత్సవాలను చూసి ఓర్వలేక చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడని పశుసంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. డ్వాక్రా సంఘాల మహిళల ఖాతాల్లో రెండో విడత డబ్బులు జమ అవ్వడాన్ని చూసి తట్టుకోలేక డైవర్ట్‌ పాలిటిక్స్‌కు చంద్రబాబు విశ్వప్రయత్నాలు చేస్తున్నాడని మండిపడ్డారు. మహాభారతంలోని శకుని పాత్రను పోషిస్తున్నాడని, 23 సీట్లతో కన్నుపొడిచినా ఇంకా బాబుకు బుద్ధిరాలేదన్నారు. శ్రీకాకుళం జిల్లా వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంత్రి సీదిరి అప్పలరాజు విలేకరుల సమావేశం నిర్వహించారు. 

సంబంధం లేని విషయాలను, ప్రమేయం లేని విషయాలను రాష్ట్ర ప్రభుత్వం మీద రుద్ధడానికి ప్రతిపక్ష తెలుగుదేశం విశ్వ ప్రయత్నాలు చేస్తోందని మంత్రి అప్పలరాజు మండిపడ్డారు. డ్రగ్‌ మాఫియా ఏపీ నుంచే జరుగుతుందని, ఎక్కడో ముంద్ర పోర్టులో పట్టుబడిన డ్రగ్స్‌ను ప్రభుత్వానికి అంటగట్టేందుకు తన అనుకూల మీడియా ఛానళ్లు, పత్రికల్లో విషం చిమ్మించారని, డ్రగ్స్‌తో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎలాంటి సంబంధం లేదని భారత హోంశాఖ తేల్చిన తరువాత చంద్రబాబు తన కుట్రలు ఆపేశారని ధ్వజమెత్తారు. 

మళ్లీ ఇప్పుడు పేదలందరికీ ఇళ్ల పథకం మీద కోర్టులో స్టే తీసుకువచ్చి మూడు రోజులుగా రాక్షసానందం పొందుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలపై మంత్రి సీదిరి అప్పలరాజు మండిపడ్డారు. కోర్టు స్టే ఇచ్చిన తరువాత టీడీపీ నేతలంతా మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వంలోని వారే.. ప్రభుత్వం మీద కేసులు వేసుకొని ఇళ్ల నిర్మాణ ఆపేసుకుంటున్నారని చంద్రబాబు ఒక వితండవాదాన్ని తీసుకువచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

మహాభారతంలో ఏం జరిగిందో ఆంధ్రప్రదేశ్‌లో అదే జరుగుతుందన్నారు. మహిళల హక్కులకు భంగం కలిగితే.. ఏ గడ్డ మీదైనా మహిళలు అవమానింపబడితే దాని ఫలితం ఎలా ఉంటుందో మహాభారతం మనకు కళ్లకు కట్టినట్టు తెలియజేస్తుందన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం మహిళలకు చేస్తున్న మేలు చూసి  ఓర్వలేక ప్రతి దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు కోర్టుకు వెళ్తున్నారని, చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మహిళల మీద అనేక ఆకృత్యాలు జరిగాయని, దాడులకు పాల్పడ్డారన్నారు. దాని ఫలితమే టీడీపీకి 23 సీట్లు వచ్చాయని, అయినా బాబుకు బుద్ధిరాలేదన్నారు. ఇంకా శకుని పాత్ర పోషిస్తూనే ఉన్నాడని, మహాభారతంలోని విలనిజం నుంచి చంద్రబాబు స్ఫూర్తి పొంది ఉంటాడని మంత్రి సీదిరి అభిప్రాయపడ్డారు.

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top