ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన

సచివాలయం: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టెక్నికల్‌గా, లీగల్‌గా ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దడానికి ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ సమావేశంలో తాను లేనని, పూర్తి వివరాలు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ కావాలనే పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకొని రెండున్నరేళ్లుగా రాజధాని పేరుతో ఉద్యమం నడిపిస్తోందని, దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయన్నారు. ఇంటర్వెల్‌ మాత్రమే అయిందని, సినిమా శుభం కార్డు పడినప్పుడు తెలుస్తుందన్నారు. 

తాజా ఫోటోలు

Back to Top