గ్రామ సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌

విజయవాడ: రాష్ట్రంలోని గ్రామ సర్పంచ్‌లతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ‘జగనన్న స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం అమలుపై సర్పంచ్‌లతో చర్చించారు. జూలై 8 దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి జయంతి రోజున జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు.  ప్రతిధ్వని పేరుతో పంచాయతీరాజ్‌ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమంలో 13 జిల్లాల నుంచి ఇద్దరేసి చొప్పున 26 మంది సర్పంచ్‌లతో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడనున్నారు.   
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top