క్రీడాకారులు అధైర్య ప‌డొద్దు

మంత్రి ఆర్కే రోజా
 

తిరుప‌తి: యువత క్రీడల పట్ల ఆశక్తి చూపడం వల్ల మంచి శారీరక దారుఢ్యం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చు అని రాష్ట్ర  మంత్రి ఆర్కే రోజా అన్నారు. ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించడానికి అన్ని విధాల సహాయసహకారాలు అందిస్తుంద‌ని, ఆసక్తి ఉన్నక్రీడాకారులు ఎక్కడా అదైర్య పడకండి అని మంత్రి భ‌రోసా క‌ల్పించారు. యువత క్రీడల్లో ఆసక్తి చూపించాలి, గెలుపు ఓటమి రెండూ మనల్ని మానసికంగా బలంగా తయారు చేస్తుంద‌ని ఆర్కే రోజా అన్నారు. తిరుపతి శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్  ఆవరణలో  నిర్వహించిన 66వ రాష్ట్ర స్ధాయి రోల్ బాల్ క్రీడా పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఈ పోటీలను రాష్ట్ర నలుమూలలు నుంచి అన్ని జిల్లాల క్రీడాకారులు పాల్గొన్నారు.  రాష్ట్ర స్ధాయి పోటీల ముగింపు కార్యక్రమంలో మంత్రి పాల్గొని బ‌హుమ‌తులు ప్ర‌ధానం చేశారు.  ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి  రోల్ బాల్ టోర్నమెంట్ నిర్వ‌హించ‌డం అభినంద‌నీయ‌మ‌న్నారు.  అండర్ 17 బాయ్స్ రోల్ బాల్ చాంఫియన్ షిప్ ని చిత్తూరు జిల్లా జట్టు 6-3 స్కోర్ తేడాతో విశాఖపట్నం జిల్లా జట్టుపై ఘన విజయం సాదించి ట్రోఫీని కైవసం చేసుకుంద‌ని తెలిపారు. అండర్ 17 గర్ల్స్ విభాగంలో ప్రధమ స్థానం కృష్ణా జిల్లా, ద్వితీయ స్ధానం నెల్లూరు జిల్లా జట్టు, అండర్ 14 బాయ్స్ విభాగంలో ప్రధమ స్ధానం చిత్తూరు జిల్లా జట్టు, ద్వితీయ స్ధానం కృష్ణా జిల్లా జట్టు, అండర్ 14 గర్ల్స్ విభాగంలో ప్రధమ స్ధానం కృష్ణాజిల్లా జట్టు, ద్వితీయ స్ధానం నెల్లూరు జిలా జట్లు గెలుపొందాయ‌ని మంత్రి వెల్ల‌డించారు.  

Back to Top