బేతాళ కథలను మించిపోయిన‌ `ఈనాడు` క‌థ‌నాలు

ఆర్థిక‌, ప్ర‌ణాళిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి 

జీతాలు, పింఛన్లపై రామోజీరావు ప‌త్రిక రాత‌ల‌న్నీ అబ‌ద్ధాలు

ఏపీలో ఏ ఐఏఎస్ ఆఫీసర్‌కి జీతం రాలేదు..?

తాటికాయంత అక్షరాలతో నోటికొచ్చినవన్నీరాస్తే అబ‌ద్ధాలు నిజ‌మైపోవు

'ఈనాడు' కట్టు కథకు ఆధారాలేంటి? అసత్య ఆరోపణలకు రుజువేంటి? 

'అన్నదాత' మాస పత్రికకు బదులు ఈనాడు పత్రిక మూసివేసుకుంటే సరిపోయేది..

విజ‌య‌వాడ‌: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ, ఇతరత్రా రూపాల్లో ఇటీవల ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన రూ.982 కోట్లను వెనక్కి తీసుకుందంటూ ఈనాడు దినపత్రిక ప్రచురించిన కథనం పూర్తిగా అబద్ధాల అల్లిక. తప్పుల తడక. జీతాలు, పింఛన్లు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందంటూ ఈనాడు దినపత్రిక తన వ్యక్తిగత ఆరోపణలనే ఆధారాలుగా రాసిన  వార్త కథనం ముమ్మాటికి అబద్ధం అని రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక శాఖ మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి స్ప‌ష్టం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నెల పొడవునా ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం రామోజీరావు మరచిపోయారా? అని ప్ర‌శ్నించారు. తేదీ మొదలైన రోజు నుంచి నెలాఖరు దాకా జీతాలివ్వడం లాంటివి ఆనాడు ఈనాడుకు కనపడలేదు కదా? అని నిల‌దీశారు. అప్పుడేవేవో అద్భుతాలు జరిగాయి..ఇప్పుడు ఏమీ జరగట్లేదనేలా రాసే మీ రాతలు.. నీటిమూటలు కావా? అని ప్ర‌శ్నించారు. ఈనాడు ప‌త్రిక చేస్తున్న దుష్ప్ర‌చారంపై మంత్రి బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్‌రెడ్డి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న ఒక ప‌త్రికా ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 

"గతంలో మాజీ ఆర్థిక మంత్రి యనమల గారూ! దొరికినకాడికి అప్పులన్నీ చేసేశాం, అంతా ఊడ్చిపారేశాం. మీ ప్రభుత్వం వచ్చినా చిల్లిగవ్వ ఖజనాలో లేదు. ఒక్క రూపాయి అప్పు దొరకదు. అని బల్లగుద్ది చెప్పారు."  ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటైన వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం వచ్చి మూడేళ్లు. మీ ప్రభుత్వంలో కన్నా ఎక్కువ సంక్షేమ పథకాలు, అన్ని కులాలు, వర్గాలు సమానంగా అభివృద్ధి చెందేలా పటిష్టంగా అమలు చేస్తున్న నవరత్నాలే మా ప్రభుత్వ అంకితభావానికి నిదర్శనం.  

వైయ‌స్ఆర్‌ సీపీ ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి జీతాలు, పింఛన్లను వారం రోజుల్లోనే అన్నీ క్లియర్ చేస్తోంది. సాంకేతిక, అనివార్య కారణాలతో వీలుకాని అరుదైన సందర్భాల్లోనూ 10 రోజుల్లోగా ఎక్కడికక్కడ చెల్లింపులన్నీ పూర్తవుతున్నాయి. ఈ ఆర్థిక నిర్వహణ చాలదా మా ప్రభుత్వ దార్శనికత, చిత్తశుద్ధి ఏంటో ప్రజలు అర్థం చేసుకోవడానికి. రోజుకి రూ.400 -450 కోట్లు ఆదాయంగా రాష్ట్ర ఖజానాకి జమవుతాయని  ఆంధ్రప్రదేశ్ ఆర్థిక స్థితిగతులపై అవగాహన లేకుండా అసలేమాత్రం నిజం లేకుండా రాయడం ఈనాడుకే చెల్లు.

వార్తా దిన పత్రికలంటే దినదినం ప్రజలను చైతన్యపరచేవి. అంతేగానీ, ఓ వర్గం, మీ వర్గం అధికారంలో లేదనే అక్కసుతో ఏది పడితే అది రాసేవి దినపత్రికలు అనిపించుకోవు. నిత్యం పని కట్టుకుని అదే పని పెట్టుకుని జీతాలు, ఆర్థిక పరిస్థితి, అప్పుల గురించి తిప్పలు పడి రాస్తూ, లేనిది ఉన్నట్లు..ఉన్నవి లేనట్లు  రాస్తోన్న మీ క‌ల్పిత‌ కథనాలు చదువుతున్న వారు అవి కాస్తా బేతాళ కథలను మించి పోయాయని చదివినవారంతా నవ్వుకుంటున్నారు. తాటికాయంత అక్షరాలతో నోటికొచ్చినవన్నీ రాయడమే కాకుండా , ఆ కథనానికి మళ్లీ పెద్ద పెద్ద మూటలు పట్టుకుని పోతున్న అర్థం లేని కార్టూన్లు గీసేయడం వల్ల ఆ అబద్ధాలన్నీ నిజమై పోవు. నిజాలు రాయండి, సలహాలివ్వండి, అంతేగానీ ప్రజలను తప్పుదోవ పట్టించే కథనాలు అల్లి కల్లబొల్లి రాతలు రాసి ఈనాడు పత్రికను మరింత దిగజార్చకండి. 'అన్నదాత' మాస పత్రికకు బదులు ఈనాడు దినపత్రిక మూసివేసుకుంటే సరిపోయేదని యావత్ తెలుగులోకం అభిప్రాయపడుతోంది. అబద్ధాలు, కుట్రపూరిత కథనాలను ప్రచురించే 'ఈనాడు' సమాజానికి హానికరమనే చర్చ తీవ్రంగా జరుగుతోంది. ఈనాడు దినపత్రిక కన్నా అన్నదాత మాసపత్రిక వల్లనే  కొంతమందికైనా ప్రయోజనముండేది.

ఇవిగో ఇవీ నిజాలు: 
- 25.11.2022న జీఎస్టీ బకాయిల కింద ఆంధ్రప్రదేశ్ కి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం రూ.682 కోట్లు. ఆ మొత్తాన్ని కేంద్రం ఏమీ వెనక్కి తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమేం ఉలిక్కిపడలేదు. పాత బకాయిల కింద సర్దుబాటని ఆరోపించడంలో అసలు అర్థమే లేదు.

- 30.11.2022న ఆంధ్రప్రదేశ్ కు రావలసిన కేంద్ర నిధులు రూ.300కోట్లు ఇప్పటికే వచ్చాయి. వర్తమానాలు, రాయబారాలు, దాపరికాలు ఇందులో ఏవీ లేవు. "రాష్ట్రానికి కేంద్రం ఇస్తున్నట్లు వర్తమానం అందినా ఇంకా అవి చేరలేదని"  మీ పత్రికలో రాసిన ఈ అక్షరాలు అసత్యాలు కావా? అర్థం పర్థం లేని కథనం కాదా? అన్నట్లు ఈ మొత్తాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఉలిక్కిపడలేదు. సర్దుబాటు అనుమానమే అసలక్కర్లేదు. 

- ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం ఇష్టమొచ్చినట్లు వడ్డీలతో అప్పులు చేయడం మీకు తప్పు కాదు. తక్కువ వడ్డీకి.. మీకన్నా తక్కువే అప్పులు తెచ్చినా ఏదో జరిగిపోతుందున్నట్లు  మాత్రం ఆసక్తిగా రాస్తారు.

- మీకు నచ్చని, మీకు సరిపోని, మీకు కావలసింది చేయని ప్రభుత్వాలు ఏర్పాటైనప్పుడల్లా మీ వ్యూహమిదే. మీ తత్వం ఇదే. మీ వ్యక్తిత్వం ఇదే. ఇలాంటి వార్తా కథనాలు రాయడం వల్ల ఆంధ్రప్రదేశ్ పౌరులకేమైనా ప్రయోజనముందా? ఇలాంటివి ప్రచురించడం వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? 

- మీరు ఏ ఆర్థిక శాఖ అధికారులతో ఆరాలు పేరాలు తీశారో చెప్పండి? ఏ ఐఏఎస్ అధికారికి జీతం రాలేదో వెల్లడించండి? డిసెంబర్ 1వ తేదీన కార్పొరేషన్ నుంచి రూ.2వేల కోట్లు అప్పులు తెచ్చామని మీ పత్రికలో కథనం రాశారు. ఎంత హాస్యాస్పదం. ఏ కార్పొరేషన్ లో రూ.2000కోట్లు తీసుకున్నామో రాయలేదేం? ఏ అవగాహనతో, ఏ ఆధారాలతో ఇలా అసత్యాలు రాశారో ప్రజలకు సమాధానం చెప్పండి?. 

- ఆర్థిక పరిస్థితులు, రుణాలు, బకాయిలు, సర్దుబాట్లు, జీతాలివ్వలేని పరిస్థితి, ఖజానా ఖాళీ అని మీరెన్ని రకాల శీర్షికలతో అవే అవే అబద్ధాలు రాసినా  అవి ఎన్నటికీ నిజాలు కాబోవు. పైగా మీరు రాసే అర్థం లేని అబద్ధపు రాతలకు ఆర్థిక శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉలిక్కిపడాల్సిన అవసరం ఉందా..? ఊరికే చదివి నవ్వుకోవడం తప్పా..

- ప్రజలకు ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి చేస్తోన్న సంక్షేమం, అభివృద్ధిని చూసి మీరు, మీరు కావాలనుకునే మీ వర్గం వారు ఉలిక్కిపడే ఇలాంటి వార్తా కథనాలను వండివారుస్తున్నారని ప్రజలందరికీ తెలుసు. నిర్వహించే ప్రతి సభకు లక్షలాది మంది జనం తరలిరావడం, రాయలసీమ గర్జన, బీసీ గర్జనలకు తండోపతండాలుగా ప్రజలు రావడం చూసి మీరేం ఉలిక్కిపడలేదు కదా?

Back to Top