200 రోజుల్లో ఆర్టీసీని విలీనం చేసిన ఘనత సీఎం వైయస్‌ జగన్‌ది

ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు

ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని నెరవేర్చిన సీఎం వైయస్‌ జగన్‌ 

ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు ప్రవేశపెట్టిన మంత్రి పేర్ని నాని

మంత్రి పేర్ని నాని

అసెంబ్లీ: పాదయాత్రలో, ఎన్నికలకు ముందు ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన హామీని వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన 200 రోజుల్లో అమలు చేశారని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని పేర్కొన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు సభలో ప్రజా రవాణా శాఖలో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేస్తూ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పేర్ని నాని సభలో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..  ఆంధ్రప్రదేశ్‌ రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులను ప్రభుత్వ సర్వీస్‌ చేర్చుకొనుటకు, అందుకు సంబంధించిన, అనుసంబంధమైన విషయాలను నిబంధించుటకు అవసరమైన బిల్లును పరిగణలోకి తీసుకోవాలి. రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఏపీ రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగస్తులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసేందుకు నేటి యువ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రజా రవాణా శాఖ అనే నూతన శాఖను రాష్ట్ర రవాణా శాఖా ద్వారా ఏర్పాటు చేసేందుకు ఈ చట్టం ద్వారా ఉపక్రమిస్తోంది. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆర్టీసీకి జీవం పోశారు. ఎన్నికలకు ముందు డాక్టర్‌ వైయస్‌ఆర్‌ తనయుడు వైయస్‌ జగన్‌ పాదయాత్ర చేసే సమయంలో ఆర్టీసీ కార్మికులు కలిసి ఆర్టీసీలో జరుగుతున్న నష్టాలను వివరించారు. ఆర్టీసీ ఏటేటా నష్టాల్లో ఏరకంగా కూరుకుపోతున్నాయి. జీతాలు వస్తాయా? అన్న అనుమానంతో మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అందరూ ఆ రోజు కోరారు. ఆ రోజు పరిష్కారం చెబుతూ..మనందరి ప్రభుత్వం వస్తే ఆర్టీసీ ఉద్యోగులస్తులందరిని ప్రభుత్వంలోకి తీసుకువస్తానని ప్రతి సభలోనూ చెప్పారు. ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న వైయస్‌ జగన్‌ మాట కోసం ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకు కొత్తగా ఒక చట్టం చేస్తున్నాం. 1997లో చంద్రబాబు 1497 అనే ఒక చట్టాన్ని తీసుకువచ్చారు. ప్రభుత్వ అనుబంధరంగంలో ఉన్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకూడదని ఆ చట్టం తెచ్చారు. నాడు ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగం కలగా తయారు చేశారు. ఈ చట్టాన్ని అధిగమిస్తూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చుతూ చట్టం చేస్తున్నాం. పాలకుడు అనే వాడు ఎట్టి పరిస్థితుల్లో కూడా హృదయంతో స్పందించాలి. మెదడుతో స్పందించేవారు ఉంటే కష్టాలు ఉండవు. నాడు 2017 సెప్టెంబర్‌ 22న నాటి సీఎం చంద్రబాబును ఆర్టీసీలోని ఒక కార్మిక సంఘం పిలిపి వారి సంఘం 50వ వార్షికోత్సవంలో చంద్రబాబు ఏమన్నారో వీడియో చూపించారు. ప్రభుత్వ రంగంలో పని చేసేవారికే ఉద్యోగాలు..మీరంతా ఏ వ్యవస్థలో ఉన్నా ఆ వ్యవస్థ బాగుండాలి కానీ, పబ్లిక్‌ సెక్టార్‌ అంతా కూడా ప్రభుత్వ రంగంలోకి తీసుకోవడం సాధ్యం కాదని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల ఫెర్మామెన్స్‌ను బట్టే వారికి జీతాలు ఉంటాయని ఆ రోజు చంద్రబాబు అన్నారు. 
ఆర్టీసీ కార్మికులు కష్టాలు చెప్పుకుంటే ఆ రోజు పాదయాత్రలో వైయస్‌ జగన్‌ ఎలా స్పందించారంటే..ఆర్టీసీలో పని చేసే ప్రతి కార్మికుడికి మాటిస్తున్నాను..ఆర్టీసీలోని 65 వేల మంది కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేస్తామని మాటిచ్చారు. ఈ ఆరు నెలల్లో వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీలు అమలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు. మే 30, 2019న సీఎంగా వైయస్‌ జగన్‌ ప్రమాణ స్వీకారం చేస్తూ జూన్‌ 8, 2019న మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు, జూన్‌ 19న అంజనేయరెడ్డి కమిటీని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌ 3, 2019న ఈ కమిటీ సీఎంకు నివేదిక ఇచ్చారు. సెప్టెంబర్‌ 4న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తున్నామని మంత్రి మండలిలో తీర్మానం చేశాం. ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీలిచ్చి మొదటి సంతకంగా నాలుగు సంతకాలు చేశారు.   రుణమాఫిపై చంద్రబాబు వేసిన కోటయ్య కమిటీ, కాంట్రాక్ట్‌ కార్మికులను రెగ్యులర్‌ చేసేందుకు మరో కమిటీ ఏర్పాటు చేశారు. ఇంతవరకు ఆ కమిటీలు నివేదికలు ఇవ్వలేదు. ఎవరు అడగకుండానే సెప్టెంబర్‌ మాసం నుంచి ఆర్టీసీలో పని చేస్తున్న ఉద్యోగుల పదవి కాలం 60 ఏళ్లుగా వైయస్‌ జగన్‌ నిర్ణయం తీసుకున్నారు. ఐఏఎస్‌ ఆఫీసర్లతో ఓ కమిటీ ఏర్పాటు చేశాం. నవంబర్‌ 1న ఆర్టీసీ విలీనానికి ఆర్టీసీ బోర్డు ఆమోదం తెలిపింది. చాలా మందికి అనుమానాలు వచ్చాయి. కేంద్రాన్ని అడిగారా అంటూ సందేహాలు వెలిబుచ్చారు. అందరి ఆమోదంతో ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాం. ఉద్యోగుల విలీన ప్రక్రీయ డిసెంబర్‌ 11న కొత్త చట్టం ఏర్పాటు చేయాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నాం. డిసెంబర్‌ 16న ఆర్టీసీ ఉద్యోగులందరిని ప్రజా రవాణా విభాగంలో 50 వేల పైచిలుకు ఉద్యోగులందరిని విలీనం చేస్తున్నాం.  200 రోజుల్లో చెప్పిన మాటను వైయస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారు. దేశంలో ఎక్కడా కూడా ఇలాంటిది జరిగి ఉండదు. భవిష్యత్తులో జరగదు కూడా. ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా ఉన్న కార్పొరేషన్‌ సంస్థను ప్రభుత్వంలోకి విలీనం చేశారు. ఇవాళ్టికైనా వైయస్‌ జగన్‌కు మనసులోనైనా ప్రతిపక్షాలు అభినందనలు తెలపాలి. పరిణామ క్రమం చూసుకుంటే..2014లో రాష్ట్రం విడిపోయింది. నాడు ఆర్టీసీ అప్పులు రూ.2904 కోట్లు. ఏటేటా పెరుగుతున్నాయి. 2015లో రూ.3435.98 కోట్లు, 2016లో రూ.4171.47  కోట్లు, 2017లో రూ.4,496.96 కోట్లు  , 2018లో రూ.5,652.99 కోట్లు, 2019 మార్చి 31 నాటికి రూ.6816.67 కోట్ల నష్టాన్ని ఆర్టీసీ చేరింది. ఈ ప్రభుత్వం నవంబర్‌ 30 నాటికి అప్పు రూ.6735 కోట్లకు తగ్గింది. పాలనాదక్షితతో ఉన్న వైయస్‌ జగన్‌ ఆర్టీసీని బాగు చేసేందుకు రోజు రోజుకు నష్టాలను  తగ్గిస్తూ వస్తున్నారు. 40 ఏళ్ల అనుభవం అని చెప్పుకుంటున్న నేతలు ఏటేటా ఆర్టీసీని నష్టాల ఊబిలోకి నెట్టారు. ఆర్టీసీ చరిత్రలో సంస్థను ఆదుకునేందుకు ఒక్క ఏడాదికి రూ.1572 కోట్లు ఇచ్చిన ఏకైన సీఎం వైయస్‌ జగన్‌ ఒక్కరే. ఆ రోజు వైయస్‌ రాజశేఖరరెడ్డి ఆర్టీసీ కోసం రెండు అడుగులు ముందుకు వేస్తే వైయస్‌ జగన్‌ వందల  అడుగులు ముందుకు వేస్తున్నారు. ఆర్టీసీకి బడ్జెట్‌లో రూ.1572 కోట్లు కేటాయించి బతికిస్తున్నారు.  ఆర్టీసీ ఉద్యోగులను ప్రజా రవాణా శాఖలో విలీనం చేయడం ద్వారా ప్రభుత్వానికి రూ.3600 కోట్ల ఆర్థిక భారం బాధ్యతను వైయస్‌ జగన్‌ ప్రభుత్వం భుజానికి ఎత్తుకుంటుంది. గడిచిన పాలన, ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి గమనించాలి. 2013లో పే రివిజన్ కమిషన్‌  ఇచ్చిన జీతభత్యాల పెంపుదలపై 2014లో 40 ఏళ్ల అనుభవం ఉన్న పాలకుడు  ఒక మాట చెప్పారు. పక్క రాష్ట్రంలో 43 శాతం పెంచితే..ఐదేళ్లలో చంద్రబాబు ఇచ్చింది 60 శాతం మాత్రమే ఇచ్చారు. మిగతా 40 శాతాన్ని ఈ ఆరు మాసాల్లో చెల్లించాం. పాత బకాయిలను కూడా మా ప్రభుత్వం చెల్లించింది. ప్రతి ఏటా రూ.80 కోట్లే చెల్లించేవారు. అప్పులు త్వరగా తీర్చాలని ఈ ఏడాది సీసీఎస్‌కు అదనంగా రూ.60 కోట్లు చెల్లించాం. వైయస్‌ జగన్‌ మాకు, అధికారులకు ఒక్కటే చెప్పేవారు. జనవరి 1 నాటికి ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రజా రవాణా శాఖలోకి మారాలని, ఈ టార్గెట్‌ ప్రకారం పని చేయాలని మమ్మల్ని ఆదేశించారు. ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులందరినీ కూడా జనవరి 1లోపే విలీనం చేసేందుకు చర్యలు తీసుకున్నాం. చిత్తశుద్ధితో ఆర్టీసీ ఉద్యోగులను విలీనం చేసిన ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను అందరూ కూడా అభినందిస్తూ ఈ బిల్లును ఆమోదించేందుకు సహకరించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నా..

 

తాజా ఫోటోలు

Back to Top