ఒక్కో కుటుంబానికి రెండు మూడు ప‌థ‌కాలు

సంక్షేమ రంగంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాలుగు అడుగులు ముందుకు వేశారు

రాబోయే రోజుల్లో సంక్షేమ ప‌థ‌కాల వ‌ర‌ద

మంత్రి విశ్వ‌రూప్‌

అమ‌రావ‌తి:  ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వంలో ఒక్కో కుటుంబానికి రెండు, మూడు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయ‌ని, జ‌నాభాకు మించి ప‌థ‌కాల ద్వారా ల‌బ్ధిపొందుతున్నార‌ని మంత్రి పెనిపే విశ్వ‌రూప్ అన్నారు. గురువారం మంత్రి అసెంబ్లీలో ఎస్సీ సంక్షేమం గురించి మాట్లాడారు. సంక్షేమ రంగంలో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ నాలుగు అడుగులు ముందుకు వేశారు. సంక్షేమం, న‌వ‌ర‌త్నాలు అప్ర‌తిహాసంగా రాష్ట్రంలో కొన‌సాగుతున్నాయి. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఎస్సీల ప‌క్ష‌పాతి. రాష్ట్ర జ‌నాభాలో ఎస్సీలు  84,69278 మంది ఉన్నారు. జ‌నాభా కంటే ల‌బ్ధిదారులు అన‌గా 1,30,45,130 మందికి రూ.13 వేల కోట్ల‌తో వివిధ ప‌థ‌కాల ద్వారా ఎస్సీల జీవితాల్లో వెలుగులు నింపారు. ఇది మా అదృష్టంగా భావిస్తున్నాం. జ‌నాభా కంటే ఎక్కువ సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్నాయి. ఒకే కుటుంబంలో వివిధ ర‌కాల ప‌థ‌కాలు అందుతున్నాయి. రెండు మూడు ప‌థ‌కాలు ఒక‌రికే అందుతున్నాయి. అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా ఎస్సీ ల‌బ్ధిదారులు 8,68,233 మందికి మేలు జ‌రిగింది. రూ.13 కోట్లు డీబీటీ ద్వారా నేరుగా అందాయి. వైయ‌స్ఆర్ చేయూత ద్వారా 5,83571 మందికి రూ.1094 కోట్లు డ‌బ్బులు అందాయి. సున్నా వ‌డ్డీ ద్వారా రూ.239 కోట్లు అందాయి. వైయ‌స్ఆర్ పింఛ‌న్ కానుక ద్వారా 103679 మందికి రూ.3773కోట్లు సొమ్ము అందుతోంది. రైతు భ‌రోసా ద్వారా రూ.1187కోట్లు ల‌బ్ధి పొందారు. ఎస్సీలు మ‌త్స్య‌కార భ‌ర‌సా రూ.44 ల‌క్ష‌ల ల‌బ్ధి, జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన, విద్యా దీవెన ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. వీదేశీ దీవెన ద్వారా ల‌బ్ధి పొందుతున్నారు. వైయ‌స్ఆర్ వాహ‌న మిత్ర ద్వారా రూ.119 కోట్లు, 372 మంది లా డిగ్రీ చ‌దివిన వారికి ప్రోత్స‌హ‌కం. చేనేత కార్మికుల‌కు, సుక్ష్మ ఇండ‌స్ట్రీస్ పారిశ్రామిక వేత్త‌ల‌కు ప్రోత్సాహకం అందింది. ఎస్సీ రైతులకు వైయ‌స్ఆర్ సున్నా వ‌డ్డీ అంద‌జేస్తున్నాం. ఇందులో ఏవిధ‌మైన ప‌క్ష‌పాతం, పార్టీలు చూడ‌కుండా సాయం చేస్తున్నాం. వైయ‌స్ఆర్ ఆరోగ్య‌శ్రీ‌,  వైయ‌స్ఆర్ ఆస‌రా, జ‌గ‌న‌న్న‌గోరుముద్ద‌, వైయ‌స్ఆర్ సంపూర్ణ పోష‌ణ‌, జ‌గ‌న‌న్న విద్యా కానుక‌, ఇళ్ల స్థ‌లాలు, భూ సేక‌ర‌ణ‌, భూ అభివృద్ధికి నాన్ డిబీటీ ద్వారా సాయం అందించాం. జ‌నాభాను మించి రాష్ట్రంలో సంక్షేమ కార్య‌క్ర‌మాలు అమ‌లు అవుతున్నాయి.  ఎస్సీల కార్పొరేష‌న్ ద్వారా 2300 మందికి మినీ ట్ర‌క్‌లు అంద‌జేస్తున్నాం. రాబోయే రోజుల్లో సంక్షేమ ప‌థ‌కాల వ‌ర‌ద పారుతుంద‌ని చెప్పారు. ఏ ప‌థ‌కంలో కూడా ప‌క్ష‌పాతం లేకుండా, అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ ప‌థ‌కాలు అమ‌లు చేస్తున్నామ‌ని మంత్రి విశ్వ‌రూప్ వివ‌రించారు. 

 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top