సంక్షేమం, అభివృద్ధి చూసి జీర్ణించుకోలేక బాబు, పవన్‌ కుట్రలు

పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా

తిరుపతి: రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి తట్టుకోలేక ప్రభుత్వంపై చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ విషం చిమ్ముతున్నారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఏపీ అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు. ఉత్తమ ముఖ్యమంత్రుల జాబితాలో సీఎం వైయస్‌ జగన్‌ టాప్‌ ప్లేస్‌లో నిలిచారన్నారు. అది చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు ఏకమై ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. తిరుపతిలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్‌ సమయంలో రాష్ట్ర ప్రజలను విడిచి వేరే రాష్ట్రాలకు పారిపోయిన వారంతా నేడు.. ఏపీకి వచ్చి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌ను ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే సీఎం వైయస్‌ జగన్‌ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారన్నారు. తన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం, ఆస్తుల కోసం పెయిడ్‌ ఆర్టిస్టులతో చంద్రబాబు పాదయాత్ర చేయిస్తున్నాడన్నారు. రైతుల పేరుతో జరిగే యాత్రలో పాల్గొనేవారంతా బాబు బినామీలేనని మంత్రి రోజా అన్నారు. 
 

తాజా వీడియోలు

Back to Top