విశాఖపట్నం: తరతరాలుగా వెనుకబాటుకు గురై బతుకు కోసం, భవిష్యత్తు కోసం బాధ్యతగా ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఉద్యమం చేస్తుంటే.. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం, పవన్ కల్యాణ్ ప్యాకేజీ కోసం ఆరాటపడుతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. 26 జిల్లాల అభివృద్ధిని 29 గ్రామాల్లో పెట్టమనే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, పవన్ గజ్జికుక్కలు, పిచ్చి కుక్కలు, ఊరకుక్కలు అని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ ద్రోహులు అని అన్నారు. విశాఖ గర్జన ర్యాలీ అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి ఆర్కే రోజా మాట్లాడారు. ‘‘రాయలసీమ గడ్డ మీద పుట్టిన నేను ఉత్తరాంధ్ర ఉద్యమానికి మద్దతిస్తున్నానంటే జగనన్న అజెండా ఎంత గొప్పదో ఆలోచించండి. కేంద్రం, ప్రపంచంలో చక్రం తిప్పామని చెప్పుకునే తుప్పుబట్టిన సైకిల్ చక్రాలు ఈ రాష్ట్రాన్ని ముక్కలుచెక్కలు చేసి అప్పుల ఊబిలో ముంచేశారు. చంద్రబాబు నాయుడు చేసిన వెధవ పనుల వల్ల.. అత్యాశతో దోచుకొని దాచుకోవడం వల్ల మన ప్రాంతాలన్నీ అన్యాయం అయిపోయాయి. అమరావతిలో మొత్తం సంపద కుమ్మరిస్తే భవిష్యత్ తరాల్లో ఉత్తరాంధ్ర, రాయలసీమ అన్యాయమైపోతాయి. మూడు ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలని గొప్ప మనసుతో సీఎం వైయస్ జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రజలు సీఎం నిర్ణయానికి మద్దతు తెలుపుతుంటే.. ఆంధ్రప్రదేశ్ ద్రోహులు చంద్రబాబు, పవన్ కల్యాణ్ మాత్రం అమరావతిలోని పెయిడ్ ఆర్టిస్టులు, పెయిడ్ రైతులకు సపోర్టు చేస్తున్నవారిని తరిమికొట్టాలి. పవన్ కల్యాణ్‌కు పెళ్లిచేసుకోవడానికి విశాఖ అమ్మాయి కావాలి.. షూటింగ్‌లకు వైజాగ్ కావాలి. సినిమా కలెక్షన్‌ల కోసం వైజాగ్ కావాలి. నటన నేర్చుకోవడానికి వైజాగ్ కావాలి. పోటీ చేయడానికి వైజాగ్ కావాలి.. కానీ వైజాగ్‌లో పరిపాలన రాజధాని పెడతామంటే వద్దూ అంటున్నాడంటే.. ఈ ప్రాంతం అభివృద్ధి చెందడం పవన్‌కు నచ్చదు అనేది స్పష్టంగా అర్థం అవుతుంది. గాజువాక ప్రజలకు పవన్ గురించి ముందే తెలిసింది కాబట్టే చిత్తుగా ఓడించారు. అమరావతితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పోరాడుతుంటే.. కుదరదు.. మొత్తం అమరావతిలో పెట్టాలని కుట్రలు చేస్తున్నారు. తన బినామీల కోసం, సూట్‌కేసులు ఎక్కడపోతాయనే భయంతో రైతుల ముసుగులో క్యాట్ వాక్‌తో చేస్తున్న పోరాటం ప్రజలంతా చూస్తున్నారు. బతుకుకోసం, భవిష్యత్తు కోసం, బాధ్యతగా మనం పోరాటం చేస్తున్నాం. వాళ్లు రియల్ ఎస్టేట్ కోసం పోరాటం చేస్తుంటే.. మనం ఆంధ్ర స్టేట్ కోసం పోరాటం చేస్తున్నామని ప్రజలంతా గమనించారు కాబట్టే సముద్రం రోడ్డు మీదకు వచ్చిందన్నట్టుగా ప్రజలంతా రోడ్ల నిండా వర్షం వస్తున్నా ర్యాలీలో పాల్గొన్నారు. ఆకలి పోరాటం విలువ తెలిసినవారం కాబట్టే ఈరోజు హక్కుల కోసం, వలసల విముక్తి కోసం వచ్చాం. రాయలసీమ, ఉత్తరాంధ్ర గొంతుకోసి సిగ్గులేకుండా చంద్రబాబు ఈ ప్రాంతంలో చిచ్చుపెట్టడానికి అమరావతి నుంచి పెయిడ్ ఆర్టిస్టులను విశాఖకు పంపించి ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని కుట్ర పన్నుతున్నాడు. ఉత్తరాంధ్రకు రాయలసీమ, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు సపోర్టు ఉంది. మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ విజన్‌తో వికేంద్రీకరణను తీసుకొచ్చారు. అమరావతి అనే ఉద్యమం చంద్రబాబు తన ఏటీఎం కోసం తీసుకొచ్చారు. చంద్రబాబు, దత్తపుత్రుడు, ఉత్తపుత్రుడికి సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని మంత్రి ఆర్కే రోజా అన్నారు.