అమరావతి: అమూల్ అన్నది కార్పొరేట్ సంస్థ కాదు. దాని యజమానులు అందరూ కూడా రైతేలు అని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. అమూల్‌కు కట్టబెడుతున్నామన్నది అవాస్తం. గతంలో గ్రామ స్థాయిలో కో-ఆపరేటివ్ సొసైటీ ఉండాలి. జిల్లా స్థాయి, రాష్ట్రస్థాయి యూనియన్లను చంద్రబాబు పూర్తిగా నిర్వీర్యం చేశారు. వైయస్ జగన్ పాదయాత్రలో ఇవన్నీ గమనించి, మహిళా పాడి రైతుల ఆవేదన విన్న మా నాయకుడు సంస్కరణలు తెచ్చారు. ప్రతి లీటర్ పాలకు అదనంగా రూ.4 ఇస్తామన్నారు. ఈ రోజు అంతకు మించి ఇస్తున్నాం. ఇది ఒక చరిత్ర. అమూల్ అన్నది కార్పొరేట్ సంస్థ కాదని మంత్రి సీదిరి అప్పలరాజు స్పష్టం చేశారు. గ్రామాల్లో పాల సేకరణ కేంద్రాలు, బల్స్ మిల్క్ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఒక్క రో్జు 400 లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. కో-ఆపరేటివ్ సొసైటీలు 60 లక్షల లీటర్లు మార్కెట్ చేస్తున్నాయి. ఇంకా 200 లక్షల లీటర్లు సర్‌ఫ్లస్‌గా ఉన్నాయి. ఈ పాలను మార్కెట్ చేసేందుకు అమూల్ సంస్థను తెచ్చాం. ఇందులో చంద్రబాబుకు వచ్చిన నష్టం ఏంటని మంత్రి సీదిరి అప్పలరాజు ప్రశ్నించారు. కార్పొరేట్ కంపెనీలు ఎన్ని వచ్చినా తిరస్కరించామని అప్పలరాజు తెలిపారు.