వైయస్‌ఆర్‌సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నా

నగరి ప్లీనరీ సమావేశంలో మంత్రి ఆర్కే రోజా 

కార్యకర్తలే వైయస్‌ఆర్‌సీపీకి బలం, బలగం

సచివాలయ వ్యవస్థతో గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యాన్ని సీఎం అందించారు

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది చంద్రబాబు కాదా? 

చిత్తూరు: సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అంటే వ్యక్తి కాదని, ఓ బ్రాండ్‌ అని మంత్రి ఆర్కే రోజా వ్యాఖ్యానించారు.వైయస్‌ఆర్‌సీపీలో ఉన్నందుకు గర్వపడుతున్నానని చెప్పారు.  నగరి నియోజకవర్గ ప్లీనరీలో మంత్రి రోజా ప్రసంగించారు. ఆమె ఏమన్నారంటే..

మనందరిని ముందుకు నడిపిస్తున్న, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తున్న వైయస్‌ జగన్‌ నాయకత్వంలో పని చేయడం గర్వంగా ఉంది. 12 ఏళ్లలో ఎన్నో ఆటు పోట్లు, ఎన్నో తప్పుడు కేసులు, ఎన్నో పత్రికల ద్వారా విషాన్ని నింపితే..అన్నింటిని ఎదురించి నిలబడిన దమ్మున్న నాయకుడు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. వైయస్‌ఆర్‌ బ్లెడ్‌కాబట్టి ఎవరికి బెదరలేదు. ఈ రోజు వెన్నుచూపకుండా పార్టీని ముందుకు నడిపించడమే కాకుండా, అందరిని ఒక తాటిపై నిలబెట్టారు. 
వైయస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయిన తరువాత ఆయన ఆశయాల పునాదుల మీద వైయస్‌ఆర్‌ జెండాను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాటారు. ఈ రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ ఏకమై వైయస్‌ఆర్‌సీపీని చంపేయాలని, చిదిమేయాలని, అడ్రస్‌ లేకుండా చేయాలని చూశారు.  కానీ వైయస్‌ జగన్‌ మొక్కవోని ధైర్యంతో, మీ అందరి సహాయ సహకారాలతో 12 ఏళ్లు పోరాటం చేశారు. ఇద్దరితో ప్రారంభమైన వైయస్‌ఆర్‌కాంగరెస్‌ పార్టీ ఈ రోజు దేశంలోనే అతిపెద్ద నాలుగోవ పార్టీగా నిలబెట్టారు.  మనందరం కూడా గర్వపడాలి. ఈ రాష్ట్రంలో 17 ముఖ్యమంత్రులుగా పని చేశారు. అందరి చరిత్రను తిరగరాసిన చరిత్రకారుడు వైయస్‌ జగన్‌. ఎంతో మంది సీఎంలు దేశంలో ఉన్నారు. ప్రధానితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించిన వ్యక్తి వైయస్‌ జగన్‌. మొదటిసారి సీఎం అయినా పెద్ద మనసుతో పేదల కష్టాలను దూరం చేయాలని కుటుంబ పెద్దగా భావించి అన్ని కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించిన సంక్షేమ సామ్రాట్‌ వైయస్‌ జగన్‌.
ఈ రోజు గల్లీలో బాదుడే బాదుడు అని కొంత మంది మొరుగుతున్నారు. వాళ్లకు నేను సవాలు చేస్తున్నాను. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు, టీడీపీ పార్టీ వైయస్‌ జగన్‌ ఈ మూడేళ్లలో ఇచ్చినన్ని సంక్షేమ పథకాలు అమలు చేశారా అని ఛాలెంజ్‌ చేస్తున్నాను. ఎన్టీఆర్‌ పెట్టిన పథకాలను కూడా ఎత్తేసిన ఘనుడు చంద్రబాబు, వైయస్‌ఆర్‌ పథకాలకు తూట్లు పొడిచిన ఘనుడు చంద్రబాబు. మూడేళ్ల పాటు మొద్దు నిద్ర పోయిన చంద్రబాబు ఇప్పుడే నిద్ర లేచి..ఈ రాష్ట్రం అప్పుల్లో ఉందని ఆరోపణలు చేస్తున్నాడు. పగటి కలలు కంటూ అనుకూల మీడియాతో తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. ఈ రాష్ట్రాన్ని ముక్కలు చేసింది, అప్పులపాలు చేసింది చంద్రబాబు కదా? విభజన చట్టంలో మనకు రావాల్సినవి రాకుండా చేసింది చంద్రబాబు కాదా? ఈ రోజు ప్రధాని, ప్రతి రాష్ట్ర సీఎం కూడా అప్పులు చేస్తున్నారు. రాష్ట్రాల అభివృద్ధి కోసం అప్పులు చేస్తుంటారు. మన రాష్ట్రంలో చేసిన ప్రతి పైసాకు లెక్కుంది.
గతంలో జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసుకుని ఎలా వ్యవహరించారో చూశాం. ఈ రోజు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని తెచ్చిన వైయస్‌ జగన్‌కు పాదాభివందనం చేసినా తక్కువే. 
గడప గడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి ఇంటికి వెళ్తే..ఏ ఒక్కరికీ కూడా సంక్షేమ పథకాలు అందలేదని చెబుతున్నారు. ఇది నేను ధైర్యంగా, గర్వంగా చెబుతున్నాను. ఒకటి రెండు మిస్‌ అయినా టెక్నికల్‌ ప్రాబ్లమ్‌గానే ఉన్నాయి.
కొన్ని పార్టీలు ఈ మధ్యకాలంలో అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. అమ్మ ఒడిలో కోతలు అంటూ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. నిజంగా కోత పెట్టాలనుకుంటే స్కూళ్లే జరగలేదు. ఆ రెండేళ్లు కోత పెట్టింటే ఎవరూ అడిగేవారు కూడా కాదు. కానీ వైయస్‌ జగన్‌ ఉద్దేశం అది కాదు. కోత పెట్టాలనే ఆలోచన వైయస్‌ జగన్‌కు ఉండదు. క్రమం తప్పకుండా పిల్లలు బడికి రావాలనే 75 శాతం హాజరు నిబంధనలు పెట్టారు.
ఏ విషయంలోనైనా ప్రతిపక్షాన్ని ధైర్యంగా సవాలు చేయవచ్చు. ఏ రాష్ట్రంలోనైనా 33 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన సీఎంను చూశారా? అక్కచెల్లెమ్మలకు వైయస్‌ఆర్‌ ఆసరా ఇచ్చిన ప్రభుత్వం ఎక్కడైనా ఉందా?. వైయస్‌ఆర్‌ చేయూత ఇచ్చిన సీఎం ఎక్కడైనా ఉన్నారా? అమ్మ ఒడి ఇచ్చిన ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలోనైనా చూశారా? వైయస్‌ జగన్‌ అంటే ఒక మనిషి కాదు..ఒక బ్రాండ్‌. జగనన్న మాకు అండగా ఉన్నారని ప్రతి ఒక్క మహిళా భరోసాగా ఉంది. మహిళా పక్షపాతి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పార్టీలో పని చేస్తున్నందుకు గర్వంగా ఫీల్‌ అవుతున్నాను. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా వార్‌ వన్‌సైడ్‌గా ముందుకు వెళ్తోంది. వైయస్‌ఆర్‌సీపీకి ఓటు వేయమని జగనన్న ప్రచారం చేయలేదు. బంపర్‌ మెజారిటీతో వైయస్‌ఆర్‌సీపీ గెలుస్తుందంటే కారణం జగనన్న, జగనన్నకు తోడుగా ఉన్న కార్యకర్తలేన ని గర్వంగా చెప్పగలను. కార్యకర్తలపై వైయస్‌ జగన్‌కు నమ్మకం ఉంది. 2014లో మనం అధికారంలోకి రానప్పుడు అన్నా..మళ్లీ పోరాటం చేద్దామని వైయస్‌ జగన్‌కు ధైర్యం చెప్పింది ఇదే కార్యకర్తలు. 2019లో వైయస్‌ఆర్‌సీపీని అధికారంలోకి తెప్పించింది ఈ కార్యకర్తలే.  
ఈ రోజు చంద్రబాబు బీజేపీ, జనసేన కాళ్లు పట్టుకునేందుకు పరుగులు తీస్తున్నాడు. సింహంతో ఆట, జగనన్నతో వేట అయ్యే పనికాదు. నిజంగా మీకు సిగ్గు, మానం, దమ్ము, ధైర్యం ఉంటే సింగిల్‌గా వచ్చి జగనన్నతో ఫైట్‌ చేయండి. గుంపులు గుంపులుగా వస్తే..అక్కడున్నది సింహాం..మీ అందరిని వేటాడేస్తాడు. ఎన్నికల్లో వైయస్‌ జగన్‌  ఇచ్చిన ప్రతివాగ్ధానాన్ని మూడేళ్లలోనే పూర్తి చేసిన మనసున్న మారాజు వైయస్‌ జగన్‌. మిగిలిన వాగ్ధానాలు పూర్తి చేసేందుకు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని పెట్టారు.
నేను రాజకీయంగా రుణపడి ఉన్నాను. రాజకీయంగా జన్మనిచ్చిన వైయస్‌ జగనన్నకు, నా కుటుంబ సభ్యులైన నగరి ప్రజలకే రుణపడి ఉన్నాను. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రిగా ఆత్మగౌరవంతో, సంతోషంగా మీ అందరి ముందు నిలబడటానికి నగరి ప్రజలేనని మంత్రి రోజా పేర్కొన్నారు. 

 

Back to Top