చంద్రబాబు చిప్పకూడు తినాల్సిందే

చంద్ర‌బాబు చేసిన పాపాలే జైలుకు దారిచూపాయి

అక్రమ కేసు కాదు.. బాబు అడ్డంగా దొరికిపోయిన కేసు

ఎన్నో కుటుంబాల ఉసురు పోసుకున్న నీచుడు బాబు

ఏపీ ప్రజల సొమ్ముతో హైదరాబాద్ లో ప్యాలెస్

యువతను అడ్డంపెట్టుకుని రూ.371 కోట్ల దోపిడీ

2024లో టీడీపీకు యువత బుద్ధి చెబుతారు

యూత్‌ ఐకాన్‌గా ముఖ్య‌మంత్రి వైయ‌స్‌ జగన్ నిలిచారు 

అధికారంలోకొచ్చాక 2 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలు

ఎంఎస్‌ఎంఈలు, భారీపరిశ్రమలతో లక్షలాదిమందికి ఉపాధి

ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా

తాడేపల్లి: చంద్రబాబు చేసిన స్కాములన్నీ ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని, ఇకపై చంద్రబాబు చిప్పకూడు తినాల్సిందేనని ప‌ర్యాట‌క శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. ఇన్నాళ్లూ అనేక స్కామ్‌లు చేసి స్టేలు తెచ్చుకొని పబ్బం గడుపుకున్నాడన్నారు. స్కిల్‌ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును సీఐడీ అరెస్టు చేస్తే దాన్ని కక్ష సాధింపు అంటూ టీడీపీ, ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. రాజమండ్రి జైల్లో చంద్రబాబుకు కట్టుదిట్టమైన భద్రత ఉందన్నారు. కావాలనే లోకేష్, అచ్చెన్నాయుడు ఓవరాక్షన్‌ చేస్తున్నారన్నారు. అవినీతి కేసులో అడ్డంగా బాబు దొరికిపోయాడన్నారు. తిరుమలలో మంత్రి ఆర్కే రోజా ఇంకా ఏం మాట్లాడారంటే..
 

చంద్రబాబుకు దేవుడు రాసిన రాత
ఇన్నేళ్ళుగా వ్యవస్థల్ని మేనేజ్‌ చేస్తూ, అవినీతికి పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న చంద్రబాబుకు శిక్ష విధించాలని రాష్ట్ర ప్రజలంతా ఆ దేవ దేవుడ్ని కోరుకున్నారు. నేనూ కోరుకున్నాను. తప్పులు చేసే నేరస్తులకు ఒక భయాన్ని కలిగించాలని.. ప్రజల డబ్బును దోచుకుంటే ఖచ్చితంగా జైలు కటకటాలు లెక్కబెట్టాల్సి వస్తుందని చంద్రబాబు అండ్‌ కో కు తెలియజేయాలని భగవంతుడ్ని కోరుకోవడం జరిగింది. సరైన సమయంలో సాక్ష్యాధారాలతో సహా అడ్డంగా దొరికి దొంగలా చంద్రబాబు అరెస్టవడం మనమంతా చూశాం. అందరం కోరుకున్నట్టే దేవుడు చంద్రబాబుకు రాత రాశాడు. రాజమండ్రి సెంట్రల్‌ జైలులో స్నేహా బ్యారెక్‌లో ఆయనకు ఒక ప్రత్యేక గదిని కేటాయించారు. ఖైదీనెంబర్‌ 7691 అనే నెంబర్‌ కింద ఆయన్ను ఆ బ్యారక్‌లో ఉంచారు. జైలు లోపల, బయట సీసీ కెమెరాలతో పాటు ఆయనకు కట్టుదిట్టమైన రక్షణను కూడా కల్పించారు.

ఎంతమందిని బాబు అక్రమంగా జైలుకు పంపాడో..
రాజమండ్రి సెంట్రల్‌ జైల్లో అన్ని వసతులు ఏర్పాటుచేసినప్పటికీ, చంద్రబాబు కొడుకు లోకేశ్, అచ్చెన్నాయుడు తెగ గగ్గోలు పెడుతున్నారు. వారి ఫ్రస్టేషన్‌ చూసి ప్రజలకు నవ్వుకుంటున్నారు. చంద్రబాబు ఎంతమంది జీవితాల్ని నాశనం చేశాడో.. ఎంతమందిని జైళ్లకు పంపాడో.. ఎంతమందిని పైకి పంపాడో.. అందరికీ తెలుసు. అధికారాన్ని చేతుల్లో పెట్టుకుని, దాన్ని దుర్వినియోగం చేసి, ఎంతమందిని భయపెట్టి తన చెప్పుచేతల్లో పెట్టుకున్నాడో మనమంతా చూశాం. అలాంటి చంద్రబాబు ఈరోజు జైలుకు వెళ్తే అదేదో కక్షసాధింపు చర్య అని .. అక్రమ కేసని చెబుతారు. ఇది అక్రమ కేసు కాదు. అడ్డంగా దొరికిపోయిన కేసు. 

యువతను అడ్డంపెట్టుకుని బాబు దోపిడీ
చదువుకున్న యువతను అడ్డంపెట్టుకుని రూ.371 కోట్లు కొట్టేసిన కేసు ఇది. ఈరోజు రాష్ట్రంలోని యువత మొత్తం చంద్రబాబు చేసిన దోపిడీ కథ గురించి తెలుసుకుని ఆలోచించాలి. స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్‌ల పేరిట యువతకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో వెన్నుదన్నుగా ఉండాల్సింది ప్రభుత్వం. అలాంటిది, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు కొనసాగించిన అవినీతి-దోపిడీ కార్యక్రమాల్లో భాగంగా ఈ స్కిల్‌డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ను తన స్వార్థానికి వాడుకున్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి షెల్‌కంపెనీల ద్వారా రూ.241 కోట్లు చంద్రబాబు తన ఖాతాకు మరల్చుకుని అడ్డంగా దొరికిపోతే ఆయన అవినీతిపరుడు కాక ఏమౌతాడు.? ఈ కేసు అవినీతికి సంబంధించిన కేసు కాకుండా అక్రమ కేసు ఎలా అవుతుంది..? అని ప్రశ్నిస్తున్నాను. 

2024లో టీడీపీకి యువత బుద్ధిచెప్పాలి
బాబు వస్తే జాబు వస్తుందని యువతను మోసం చేసి, రాష్ట్రంలో ఉన్న ప్రతీ కుటుంబానికి ఒక ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చి దాన్ని అమలు చేయలేదు. ఉద్యోగాలు ఇవ్వలేని చంద్రబాబు కనీసం యువతకు నిరుద్యోగభృతి కూడా ఇవ్వకుండా తన కొడుకు లోకేశ్‌ను మాత్రం అడ్డదారిలో నాలుగు శాఖలకు మంత్రిని చేసుకున్నాడు. తండ్రీకొడుకులు కలిసి 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రాన్ని అడ్డగోలుగా ఏ విధంగా దోచుకున్నారో యువత గమనించాలి. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి యువత బుద్ధిచెప్పాలని కోరుతున్నాను. 

యూత్‌ ఐకాన్ సీఎం వైయ‌స్‌ జగన్ 
గౌరవ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకొచ్చాక రాష్ట్రంలో 2 లక్షలకు పైగా శాశ్వత ఉద్యోగాలిచ్చారు. మరో 2 లక్షల కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలనూ ఇవ్వడం జరిగింది. అలాగే 2.60 లక్షల మందికి వాలంటీర్‌లుగా ఉపాధి కల్పించారు. ప్రస్తుత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న స్కిల్‌డెవలప్‌మెంట్‌ సెంటర్ల ద్వారా 2 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. భారీ పరిశ్రమల ద్వారా 85వేల మందికి ఉద్యోగ ఉపాధి లభించింది. అదేవిధంగా ఎంఎస్‌ఎంఈల ద్వారా దాదాపు 12 లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశం దక్కింది. యూత్‌ ఐకాన్‌గా వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డి యువతకు ఇచ్చిన ప్రామిస్‌ను నెరవేర్చడమంటే ఇది. అదే చంద్రబాబు మాత్రం తన బిడ్డ లోకేశ్‌ బాగుంటే చాలంటూ ఆయనకు మంత్రి పదవి ఇచ్చాడు. దీన్ని ప్రజలంతా గమనించాలని కోరుతున్నాను. 

ఏపీ ప్రజల సొమ్ముతో హైదరాబాద్ లో ప్యాలెస్
2014 తర్వాత ముఖ్యమంత్రిగా అధికారంలోకొచ్చిన చంద్రబాబును రాష్ట్రం అభివృద్ధి చేయండయ్యా .. అని కోరినప్పుడు ఏమన్నాడో అందరికీ తెలుసు. రాష్ట్రం విడిపోయింది. నష్టాల్లో ఉందని కుంటిసాకులతో కాకి కబుర్లు చెప్పి ప్రజలకు ఏమీ చేయకుండా ఆయన మాత్రం కోట్లాది రూపాయలతో హైదరాబాద్‌లో పెద్ద ప్యాలెస్‌ కట్టుకున్నాడు. ఇక్కడ ప్రజల సొమ్మును తీసుకెళ్లి ఆ ప్యాలెస్‌లో పెట్టుకున్నాడు చంద్రబాబు. ఏపీలో దోచుకున్నదంతా ఆ ప్యాలెస్‌లో దాచుకున్నాడు గనుకే కనీసం వారి సొంత పచ్చమీడియాను సైతం లోపలికి రానివ్వలేదు. చంద్రబాబు నోటివెంట ఎప్పుడూ వినిపించే మాటేంటంటే.. ‘రాష్ట్రం సంక్షోభంలో ఉంది. సంక్షోభంలో నుంచి అవకాశాలు రాబట్టి సంపదను సృష్టించాలి..’ అని. ఈ మాటతో ఆనాడు ప్రజలంతా చంద్రబాబు పెద్ద అనుభవశాలి కదా.. విడిపోయిన ఆంధ్రలో సంపద సృష్టిస్తాడని నమ్మి గెలిపించారు. అయితే కష్టాలు, నష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రం నుంచి ఆయన తనకు సంపదను సృష్టించుకుని, ఎలా దోచుకున్నాడో ఈనాటికి బయటపడి, బాబు నిజస్వరూపం ఏమిటో రాష్ట్ర ప్రజలందరికీ ఇప్పుడు పూర్తిగా అర్ధమైంది. 

దోపిడీదారులంతా జైలుకే
వేసవికాలం వచ్చిందంటే హెరిటేజ్‌ మజ్జిగంటూ.. సంక్రాంతి పండుగొస్తే చంద్రన్న తోఫా అంటూ పప్పులు, ఉప్పులు సప్లై పేరుతో అన్నీ నామినేషన్‌ పద్ధతిలో హెరిటేజ్‌ కంపెనీకి చంద్రబాబు ఎలా దోచిపెట్టాడో ప్రజలకు తెలుసు. అన్నా క్యాంటీన్ల పేరుతో వందల కోట్లు తిన్నారు. అలాగే అమరావతి పేరుతో ఆ ప్రాంత భూముల్ని తన బినామీలకు ఎలా దోచిపెట్టాడో.. అమరావతి ఇన్నర్‌రింగ్‌ అలైన్‌మెంట్‌లో ఏ విధంగా డబ్బు సంపాదించుకున్నాడో ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు. స్కిల్‌డెవలప్‌మెంట్‌లో ఇప్పుడు జైల్లోకి వెళ్లాడు. ఇంకా ఒక్కొక్కటిగా సాక్ష్యాధారాలు బయటకొస్తున్నాయి. తీగలాగితే డొంకంతా కదిలే పరిస్థితి వచ్చింది. ఒక్కోక్క కేసులో చంద్రబాబుకు శిక్షలు పడుతూనే ఉంటాయి. ఒకవేళ ఆయన బయటకొచ్చినా మళ్లీ ఏదొక కేసులో జైల్లోకి పోతూనే ఉంటాడు. ఆయనొక్కడే కాదు. రాష్ట్ర ప్రజల డబ్బును దోచుకున్న లోకేశ్, నారాయణ, అచ్చెన్నాయుడు ఇంకా చాలామంది జైలుపాలయ్యే సమయం వచ్చింది. వారంతా జైలుకెళ్లేందుకు సిద్ధమవ్వాలని నేను హెచ్చరిక చేస్తున్నాను. 

బాబుకు జీవితాంతం ఇక చిప్ప కూడే..
గతంలో చంద్రబాబు ఎన్నో సందర్భాల్లో సవాళ్లు విసిరాడు. నన్నెవరూ తాకలేరంటూ... తననేం చేయలేరంటూ పలికాడు. కానీ, సీఎం వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి నీతివంతమైన పాలనలో అవినీతికి పాల్పడిన ఏ స్థాయి వ్యక్త‌యినా చట్టానికి చిక్కాల్సిందేనని ఈరోజు నిరూపితమైంది. చంద్రబాబు పాపం పండింది. ఇక, ఆయన జీవితాంతం చిప్పకూడు తినాల్సిందే. ఇన్నాళ్లూ వ్యవస్థల్ని మేనేజ్‌ చేసి.. చీకట్లో చిదంబరం కాళ్లు పట్టుకుని కేసులపై స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు ఇక కాలం మూడింది. ఆయన చేసిన పాపాల కు బాధితులైన ఎన్టీఆర్, ముద్రగడ పద్మనాభం, వైయ‌స్‌ జగన్‌ కుటుంబ ఉసురు కొట్టుకునే ఈరోజు చంద్రబాబు జైలుకెళ్లాడు. విజయవాడలో కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌లో ఇబ్బందులు పడ్డ మహిళలు, గోదావరి పుష్కరాల్లో మరణించిన బాధిత కుటుంబాలు, గుంటూరు, కందుకూరులో బాబు పబ్లిసిటీ పిచ్చికి ప్రాణాలు విడిచిన బాధిత కుటుంబాల గోడంతా భగవంతుడు విన్నాడు. చంద్రబాబుకు జైలు శిక్ష విధించాడు. అందుకే, శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు వచ్చాను. 

ఒకవైపు టీడీపీ బంద్.. మరోవైపు హెరిటేజ్ వ్యాపారం 
చంద్రబాబును జైలుకు పంపడంతో ప్రజల్లో న్యాయవ్యవస్థపై, చట్టాలపై గౌరవం మరింత పెరిగింది. న్యాయమూర్తులపై నమ్మకం పెరిగింది. తప్పు చేస్తే ఏనాటికైనా శిక్ష అనుభవించాల్సిందేనని రాష్ట్రానికి, దేశానికి ఒక సందేశం ఇచ్చేలా జరిగిన ఈ పరిణామాన్ని ప్రతీ ఒక్కరూ సంతోషంగా స్వాగతిస్తున్నారు. అవినీతికి పాల్పడి, ప్రజాధనాన్ని దోచుకున్న వ్యక్తి జైలు పాలయితే.. ఏదో జరగరానిది జరిగినట్లు టీడీపీ బంద్‌కు పిలుపినిచ్చింది. మరి, బంద్‌ రోజునే చంద్రబాబు భార్య, లోకేశ్‌ సతీమణి ఇద్దరూ కలిసి హెరిటేజ్‌ బ్రాంచీలకు ప్రారంభోత్సవాలు చేశారంటేనే.. రాష్ట్ర ప్రజలు ఆ పార్టీ పిలుపుపై ఎలా స్పందించారో అర్ధమౌతుంది. తమ సంపాదన, తన కుటుంబం తప్ప ఈ రాష్ట్ర ప్రజలు ఎటు పోయినా ఫర్లేదని అనుకున్నారు కనుక.. అంతేమాదిరిగా రాష్ట్రప్రజలు కూడా ఈ చంద్రబాబు, టీడీపీ ఎటు పోయినా ఫర్లేదని వదిలేశారు. అందుకే, నిన్న బంద్‌ను ఎవరూ పట్టించుకోకుండా ఎవరి పనులు వారు ప్రశాంతంగా చేసుకున్నారు. 

Back to Top