అనంతపురం: మాది రైతు ప్రభుత్వమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. రైతు ప్రభుత్వంగా పేరు తెచ్చుకుని, రైతుల కోసం వైయస్ జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. రైతులకు ఏ ప్రభుత్వం ఇంత మేలు చేయలేదని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఈ నెల 7న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టపర్తి పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 7న పుట్టపర్తిలో రైతు భరోసా అందిస్తారు అని తెలిపారు. సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో రైతు భరోసా పంపిణీ జరుగుతుంది అని మంత్రి తెలిపారు. కొత్త జిల్లాలు ఏర్పడ్డాక మొదటి సారి జిల్లాలో ఈ కార్యక్రమం జరుగుతుంది అని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 99 శాతం ఎన్నికల హామీలు నెరవేర్చాం అని తెలిపారు. మరే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఎన్నికల హామీలు అమలు చేసిన చరిత్ర లేదు అని ఆయన వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.