మహిళా పక్షపాతి సీఎం వైయస్‌ జగన్‌

మంత్రి ఆర్కే రోజా

 తిరుప‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌హిళా ప‌క్ష‌పాతి అని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. ఒక మగాడి విజయం వెనుక స్త్రీ ఉంటుంది.. కానీ, స్త్రీ విజయం వెనుక ఒక స్త్రీ నే ఉంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు . పద్మావతి మహిళా యూనివర్సిటీ మహిళ సాధికారత సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..  చరిత్రలో ఎవరు చేయని విధంగా మహిళల కోసం సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ కృషి చేస్తున్నారని.. లక్షలాది మహిళల అకౌంట్స్‌లో నేరుగా కోట్లాది రూపాయల డబ్బులు వేస్తున్నారని ప్రశంసలు కురిపించారు. పాలు ఇచ్చే స్థాయి నుంచి పాలించే స్ధాయికి దేశంలో మహిళలు ఎదిగారు.. 33 శాతం రిజర్వేషన్ల ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. రిజర్వేషన్ల ఇవ్వకుండానే ప్రపంచంలో ఎన్నో విజయాలు సాధించిన ఘనత మహిళలది.. విద్యా, సినిమా, రాజకీయాలు ఎక్కడైనా సరే.. మహిళలను వెనక్కి తరిమేసిలా ప్రయత్నం చేస్తుంటారని.. మనం చేస్తున్న పని తప్పా, ఒప్పా అని మనకు తెలుస్తే చాలు.. మహిళలు విమర్శలకు భయపడి పారిపోకూడదు.. పోరాటం మాత్రమే చేయాలని మంత్రి రోజా పిలుపునిచ్చారు.

 
లింగ వివక్షత అనేది సమాజంలో ఉండకూడదు.. కొత్త జనరేషన్, యువతరం దానిని మార్చాలని మంత్రి రోజా కోరారు. సినిమా వాళ్లు బ్లూ ఫిలింలు చేస్తారని ఒక పనికి మాలిన వెధ‌వ‌ మాట్లాడు.. మనం చేస్తున్న పని తప్పా? కాదా? అని మనకు తెలిస్తే చాలు.. మన మనసాక్షికి తెలిస్తే చాలు.. ఎవరో ఎదో తిట్టారని భయపడి వెనక్కి అడుగు వేయకుండా ముందుకే వెళ్లాలన్నారు. మహిళల కోసం ఎంతో పోరాటం చేశాను.. ఉద్యమాలు చేశానని ఈ సందర్భంగా మంత్రి రోజా గుర్తుచేసుకున్నారు.

Back to Top