తాడేపల్లి: వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి 46 ఏళ్ళకే ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ కళ్యాణ్ 55 ఏళ్ళు అయిన ఎమ్మెల్యే కాదు కనీసం ఎంపీటీసీ, వార్డు మెంబర్‌గా కూడా గెలవలేదని మంత్రి ఆర్కే రోజా పేర్కొన్నారు. సీఎం వైయస్ జగన్‌ను సింగ్లర్‌గా పిలవడం కాదు.. దమ్ముంటే పవన్ కళ్యాణ్ వైయస్ జగన్ మీద సింగిల్‌గా పోటీ చేయాలని మంత్రి రోజా సవాల్ విసిరారు. సీఎం వైయస్ జగన్ పాలన చూసి ఓర్వలేక.. ఓటమి భయంతోనే దత్తపుత్రుడితో చంద్రబాబు నాయుడు విషం చిమ్మిస్తున్నాడని ఆమె విమర్శించారు. వాలంటీర్లను ఉద్దేశించి పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లను మంత్రి రోజా తీవ్రంగా ఖండించారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి ఆర్కే రోజా మీడియాతో మాట్లాడారు. మంత్రి ఆర్కే రోజా ఇంకా ఏం మాట్లాడారంటే: జగన్ గారిని చూస్తేనే కాదు... వాలంటీర్లను చూసినా పవన్‌కి వణుకే: - దత్తపుత్రుడైన ఇరిటేషన్ స్టార్ మూడు రోజులుగా నోటికి అడ్డూ అదుపూ లేకుండా వాలంటీర్లను, మహిళలను, ముఖ్యమంత్రి గారిని గౌవరం లేకుండా మాట్లాడుతున్నాడు. - ఇంత వరకూ జగన్ గారి పేరు వింటేనే పవన్‌కి వణుకు అనుకున్నా... కానీ జగనన్న తీసుకొచ్చిన వాలంటీర్లను చూసినా పవన్ కళ్యాణ్‌కు వణుకేనని ఇప్పుడు అర్ధం అవుతోంది. - ఆయన పదే పదే రెండు మూడు రోజులుగా వాలంటీర్ వ్యవస్థ నడ్డివిరుస్తా అంటున్నాడు. నువ్వు నడ్డివిరవడం కాదు కనీసం వారి వెంట్రుక కూడా పీకలేవు. - స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతుంది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఈ వ్యవస్థ ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించి సేవలు అందిస్తోంది. - ఒక్క రూపాయి లంచం లేకుండా ప్రభుత్వ పథకాలను, సేవలను ప్రజల ముంగిటకు వచ్చేలా వారు పనిచేస్తున్నారు. - పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు 2024లో ఓడిపోతాం అని స్పష్టంగా అర్ధం అయ్యింది. - ఈ రాష్ట్రంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా..కరోనా నుంచి మొదలు మొన్నటి వరదల వరకూ సాయం కోసం ప్రజలు మొదట కాల్ చేసేది వాలంటీర్‌కే. - జగనన్న సురక్ష ద్వారా మిగిలిన అరకొర సమస్యలు కూడా పరిష్కారం జరుగుతున్నాయి. - ఇక ప్రతి కుటుంబం కూడా జగన్ గారికే ఓటేస్తుంది కాబట్టి ఈ వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం నుంచి దూరం చేయాలనుకుంటున్నారు. - మీ పాలనలో మాదిరిగానే ప్రజలకు ఏమీ అందకూడదు.. కరోనా లాంటి ముహమ్మరి వస్తే జనం చచ్చిపోవాల్సిందేనని మీరు భావిస్తున్నారు. - లబ్ధిదారులకు ఇళ్లు ఉండకూడదు..ఎవరికి ఏ కష్టం వచ్చినా పలకరించడానికి ఎవరూ ఉండకూదన్నది మీ కోరిక. - ఇలాంటి దరిద్రమైన ఆలోచనలతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఉన్నారు. - చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ కళ్యాణ్ సిగ్గు ఎగ్గూ లేకుండా చదువుతున్నాడు. - వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నాడు: - గతంలో చంద్రబాబు కూడా ఇదే విధంగా వాలంటీర్లను చులకన చేసి హేళనగా మాట్లాడాడు. ఐదు వేలకు గోనె సంచులు మోసే ఉద్యోగమా...వీళ్లు మొగుళ్లు లేనప్పుడు తలుపులు కొట్టి యాగీ చేస్తున్నారంటూ చులకనగా మాట్లాడాడు. - కరోనా సమయంలో దేశంలోనే బెస్ట్ సర్వీసెన్‌ను వాలంటీర్ల ద్వారా అందిస్తే కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు జగన్ గారిని శెభాష్ అన్నాయి. - దీంతో చంద్రబాబుకు వాలంటీర్ వ్యవస్థ అంటే ఏంటో అర్ధం అయింది. - అందుకే నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాను అంటూనే, మరోవైపు తన దత్తపుత్రుడితో విషం చిమ్మిస్తున్నాడు. - పవన్ మాట్లాడిన మాట వాలంటీర్‌లు హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారనేది. ఒక మహిళగా నేను ఇది సహించలేను. - వీరు ఇళ్లకు వెళ్లి ఆడవాళ్లను అక్రమ రవాణ చేస్తున్నారని చెప్పడం దారుణం. ఇది ముమ్మూటికీ మహిళల్ని కించపరచడమే. - వాలంటీర్ల సర్వీసులను నేను కళ్లారా చూసినదాన్ని... నేను పవన్ కళ్యాణ్‌కు చెప్తున్నా... ఇప్పటికైనా చేసిన తప్పుకు చెంపలేసుకుని, వాలంటీర్ల కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. లేదంటే నీ సంగతి అదే వాలంటీర్లు తేల్చేస్తారు. అబద్ధాల్లోనూ పవన్ కు క్లారిటీ లేదు: - పవన్ మాట్లాడిన మాటలన్నీ అబద్ధాలే. రాష్ట్రంలో 15వేలకు పైగా సచివాలయాలు ఉంటే అందులో 2.60 లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు. - అందులో 70 శాతం మంది అంటే 1.80 లక్షల మంది మహిళలే. మహిళలే మహిళలను హ్యూమన్ ట్రాఫికింగ్ చేయడానికి ఈ ఉద్యోగం ఎంచుకున్నారా అని పవన్ కల్యాణ్ ను ప్రశ్నిస్తున్నా. - అసలు ఈ వాలంటీర్ అనేవారు ఏ గ్రామంలో... ఏ వీధిలో కుటుంబం ఉంటుందో ఆ కుటుంబాల నుంచి ఒకరు వాలంటరీగా వచ్చి సర్వీస్ చేస్తున్నారు. - తమ గ్రామానికి, తమ చుట్టుపక్కల ఉన్న పేదలకు తమవంతు సాయాన్ని అందించాలని ఈ వాలంటీర్ ఉద్యోగంలో చేరారు. - అలాంటి వ్యక్తుల్ని పట్టుకుని, ఆ వ్యవస్థ వల్లే మహిళల అక్రమ రవాణా చేస్తున్నారనడం సిగ్గుచేటు. - పవన్ కళ్యాణ్ చెప్పిన లెక్కలు ఎవరికీ అర్ధం కావడం లేదు. సెకన్ సెకన్‌కి నీ లెక్కలు మారిపోతున్నాయి.. - ఒక సారి 30వేలు అంటావు.. ఒక సారి 25వేలు, మరో సారి 15 వేలు అంటావు. నువ్వు చెప్పే అబద్ధంలోనూ నీకు క్లారిటీ లేదు. ఆ నిఘా వర్గాలు ఎవరు..?: - కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు డేటా ఇవ్వడం సాధారణంగా జరిగేదే.. - కానీ నీకు సమాచారం ఇచ్చిన కేంద్ర నిఘా వర్గాలు ఎవరు..? - కనీసం వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని నీకు డేటా ఎవరిచ్చారు..? - ఎన్సీఆర్బీ డేటాలో మిస్సింగ్ కేసుల్లో టాప్ టెన్ స్టేట్స్‌లో ఆంధ్రప్రదేశ్ లేనే లేదు. ఇప్పుడేమంటావ్ పవన్ కళ్యాణ్...? - ఆరో స్థానంలో తెలంగాణా ఉంది.. కేసీఆర్ గురించి నీవు ఇలానే మాట్లాడగలవా..? - ఎందుకంటే, ఇలానే పిచ్చివాగుడు వాగితే, వాళ్లు నీ మక్కెలు ఇరగ్గొడతారు..హైదరాబాద్‌లో నువ్వు బతకలేను అన్న భయం కాబట్టి నువ్వు అక్కడ మాట్లాడవు. - కానీ టాప్10లో లేని ఏపీ గురించి, సేవలందించే వాలంటీర్ల గురించి ఇంత చీప్ గా మాట్లాడుతున్నావంటే దానికి అర్ధం ఏమిటి..? - నువ్వు కలిసినా, ఇంకెవరు కలిసినా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేయలేమని మీకు బాగా అర్ధం అయ్యింది. అందుకే ఇటువంటి చీప్ ట్రిక్స్. మీ అమ్మను తిట్టిన వాళ్ళనే గెలిపించమని సిగ్గు లేకుండా అడుగుతావా?: - మీ అమ్మను, భార్యను, పిల్లలను తిట్టింది ఎవరో గుర్తు చేసుకో పవన్ కళ్యాణ్. - నువ్వే గతంలో ట్వీట్ చేశావ్... నీ ట్వీట్‌లు నీకు గుర్తు లేకపోతే నేను పంపిస్తా. - 2018 ఏప్రిల్ 20వ తేదీ అర్ధరాత్రి 12గంటల 15 నిమిషాలకు నువ్వు ట్వీట్ చేశావు. - వారాహి అంటే అమ్మవారు అంటూ ఆ వాహనంపైనే చెప్పులేసుకుని.. మీ అమ్మను తిట్టిన వారిని గెలిపించమని సిగ్గు లేకుండా నువ్వు మాట్లాడుతున్నావు. - టీడీపీ ప్రభుత్వం రావడానికి అండగా నిలబడినందుకు... నాకు ఇచ్చిన ప్రతిఫలం ఇదా.. అని ఆనాడు నీవే టీడీపీ నేతలను, చంద్రబాబును ప్రశ్నించావ్. - ఏపీ సెక్రటేరియట్ వేదికగా చేసుకుని చంద్రబాబు కుమారుడు, ఆతని స్నేహితుల ఆధ్వర్యంలో ఈనాడు, ఈటీవీ, ఏబీఎన్‌లలో నీ కుటుంబంపై నిరవధికంగా డిబేట్లు చేస్తూ... అత్యాచారం జరిపారని నువ్వే ట్వీట్లు చేశావ్.. - 2018 ఏప్రిల్ 20వ తేదీ తెల్లవాజామున 4.09 గంటలకు నువ్వు ఈ ట్వీట్ చేశావ్. - పది కోట్లు డబ్బులు ఖర్చు పెట్టి...నాకు సంబంధం లేని విషయాల్లోకి నన్ను లాగి..నాకు జన్మనిచ్చిన తల్లిని నడిరోడ్డులో అసభ్యంగా పచ్చి బూతులు తిట్టించి దాన్ని పదే పదే ప్రసారం చేసి, వాటిని టీడీపీవ్యక్తులు సర్క్యూలేషన్ చేశారని చెప్పావు. - మరి ఏబీఎన్ రాధాకృష్ణ నిన్ను ఇంటర్వ్యూకి పిలిచినప్పుడు సిగ్గులేకుండా ఎందుకు వెళ్లావ్..? - నిన్ను నమ్ముకుని నీ కోసం పనిచేస్తున్న జనసైనికుల కోసం నువ్వు ఏం చేశావ్..? - ఇదే బాలకృష్ణ నీ జనసైనికులను అలగా జనం, సంకర జాతి నాకొడుకులు... అని మాట్లాడితే నువ్వు ఎగురుకుంటూ వెళ్లి ఇంటర్వ్యూ ఎందుకిచ్చావ్..? - మీ రాజకీయం కోసం, మీ ప్యాకేజీ కోసం మీ అమ్మను, నిన్ను, నీ జనసైనికులను తిట్టిన వారిని వెనకేసుకొస్తూ మాట్లాడుతున్నావు. అసలు మిస్సింగుకి, అక్రమ రవాణాకి తేడా తెలుసా..?: - అసలు నీకు జగన్ గారిని అనే అర్హత ఉందా..? ఏ రోజైనా జగన్ గారు మీ పేరుకానీ, మీ అమ్మ, మీ భార్యా పిల్లల పేర్లు ఎత్తి మాట్లాడటం ఎక్కడైనా గమనించారా..? - మహిళలపై నీకు మాత్రమే ఏదో ప్రేమ ఉన్నట్లు, వారిని కాపాడటానికి అన్నట్లు మాట్లాడుతున్నావు. - అసలు మిస్సింగ్‌కి అక్రమ రవాణాకి తేడా తెలుసా నీకు..? - మిస్సింగ్ అంటే రకరకాల కారణాలతో ఇంట్లో నుంచి పారిపోవడం... లేకపోతే ప్రేమ వివాహాలు చేసుకోవడం.. అక్రమ రవాణా అనేది ఉద్దేశపూర్వకంగా ఆడవాళ్లని ట్రాప్ చేసి వ్యభిచార కూపంలోకి దింపడం. - నువ్వు మద్దతు పలుకుతున్న నీ దత్తడాడీ ఉన్నప్పుడు కాల్ మనీ సెక్స్ రాకెట్ ఆంధ్రప్రదేశ్ లో వెలుగు చూసింది. - ఆడవాళ్లకి డబ్బులు అప్పుగా ఇచ్చి...ఆ డబ్బు కట్టలేని వారిని వ్యభిచార కూపంలో దించితే మేమంతా ఆందోళనలు చేశాం. - ఆ రోజు నువ్వు మాట్లాడలేదు..దానికోసం ఫైట్ చేసిన నన్ను రూల్స్‌కి విరుద్ధంగా అరెస్ట్ చేశారు...అప్పుడూ నువ్వు మాట్లాడలేదు. - ఏం.. హెరిటేజ్ ఐస్‌క్రీంతో నీ నోరు నిండిపోయిందా..? ఎందుకు మాట్లాడలేదు..? పాదాభివందనం చేయాల్సింది పోయి హ్యూమన్ ట్రాఫికర్లు అంటావా..?: - జగన్ గారు గొప్ప వ్యవస్థను తీసుకొచ్చి, ప్రజలకు సర్వీస్ చేస్తున్న వాలంటీర్లను చూసి సహించలేక రాష్ట్రానికి వస్తున్న మంచి పేరును చెడగొట్టాలని చూస్తున్నారు. - నువ్వు మాట్లాడే మాటలు చూస్తుంటే ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రాకూడదు..ఈ రాష్ట్రంలో ఎవరూ సంతోషంగా ఉండకూడదు అని కంకణం కట్టుకున్నావనిపిస్తోంది. - నువ్వు మాట్లాడుతున్న వాలంటీర్ వ్యవస్థ పారదర్శక పరిపాలనలో ఒక విప్లవం. - నువ్వు మాట్లాడితే విప్లవం అంటావే తప్ప ఏ సమస్య గురించి కూడా 24 గంటలు ధర్నా, నిరసన చేయడం చేతకాని వాడివి. - ఈ వ్యవస్థ రాష్ట్రంలోని పేదలకు రూ.2.25 లక్షల కోట్లు పైసా లంచం లేకుండా డీబీటీ ద్వారా ఆప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో అందించారు. - సాక్షాత్తు ముస్సోరి ఐఏఎస్ శిక్షణ సిలబస్‌లో ఈ వ్యవస్థ స్థానం సంపాదించింది అంటే ఎంత గొప్ప వ్యవస్థ అనేది నువ్వు తెలుసుకోవాలి. - కోవిడ్ సమయంలో మన వాలంటీర్లు చేస్తున్న సేవలు చూసి కేరళ రాష్ట్రం, బ్రిటన్ దేశస్తులు కొనియాడారు. ఈ వ్యవస్థను వాళ్లు కూడా అమల్లోకి తెచ్చుకున్నారు. - ఈ రాష్ట్రంలో పుట్టి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లను అనరాని మాటలు మాట్లాడుతున్నావంటే ఇంతకంటే సిగ్గు చేటు ఉందా..? - కరోనా సమయంలో చనిపోయిన వారికి, వారి కుటుంబ సభ్యులు కూడా అంత్యక్రియలు చేయడానికి భయపడితే వాలంటీర్లు వారికి గౌరవంగా దగ్గరుండి అంత్యక్రియలు చేశారు. - అలాంటి వారికి పాదాభివందనం చేయాల్సింది పోయి..ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఏ సచివాలయానికి వెళదామో సెలక్ట్ చేసుకో.. : - రాష్ట్రంలో ఏ సచివాలయానికి వెళ్దామో నువ్వు సెలక్ట్ చేసుకో.. - నా నగరి వస్తావా..నువ్వు ఓడిపోయిన భీమవరం, గాజువాక..ఏదైనా నేను రెడీ. - నీకు ఎలాగూ పొద్దున్నే లేచే అలవాటు లేదు..అలారం పెట్టుకో. - ఎందుకంటే వాలంటీర్లు తెల్లవారుజామున 4 గంటలకే బయలు దేరతారు. 5 గంటలలోపు తలుపు తట్టి ఫించన్ ఇస్తారు. - ఆ పింఛన్ ఇచ్చే అవ్వాతాతలను అడగండి..వాలంటీర్ ఎలాంటి వాడని.. - అమ్మాయిలను అక్రమ రవాణా చేస్తున్నాడా అని అడగండి అప్పుడు వాళ్ళే నీకు బుద్ధి చెబుతారు. - వైఎస్ఆర్ చేయూత, అమ్మ ఒడి, ఆసరా తదితర పథకాల ద్వారా అక్కచెల్లెమ్మలకు కోసం పనిచేసిన వాలంటీర్ గురించి ఆ అక్కచెల్లెమ్మలను అడగండి. పరకతో దెబ్బలు కొడతారు. నీ బోడి గౌరవం ఎవరికి కావాలి..?: - జగన్ గారిని గౌరవించను..ఏకవచనంతో పిలుస్తాను అంటున్నాడు. - ఈ రాష్ట్ర ప్రజలు జగనన్నను గుండెల్లో పెట్టుకుని కొలుస్తున్నారు. - నీ బోడి గౌరవం.. నువ్వు ఇస్తే ఎంత..? ఇవ్వకపోతే ఎంత..? - 36 ఏళ్లకే జగన్ గారు మొదటి సారి ఎంపీ అయ్యాడు..38 ఏళ్ల వయసులో సొంత పార్టీ పెట్టి 5లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో రికార్డు సృష్టించారు. - 41 ఏళ్లకే 67 సీట్లతో ప్రతిపక్ష నాయకుడిగా, 46 ఏళ్లకే 151 సీట్లతో తిరుగులేని సీఎంగా, జగన్ అనే నేను అని ప్రమాణస్వీకారం చేశారు. - నీకు గాడిదలా 55 ఏళ్లు వచ్చాయి.. కనీసం ఎంపీటీసీ కూడా కాలేకపోయావ్. - నీకు దమ్ముంటే సింగ్యులర్‌గా పిలవడం కాదు.. జగన్ అన్నతో సింగిల్‌గా పోటీ చెయ్.. - 175 నియోజకవర్గాల్లో జనసేన తరఫున 175 మంది అభ్యర్థులను పెట్టి గెలిచి అప్పుడు సింగ్యులర్‌గా పిలిస్తే నువ్వు దమ్మున్నోడివి అవుతావ్. - పనికిమాలిన వాడిలా వయసు పెరిగింది కానీ బుద్ధి లేకుండా ఏకవచనంతో ఒక సీఎంను మాట్లాడుతున్నావంటే నీ తల్లి నీకు నేర్పించిన మేనర్స్ ఇదేనా..? - ఆమె గొప్ప తల్లి...నీవల్ల అందరూ ఆమెను అనే పరిస్థితి. తల్లి సరిగ్గా పెంచి ఉంటే ఇలా ఎందుకుంటాడు అనుకుంటున్నారు...ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు.. అమ్మా...నన్ను క్షమించు... గన్ పట్టుకు తిరిగే వాడు క్రిమినలా..? ప్రజలకు సేవ చేస్తున్న వారు క్రిమినలా..?: - ఎవరు క్రిమినల్.. రోడ్లపై గన్‌లు పట్టుకుని తిరిగే వాడు క్రిమినలా..? - లేక ప్రజల కోసం ఇంతగా సేవచేస్తున్న ముఖ్యమంత్రి క్రిమినలా...? - ఎప్పుడూ మేం అధికారంలోకి వస్తే బట్టలూడదీసి కొడతాం.. లాక్కెల్లి కొడతాం.. అంటూ క్రిమినల్‌లా మాట్లాడుతుంది ఎవరు..? , నువ్వు కాదా.. - నువ్వు అధికారంలోకి వస్తే కాదు...మేం ఇప్పుడు అధికారంలోనే ఉన్నాం...జగన్ గారు నీలానే ఆలోచిస్తే నువ్వు అనే మాటలన్నీ జరుగుతూ ఉండాలి. - వయసులో చిన్నవాడైనా పెద్ద మనసుతో, ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పరితపించే ముఖ్యమంత్రి కాబట్టి, మీరంతా ఇలా నోటికొచ్చినట్లు మాట్లాడగలుగుతున్నారు. - జగన్ గారి పేరు చెప్తే అతనో క్రియేటర్ అంటున్నారు. - 1972 తర్వాత ఈ దేశంలో 51 శాతం ఓట్లు సంపాదించిన ఘనత ఒక్క జగన్ గారికే సాధ్యమైంది. - ఒంటిచేత్తో 86 శాతం సీట్లను సాధించిన నాయకుడు వన్ అండ్ ఓన్లీ జగన్ గారే. - 3,648 కిలో మీటర్ల పాదయాత్రను దేశంలో ఎవరికీ సాధ్యం కాని విధంగా ముందుకు తీసుకెళ్లిన వన్ అండ్ ఓన్లీ జగన్ గారు. - రాష్ట్రాన్ని గ్రోత్ రేట్‌లో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో నెంబర్ వన్‌గా నిలిపారు. - రాష్ట్రం అప్పుల్లో, కష్టాల్లో ఉందని కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజలకు మంచి చేయకుండా తప్పించుకు తిరిగిన చంద్రబాబుకి మద్దతు పలుకుతున్న నువ్వు జగన్ గారి గురించి మట్లాడే అర్హత లేదు. - ఇంకో సారి ఇలానే మాట్లాడితే ప్రజలే నిన్ను తరిమికొట్టే పరిస్థితికి వస్తాయి. గోదావరి జిల్లాల్లో వరదలొస్తే నువ్వెక్కడ పవన్..?: - నువ్వు మాట్లాడుతున్న ఈస్ట్, వెస్ట్ జిల్లాల్లో వరదలొస్తే నువ్వు, నీ దత్త డాడి ఎక్కడికెళ్లారు..? - కానీ వాలంటీర్లు రేషన్ నుంచి కూరగాయలు వరకూ ఎలా అందించారో నీ కళ్ళకు కనిపించలేదా.. - మహిళల్ని అక్రమ రవాణా చేస్తున్నారంటూ నువ్వు తిడుతున్న ఆ మహిళా వాలంటీర్లే పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వెళ్లి రేషన్, సరుకులు అందించారు. - వృద్ధులకు ఆ వరదల్లో ఆరోగ్య సమస్యలు వస్తే భుజాల మీద మోసుకెళ్లి మరీ ట్రీట్‌మెంట్ చేయించిన వాలంటీర్లను చూడండి. - కోవిడ్ సమయంలో నువ్వు, నీ లోకేశ్, చంద్రబాబు హైదరాబాద్‌లోకి వెళ్లి దాక్కుంటే... నీ జనసేన ఫ్యాన్స్ తో సహా టీడీపీ వారికి కూడా సర్వీస్ చేసింది ఈ వాలంటీర్లే. - వారింటికి వెళ్లి వారికి వాళ్లకి కావాల్సినవన్నీ అందిస్తే ఈ రోజు నీ మీటింగుకు వచ్చి విజిల్స్ వేస్తున్నారు. - అలాంటి వాలంటీర్లను ... ఇంకో సారి పిచ్చి మాటలు మాట్లడితే పల్లు రాలగొడతారు. - ఇది సమాంతర వ్యవస్థ కాదు..ప్రజల సమస్యలు తీర్చే ఒక గొప్ప శక్తి. - అది జగన్ గారు క్రియేట్ చేసిన గాంధీ గారు కలలు కన్న గ్రామస్వరాజ్యం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థ. - 2024లో జగనన్న వన్స్‌మోర్.. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా.. బైబై బీపీ(బాబు-పవన్) అని చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. - ఇకనైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలని హెచ్చరిస్తున్నా.