కందుకూరు ఘటనపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలి

ముమ్మాటికీ రాజకీయ హత్యలే.. ప్రచార పిచ్చితో 8మందిని బాబు బలిగొన్నాడు

పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజం

విజయవాడ: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే కందుకూరులో 8 మంది అమాయకులు మృతిచెందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్‌ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. కందుకూరు చంద్ర‌బాబు స‌భ‌లో జ‌రిగిన‌వి ముమ్మాటికీ రాజ‌కీయ హ‌త్య‌లేన‌న్నారు.

Back to Top