బ్రహ్మిణికి ఏం తెలుసని మాట్లాడుతున్నారు..

తల్లిని తిట్టిన వ్యక్తితో పొత్తు పెట్టుకున్న వ్యక్తి పవన్‌

ఉద్యోగాలు పేరుతో చంద్రబాబు యువతను మోసం చేశారు

మంత్రి ఆర్‌కే రోజా 

తాడేప‌ల్లి:లోకేష్ ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలీదు.  బ్రహ్మణికి ఏం తెలుసనీ మాట్లాడుతున్నార‌ని మంత్రి ఆర్కే రోజా ప్ర‌శ్నించారు. స్కిల్ స్కామ్ గురించి వీరెవరూ ఎందుకు మాట్లాడరని నిల‌దీశారు.   టీడీపీతో పొత్తు ఉంటుందని ప్రకటించిన పవన్‌ కళ్యాణ్‌ తనను నమ్మిన అభిమానులని మోసం చేశారని మండిపడ్డారు మంత్రి ఆర్‌కే రోజా. జైలులో చంద్రబాబుతో ప్యాకేజీ మాట్లాడుకున్న వ్యక్తి పవన్‌ కళ్యాణ్‌ అంటూ ధ్వజమెత్తారు. కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని వ్యక్తి పవన్‌ అని విమర్శించారు మంత్రి రోజా. రెండు చోట్ల ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన పవన్‌.. సీఎం జగన్‌ గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు సీఎం జగన్‌ అని మరోసారి గుర్తుచేశారు రోజా. 

 

రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి  ఆర్కే రోజా  ఇంకా ఏం మాట్లాడారంటే: 

*వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నీ బతుకెంత పవన్‌ కల్యాణ్‌?:*

  • పవన్‌ కల్యాణ్‌ షూటింగ్‌ గ్యాప్‌లో హడావుడిగా వచ్చి ఒక ప్రెస్‌ మీట్‌ పెట్టాడు. 
  • పచ్చకామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు ఈ పిచ్చి కల్యాణ్‌కి లోకమంతా పిచ్చోళ్లలా కనిపిస్తున్నారు. 
  • జైళ్లో ఉన్న చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ప్యాకేజీ కోసం తన కార్యకర్తలను, అభిమానులను, సామాజిక వర్గం వారిని అమ్మేశాడని అందరూ ఛీ కొడుతున్నారని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. 
  • అసలు నీ బతుకెంత..నువ్వెంతా...నీ స్థాయి ఎంత పవన్‌ కల్యాణ్‌. 
  • జగన్‌ గారు రాజకీయాల్లోకి వచ్చి 13 ఏళ్లు అవుతోంది. రెండు సార్లు ఎంపీ అయ్యారు..రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు. 
  • ఒక సారి ప్రతిపక్షనేతగా, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. 
  • నువ్వు రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్లు అవుతోంది. కనీసం ఒక వార్డు మెంబర్‌ కూడా కాలేదు. నువ్వెంత నీ బతుకెంత..? 
  • తన ఒంటి చేత్తో 151 ఎమ్మెల్యేలను గెలిపించుకున్న జగన్‌గారు ఎక్కడా.? రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన నువ్వెక్కడ..? 
  • 22 మంది ఎంపీలను తన జెండా, ఎజెండాతో గెలిపించుకున్న నాయకుడు జగన్మోహన్‌రెడ్డి గారు. 
  • నీ సొంత అన్ననే ఎంపీగా గెలిపించుకోలేక చతికిలపడ్డ వాడివి నువ్వు. 
  • ప్రజలకి ఇచ్చిన మాట కోసం దేశాన్ని గడగడలాడించిన సోనియానే ఢీకొన్న దమ్మున్న నాయకుడు జగన్‌ గారు. 
  • నీ తల్లి తిట్టిన వాడితో ప్యాకేజీ కోసం బానిస బతుకు బతుకుతున్న నువ్వెంత..? 
  • ఈ రాష్ట్ర చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని రీతిలో 82 శాతం సీట్లతో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి జగన్మోహన్‌రెడ్డి గారు. 
  • మీరు 136 స్థానాల్లో పోటీ చేస్తే 120 చోట్ల డిపాజిట్లు గల్లంతయ్యాయి..అదీ నీ బతుకు..
  • జగన్‌ గారు పార్టీ పెట్టి ఎంపీగా పోటీ చేస్తే 5.40 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచి దేశంలోనే అత్యధిక  మెజార్టీతో గెలిచిన వారి లిస్టులో చేరి ట్రాక్‌ రికార్డ్‌ సృష్టించిన వ్యక్తి జగన్‌ గారు. 
  • కానీ నువ్వు జగనన్న ఫోటోతో పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్, తిప్పల నాగిరెడ్డిలపై ఓడిపోయిన వాడివి. 
  • 12 ఏళ్ల క్రితం పార్టీ పెట్టి సొంత జెండా, అజెండాతో పార్టీని నడిపిస్తున్న దమ్మున్న నాయకుడు జగన్‌ గారు. 
  • నువ్వు నీ జెండా తప్ప అందరి జెండాలు మోసే కూలీగా మిగిలిపోయావు. 
  • పరిశ్రమలు పెట్టి లక్షలాది మందికి ఉద్యోగావకాశాలు ఇచ్చిన సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ జగన్‌ గారు. 
  • తన బిడ్డలకు చక్కటి చదువులు అందించిన సక్సెస్‌ఫుల్‌ ఫ్యామిలీ మెన్‌ జగన్‌ గారు. 
  • తన తండ్రికి ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలొచ్చిన చిరునవ్వుతో వాటిని ఎదిరించి తన తండ్రి ఆశయాలను నెరవేస్తున్న సక్సెస్‌ఫుల్‌ సన్‌ జగన్‌ గారు. 
  • నీ స్థాయికి తగ్గట్లు నువ్వు మాట్లాడాలి పవన్‌..నువ్వు ఒక్క దానిలోనైనా సక్సెస్‌ అయ్యావా? 
  • చదువులో కానీ, ఫ్యామిలీలో కానీ, కొడుకుగా కానీ, మొగుడు కానీ, పొలిటీషయన్‌గా కానీ దేనిలో నువ్వు సక్సెస్‌ అయ్యావో చెప్పు. 
  • స్థాయికి మించి మాట్లాడొద్దు పవన్‌ కల్యాణ్‌..ఇలానే మాట్లాడితే సహించేది లేదు. 

*ప్యాకేజీ పట్టేయడంలో నువ్వు హిట్‌..పొత్తుతో నువ్వు చిత్తు:*

  • టీడీపీతో పొత్తు పెట్టుకున్నదే 14వ తేదీ. 16వ తేదీకే అది ఎలా హిట్‌ అవుతుంది..? 
  • ఈ రెండు రోజుల గ్యాప్‌లోనే ఎన్నికలు వచ్చేసి మీరు గెలిచిపోయారు అనుకుంటున్నారా..? 
  • ఆధారాలతో చంద్రబాబు జైళ్లోకి వెళ్లగానే తప్పించుకోలేడు...మనమే దిక్కు అన్నట్లు ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని పెద్ద స్థాయిలో ప్యాకేజీ కొట్టేశావు. 
  • నీ ప్యాకేజీ విషయంలో నువ్వు హిట్‌ అయ్యావు కానీ పొత్తులో చిత్తు అయ్యావ్‌. 
  • నీలాంటి సిగ్గులేని నాయకుడిని ఈ దేశ చరిత్రలోనే ఎవరూ చూసి ఉండరు. 
  • అమిత్‌షాకు వెళ్లి ఏమని ఫిర్యాదు చేస్తావు..? నీ మీద చెప్పులు రాళ్లు వేయించిన చంద్రబాబుతో నేను పొత్తు పెట్టుకున్నాను..మీరూ రండి పొత్తు పెట్టుకుందాం అని చెప్తావా? 
  • మోడీ భార్యను తిట్టిన చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్నాను..మీరు కూడా పొత్తు పెట్టుకుందాం రండి అని చెప్తావా? 
  • మోడీ తల్లిని హిందీలో బూతులు తిట్టిన బాలకృష్ణ కోసం టీడీపీతో పొత్తుపెట్టుకున్నాను..మీరూ రండి అని చెప్తావా? 
  • మా తల్లిని పది కోట్లు పెట్టి బూతులు తిట్టించిన లోకేశ్‌ కోసం పొత్తులు పెట్టుకున్నాను..మీరూ రండి అంటారా? 
  • అమిత్‌ షా నీకు కచ్చితంగా గడ్డి పెట్టి మెడపట్టుకుని బయటకు తోస్తాడు. 

*యుద్ధం చేయడానికి నీ దగ్గర పది మంది అభ్యర్థులైనా ఉన్నారా?:*

  • నేను యుద్ధానికి రెడీ..కురుక్షేత్ర యుద్ధం చూపిస్తాను అంటున్నాడు. 
  • పవన్‌ కల్యాణ్‌..12 ఏళ్లుగా పార్టీ పెట్టి జగన్‌ గారు ఎప్పుడూ యుద్ధానికి రెడీగానే ఉన్నారు. 
  • 175కు 175 సీట్లలో అభ్యర్థులతో ఆయన ఎప్పుడూ రెడీగానే ఉన్నారు. 
  • నువ్వు రెడీనా..? కనీసం పది చోట్లయినా అభ్యర్థులున్నారా నీకు..? 
  • ఈ రోజు ఎమ్మెల్యేగా కూడా గెలవలేనన్న భయంతో ప్రతి సారీ ఎవరితోనో పొత్తులు పెట్టుకుని వారి కాళ్లు పట్టుకుని ఎన్నికలకు వెళ్లాలనుకునే నువ్వు యుద్ధం అంటే అందరూ నవ్వుకుంటున్నారు. 
  • నేను సింహాన్ని కాదు అని నువ్వే ఒప్పుకున్నావు కదా...పందులే గుంపులు గుంపులుగా వస్తాయి. 
  • సింహం ఎప్పుడూ సింగిల్‌గానే వస్తుంది..జగన్‌ గారు ఏ ఎన్నికలైనా సింగిల్‌గానే వస్తారు. 
  • మీరు గుంపులుగా వచ్చే మీఅందరినీ గుంపు కట్టి బంగాళాఖాతంలో వేస్తారు. 
  • చంద్రబాబు అడ్డంగా దొరికిపోయి జైళ్లో కూర్చుంటే ఈ పిచ్చి పట్టిన పచ్చ మీడియా, కుటుంబ సభ్యులు, దత్తపుత్రుడు ఎలా విలవిలలాడుతున్నారు. 
  • జగన్‌ గారు అక్రమంగా కేసులు పెట్టారని ఏడిస్తే అందరూ నమ్మేస్తారు..అందరూ రోడ్లపైకి వస్తారు అనుకున్నారు. 
  • చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు హెలికాఫ్టర్‌లో రావయ్యా అంటే నేను రోడ్డు మీదే వస్తానన్నాడు. 
  • ఇన్నేళ్లు వ్యవస్థలను మేనేజ్‌ చేస్తూ నన్నెవరూ ఏమీ పీకలేరు అనే వాడు..తానే తప్పు చేయలేదు అని మాత్రం చెప్పడు. 
  • తనని అరెస్ట్‌ చేస్తే భూమి బద్దలైపోతుంది..ఆకాశం చిల్లులు పడుతుంది అనుకున్నారు. 
  • ఆయన రోడ్డుపై నంద్యాల నుంచి విజయవాడ వస్తే ఎవరూ పట్టించుకోలేదు. 
  • అచ్చెన్నాయుడు టెలికాన్ఫరెన్స్‌తో విషయం పూర్తిగా అర్ధం అయ్యింది. 
  • ప్రజలు ఎవరూ రోడ్లమీదకు రావడం లేదని, కార్యకర్తలు, నాయకులు బయటకు వచ్చి ధర్నాలు చేయండి..డబ్బులిచ్చి జనాన్ని తీసుకురండి అని అడుక్కున్నాడు. 
  • ప్రజలు చాలా తెలివైన వారు. వారికి ఒక క్లారిటీ ఉంది. 
  • చంద్రబాబు అనే వ్యక్తి అక్రమ కేసులో లోపలికి వెళ్లలేదు..అక్రమంగా దోచుకుని దొరికి లోపలికెళ్లాడని అందరికీ అర్ధం అయ్యింది. 

*దేవాన్ష్‌కి దయచేసి రిమాండ్‌ రిపోర్ట్‌ చూపించొద్దు..చూస్తే తాతను అసహ్యించుకుంటాడు:*

  • ఆయన అవినీతితో అరెస్ట్‌ అయిన విషయాన్ని పక్కదారి పట్టించేందుకు పచ్చ మీడియా ఒక్కొక్కరిని ముందుకు తోస్తోంది. 
  • ముందుగా లోకేశ్‌...తర్వాత బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్, భువనేశ్వరి వచ్చారు. 
  • వీళ్లందరితో వర్కవుట్‌ అవ్వలేదని, బ్రహ్మాస్త్రం అనుకుని బ్రాహ్మణి అస్త్రాన్ని వదిలారు..అది కూడా తుస్సుమనింది. 
  • ఇనాళ్లు ఆమె రాజకీయాలు మాట్లాడలేదు కాబట్టి మేమూ ఎన్నడూ మాట్లాడలేదు. 
  • కానీ ఈ రోజు ఆమె ప్రెస్‌మీట్‌ చూశాకా, చంద్రబాబు, లోకేశ్‌ రాసిచ్చిన స్క్రిప్ట్‌ను బట్టీ పట్టి చదువుతుంటే  సాటి మహిళగా కొన్ని తెలియజేయాలి అనుకున్నా. 
  • నువ్వు విదేశాల్లో చదువుకున్నావు...నీకు కొంచెం అయినా తెలివితేటలు ఉంటాయనుకున్నా. 
  • నిన్నటితో నీకు రాజకీయంగా ఏమీ తెలియదు..కేవలం నిన్ను అస్త్రంగా వాడుకుందామనే నీ మామ చంద్రబాబు, భర్త లోకేశ్‌లు నిన్ను ముందుకు తోశారు. 
  • చంద్రబాబు మీద పెట్టినది అక్రమ కేసు కాదు..అడ్డంగా దోచుకుంటే సాక్షాధారాలతో దొరికిన తర్వాత పెట్టిన కేసు. 
  • దొరికిన దొంగను జైలుకు పంపుతారు కానీ..జైలర్‌ సినిమాకు పంపుతారా? 
  • సీఐడీ కేసులో ఆధారాలు లేవని బ్రాహ్మణి అంటున్నారు. ఆ రిమాండ్‌ రిపోర్ట్‌ చూస్తే తన 8ఏళ్ల కొడుకు దేవాన్ష్‌కి కూడా అర్ధమవుతుంది అంటున్నారు. 
  • సిద్ధార్థ లూథ్రాను తీసేసి దేవాన్ష్‌నే లాయర్‌గా పెట్టి చంద్రబాబు కేసులో వాదిస్తాను అని చెప్పలేదు సంతోషం. 
  • నీ కొడుకుకు ఆ రిమాండ్‌ రిపోర్ట్‌ అసలు చూపించవద్దు. 
  • వాళ్ల తాత ఎంత పెద్ద దొంగో..ఎంత స్కిల్‌తో ఈ స్కాంలో దోచేసుకున్నాడో తెలిస్తే వాడు అసహ్యించుకునే పరిస్థితి వస్తుంది. 

*మీ మామ ఎంత పెద్ద దొంగో నీకు తెలియదా బ్రాహ్మణి..?:*

  • నిన్ను సూటిగా అడుగుతున్నా బ్రాహ్మణి. మీ మామ ఎంత పెద్ద దొంగో, వెన్నుపోటు దారుడో నీకు తెలియదా? 
  • నీకు తెలియకపోతే మీ తాత గారి చివరిక్షణాల్లో విడుదల చేసిన వీడియో చూడు. 
  • చంద్రబాబు గొడ్డుకన్నా హీనం..గాడ్సే కన్నా ఘోరం అన్నాడు. 
  • పిల్లనిచ్చిన తండ్రి లాంటి నన్నే పదవి లాక్కుని చెప్పులు వేయించి, అవమానించి నడిరోడ్డుకు తోసేశాడని 72 ఏళ్ల వయసులో ఎన్టీఆర్‌ ఎలా విలపించాడో ఆ వీడియో చూస్తే అర్ధం అవుతుంది. 
  • బాబు కోసం రోడ్లపైకి వస్తున్న వారంతా మా బాబు హైదరాబాద్‌ కట్టాడు..ఐటీ తీసుకొచ్చాడు అని చెప్తున్నారు. 
  • కానీ ఆయన స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ స్కాంలో ఎంత దోచుకున్నాడు అనేది మాత్రం మాట్లాడం లేదు. 
  • 13 సంతకాలు పెట్టిన విషయం తనకు తెలిసో తెలియదు కానీ..బ్రాహ్మణి మా మామ తప్పు చేసినట్లు సాక్షాధారాలు లేవంటున్నారు. 
  • పవన్‌ కల్యాణ్‌ అసలు తన దత్తతండ్రి సంతకాలే పెట్టలేదు అంటున్నాడు. 
  • మీరు నిజం తెలుసుకోవాలంటే..సీఐడీ ఆఫీసుకు వెళ్లండి. సాక్షాధారాలు చూపిస్తారు. 

*ఈ ప్రశ్నలకు ప్రజలకు బదులు చెప్పండి:*

  • రాష్ట్ర ప్రజలు బ్రాహ్మణిని, ఆమె భర్తను, అమె అత్తమ్మను, దత్తపుత్రుడు పవన్‌ కల్యాణ్‌ని సూటిగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. 
  • చంద్రబాబు ఈ స్కిల్‌ స్కామ్‌లో 13 చోట్ల సంతకం పెట్టాడా లేదా? అచ్చెన్నాయుడు 5 చోట్ల సంతకం పెట్టాడా లేదా? 
  • 90ః10 ఒప్పందం మేము చేసుకోలేదని సీమెన్స్‌ సంస్థ జడ్జి ముందు చెప్పిందా లేదా? 
  • సీమెన్స్‌ ఒప్పందం చేసుకున్నామని చెప్పిన మీరు డిజైన్‌ టెక్‌కు, బోగస్‌ కంపెనీలకు డబ్బులు విడుదల చేశారా లేదా? 
  • అప్పుడున్న సీఎస్, ఫైనాన్స్‌ సెక్రటరీల మీద వత్తడి తీసుకువచ్చి నిధులు విడుదల చేయించాడని అప్పటి సీఎస్‌ కృష్ణారావు, ఫైనాన్స్‌ సెక్రటరీ పీవీ రమేశ్‌లు నోట్‌ ఫైల్‌పై రాశారా లేదా? 
  • ఇవ్వడానికి కుదరదని చెప్పిన అధికారులపై తన పవర్‌ ఉపయోగించి వత్తిడి చేసి నిధులు విడుదల చేయించాడా లేదా? 
  • రూ.58 కోట్లకు సాఫ్ట్‌వేర్‌ ఉంటే దాన్ని 3వేల కోట్లకు పెంచి గోల్‌మాల్‌ చేసింది నిజమా కాదా.?
  • వీటికి బ్రాహ్మణి, పవన్‌ కల్యాణ్‌లు జవాబు తెలిసుకుంటే చాలు..చంద్రబాబు ఎంత పెద్ద దొంగో అర్ధమవుతుంది. 

*మీ మామ దేశానికి ప్రధానిగా చేశాడనుకుంటున్నావా బ్రాహ్మణి..?:*

  • భారతదేశానికి ఐటీని పరిచయం చేసింది చంద్రబాబు అట. బ్రాహ్మణికి ఎవరు చదువు చెప్పారో? 
  • ఆమె మామ ఏపీ ముఖ్యమంత్రిగా చేశాడు అనుకుంటుందా.? దేశానికి ప్రధానిగా చేశాడు అనుకుంటుందా? 
  • చెన్నై, బెంగుళూరు, పూణే, కోల్‌కత, ఢిల్లీ, అహ్మదాబాద్‌..ఇలా చాలా నగరాల్లో ఐటీ పరిశ్రమలు ఉన్నాయి. అక్కడ ఎంతో మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. 
  • అంటే ఆ రాష్ట్రాలకు బాబు ముఖ్యమంత్రిగా చేశాడా..? లేక దేశానికి ప్రధానిగా చేశాడా..? 
  • బాబొస్తే జాబు వస్తుందని మీ మామ ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి నీ మొగుడుకి అడ్డదారిన మంత్రి పదవి ఇచ్చాడు. 
  • ఈ రాష్ట్రంలో యువత గురించి ఆలోచించి మంచి చేస్తున్నది జగన్మోహన్‌రెడ్డి గారు మాత్రమే. 
  • ఆయన ముఖ్యమంత్రి అయ్యాక 2.06 లక్షల మందికి శాశ్విత ఉద్యోగాలు ఇచ్చారు. 
  • 2 లక్షల మందికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాలు ఇచ్చారు. 
  • 127 భారీ పరిశ్రమలు తీసుకువచ్చి నాలుగేళ్లలో 84 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు. 
  • 2 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు తీసుకొచ్చి 12.61 లక్షల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇచ్చారు. 
  • చంద్రబాబు స్కిల్‌ డెవలెప్‌మెంట్‌లో రూ.241 కోట్లు దోచుకుని హైదరాబాద్‌లో బంగ్లాలో దాచితే...అదే స్కిల్‌ డెవెలెప్‌మెంట్‌ ద్వారా జగన్‌ గారు 2 లక్షల మందికి ఉద్యోగాలిచ్చారు. 

*చిలకపలుకులతో సింపతీ రాదు బ్రాహ్మణీ:*

  • బ్రాహ్మణి..తన మామ ఇచ్చిన 2014 మేనిఫెస్టో తెప్పించుకో...దాన్ని వెబ్‌సైట్‌ నుంచి తీసేసిన దుర్మార్గుడు చంద్రబాబు. 
  • ఆ మేనిఫెస్టోలో ఒక్కటి కూడా చేయకపోతే...అలాంటి వారిని అరెస్టు చేస్తారా అని బ్రాహ్మణి చిలకపలుకుతుంటే సింపతీ రాదు. 
  • జగన్‌ గారికి చంద్రబాబును అక్రమంగా అరెస్ట్‌ చేయాల్సిన అవసరం లేదు..దానివల్ల ఆయనకు లాభం కూడా లేదు. 
  • 2018లోనే జీఎస్టీ వారు చంద్రబాబుకు లేఖ రాశారు. అయినా సరిచేసుకోలేదు అంటే దాని అర్ధం చంద్రబాబే ఆ స్కాం చేయిస్తున్నాడు అని. 
  • ఈడీ నోటీసులు ఇచ్చింది. సాక్షాధారాలతో నలుగురిని అరెస్టు కూడా చేసింది. డిజైన్‌ టెక్‌ ఆస్తులను రూ.31 కోట్లను ఎటాచ్‌ చేసింది. 
  • ఇటీవల ఇన్‌కం ట్యాక్స్‌ వారు కూడా నోటీసులు ఇచ్చారు. దానిలో లోకేశ్‌ పేరు కూడా ఉంది. 
  • అందుకే ఆయన రెండు రోజుల్లో నన్ను అరెస్ట్‌ చేస్తారంటూ చెప్పుకొచ్చాడు. 
  • సాక్షాధారాలతో పట్టుబడ్డాడు కాబట్టి, బయటపడే పరిస్థితి లేదు కాబట్టి సింపతీ కోసం డ్రామాలు ఆడుతున్నారు. 
  • అందుకే ఢిల్లీ నుంచి స్పెషల్‌ ఫ్లైట్‌లో తెప్పించిన లాయర్‌ వాదించినా నీకు బెయిల్‌ రాలేదంటూ అర్ధం ఏమిటి..? 
  • అక్కడ సాక్షాలున్నాయి కాబట్టే...నువ్వు బయట ఉంటే ఆ సాక్షాలను తారు మారు చేస్తావు కాబట్టే నిన్ను అరెస్ట్‌ చేశారు. 
  • లోకేశ్‌ కూడా అరెస్ట్‌ అవుతాడని వారికి తెలుసు కాబట్టి బ్రాహ్మణిని ఒక బ్రహ్మాస్త్రం అనుకుని ప్రయోగిస్తే తుస్సుమనింది. 
  • ఈ లోకేశ్‌ అనే వాడి వల్లే ఇంత జరిగింది. లోకేశ్‌ తన స్నేహితుడు కిలారు రాజేశ్, చంద్రబాబు, పీఏ శ్రీనివాస్‌లు నలుగురు ఏ విధంగా స్కాం చేశారో బయటకు వస్తుంది. కచ్చితంగా ప్రజలు వీరి ముఖాన ఉమ్మేస్తారు. 

*తప్పు చేయకుండా ఈడీ, ఐటీ ఎందుకు నోటీసులిచ్చింది..?:*

  • పవన్‌ కల్యాణ్‌ వారం తర్వాత అమిత్‌ షాకు వెళ్లి చెప్తాడట..ఎందుకు అంత లేటు..? 
  • అరెస్టు అయిన రోజే లోకేశ్‌ని తీసుకుని వెళ్లి ఉండొచ్చు కదా..? 
  • ఆయన తప్పు చేయకుండా ఈడీ, ఐటీ ఎందుకు నోటీసులిచ్చింది అని అడగొచ్చు కదా..? 
  • అలా అడగలేదు అంటే అర్ధం చంద్రబాబు, లోకేశ్‌ తప్పు చేశారని పవన్‌ కల్యాణ్‌కి కూడా తెలుసు. 
  • ప్రజల్ని మోసం చేయడానికి, తప్పుదోవ పట్టించడానికి ఇక్కడిక్కడే తిరుగుతూ ప్రెస్‌మీట్‌లు పెట్టుకుంటూ ఏ విధంగా బెదిరిస్తున్నారో స్పష్టంగా అర్ధం అవుతోంది. 
  • తప్పు చేసిన వాడు ఎంతటి పెద్ద వాడైనా సాక్షాధారాలు దొరికినప్పుడు కచ్చితంగా అరెస్ట్‌ చేస్తారు. దానిలో కక్షసాధింపు ఏమీ ఉండదు. 
  • చంద్రబాబు వల్లే ఈ రాష్ట్రం రెండు ముక్కలైంది. రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది. 
  • రాష్ట్రాన్ని దోచుకుని హైదరాబాద్‌లో దాచుకుంటే ఎవరూ చూస్తూ ఊరుకునేది లేదు. 
  • ప్రజల డబ్బును కక్కిస్తాం..ప్రజలకే అందిస్తాం. 
  • ఇంకొక్కసారి జగన్‌ గారిని నోటికొచ్చినట్లు మాట్లాడితే..అది పవన్‌ కల్యాణ్‌ అయినా..ఇంకెవరైనా సరే పళ్లు రాలగొడతాం. 
  • పీకే అంటే పిచ్చి కల్యాణ్‌...ఇద్దరు పిచ్చోళ్లను పక్కనేసుకుని మిగతా వాళ్లని పిచ్చోళ్లు అంటున్నారు. 
  • జగన్‌ గారిని ఢీకొట్టలేక, జగన్‌ గారిలా ప్రజల కోసం పనిచేయలేక, ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోతున్నాననే ఫ్రస్టేషన్‌లో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నాడు. 
  • పవన్‌ కల్యాణ్‌...నీ పిచ్చి పరాకాష్టకు వెళ్లింది..జగనన్నకు చెప్పి ఆరోగ్యశ్రీ కింద నీ పిచ్చి కుదురుస్తాం. 

*సుమన్‌ బోస్‌ ఎందుకు మాజీ అయ్యాడో చెప్పాలి:*

  • సీమెన్స్‌ కంపెనీలో సుమన్‌ బోస్‌ ఎందుకు మాజీ అయ్యాడో అందరూ తెలుసుకోవాలి. 
  • చంద్రబాబుతో కలిసి అవకతవకలు చేయాలని ప్రయత్నించి దొరికిపోయాడు కాబట్టే..వారి ఇంటర్నల్‌ విచారణలో అతను దొంగ అని తెలిసి తీసి బయటపడేశారు. 
  • సీమెన్స్‌ కంపెనీ జర్మనీ హెడ్‌ ఈ విషయాన్ని కోర్టు ముందు రికార్డెడ్‌గా చెప్పారు. 
  • మేము ఏపీ ప్రభుత్వంతో ఎటువంటి ఒప్పందం చేసుకోలేదు..మాకూ ఈ స్కాంకు ఏ సంబంధం లేదని చెప్పారు. 
  • ప్రభుత్వం నుంచి మాకు ఒక రూపాయి రాలేదు..మేం ఆ ప్రభుత్వానికి ఒక్క రూపాయి ఇవ్వలేదని స్పష్టంగా చెప్పారు. 
  • ఈ సుమన్‌ బోస్‌ అనే దొంగ ఢిల్లీలో కూర్చుని ప్రెస్‌మీట్‌ పెడితే ఎవరూ నమ్మే పరిస్థితి లేదు. 
  • ఈ స్కాంలో చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్నాయుడు అందరూ ఇన్వాల్వ్‌ అయ్యారు. 
  • డబ్బు వారి ఎకౌంట్లలోకి ఎలా వెళ్లిందో కూడా అధారాలున్నాయి. వారు తప్పనిసరిగా అరెస్ట్‌ అవుతారని గతంలోనే చెప్పాం. 
  • సెంటిమెంట్‌ కోసం దొంగ ఏడుపులు ఏడిస్తే ఎవరూ కరిగిపోరు. 
  • చంద్రబాబు, లోకేశ్‌లు ఎలాంటి వారో ప్రజలందరికీ తెలుసు. 
  • వాళ్లు తప్పు చేయలేదంటూ ప్రూవ్‌ చేసుకోమనండి. 
  • ఇదే గంటా శ్రీనివాసరావు వైజాగ్‌లో టీడీపీ వారు గంజాయి పండిస్తూ యువతను చెడగొడుతోందని చెప్పాడు. 
  • అలాంటి వ్యక్తి ఈ రోజు మాట్లాడుతున్నాడు అంటే ఎలా చెప్పిస్తున్నారో అర్ధం అవుతుంది. 
  • గంటాకి వాటా ఇచ్చినట్లు లేదు..అందుకే ఈ స్కాం గురించి సరిగ్గా తెలిసినట్లు లేదు. 
Back to Top