కుల పార్టీ కోసం పనిచేయడానికి సిగ్గులేదా..?

చంద్రబాబు కోసం ఎలక్షన్‌ వాయిదా వేసి రాజ్యాంగ పదవినే కించపరుస్తావా..?

వెంకటేశ్వర యూనివర్సిటీలో బాబు, రమేష్‌ల బంధం బలపడింది

ఈనాడు, ఆంధ్రజ్యోతి బాబును యుగపురుషుడిగా చూపిస్తున్నాయి

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడైనా ఒక్క కరోనా కేసు నమోదైందా..?

పిచ్చి రాతలతో ప్రజలను ఎందుకు గందరగోళానికి నెడుతున్నారు

దమ్ముంటే పుంగనూరులో గెలవండి.. రాజీనామా చేసి వెళ్లిపోతా..

చంద్రబాబుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బహిరంగ సవాల్‌

తిరుపతి: రాజ్యాంగపరమైన పదవిలో ఉండి కుల పార్టీకి సేవ చేయడానికి అంకితం చేయడానికి సిగ్గులేదా అని ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ను పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రశ్నించారు. కరోనా ఎఫెక్ట్‌ లేదని స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్‌ ఇచ్చి వారం తిరక్కముందే చంద్రబాబు చెప్పాడని రమేష్‌కుమార్‌ ఎన్నికలు వాయిదా వేశాడని మండిపడ్డారు. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దొమ్మలపాటి శ్రీనివాస్‌ రాసిచ్చిన కాగితాన్ని తీసుకువచ్చి ఎన్నికల కమిషనర్‌ జేబుల్లోంచి తీసి చదివాడని, ఒక పార్టీ కోసం పనిచేస్తున్నాడనేది క్లియర్‌గా అర్థమవుతుందన్నారు. చంద్రబాబు, ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ వచ్చి పుంగనూరులో పోటీ చేసి గెలిస్తే తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోతానని పెద్దిరెడ్డి సవాల్‌ విసిరారు. తిరుపలిలోని వైయస్‌ఆర్‌ సీపీ కార్యాలయంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

మంత్రి పెద్దిరెడ్డి ఏం మాట్లాడారంటే..

  • గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ అధికారులు కరోనా వైరస్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. వారికి తోడుగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ ఉంటే ఇంకా దీటుగా ఎదుర్కోవచ్చు అనేది ప్రభుత్వ అభిమతం. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఒకే ఒక వ్యక్తిని గుర్తించి ఐసోలేషన్‌లో పెట్టి చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తొందరగా ఎన్నికలు నిర్వహించుకుంటే స్థానిక ప్రజాప్రతినిధులు కరోనాను వైరస్‌ను అరికట్టేందుకు కృషి చేసేవారు.
  • ఫ్రాన్స్‌లో 120 మందికిపైగా చనిపోయారు. 5 వేలకు మందికి పైగా వ్యాధి సోకింది. అయినా ఎన్నికలు జరిపితే 55 శాతానికి పైగా పోలింగ్‌ జరిగింది. ప్రజాప్రతినిధులతో వ్యాధిని అరికట్టేందుకు ఫ్రాన్స్‌లో ఎన్నికలు జరిగాయి. గోవాకు విదేశాల నుంచి ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. గోవాలో కూడా ఈ నెల 22న స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌లో ఒకే ఒక్క కేసు నమోదైందని వారం క్రితం ఎన్నికల కమిషనర్‌ రమేష్‌కుమార్‌ చెప్పారు. కరోనాతో ప్రమాదం లేదని కూడా చెప్పారు. వారం రోజులు కూడా తిరక్కముందే కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశారు. ఈసీని అడ్డం పెట్టుకొని రాష్ట్రాన్ని అతలాకుతలం చేయాలని చంద్రబాబు ప్రయత్నం.
  • చంద్రబాబు ఇప్పటికే రూ.3 లక్షల పైచిలుకు అప్పులు చేశాడు. రాష్ట్ర విభజన సమయంలో రూ.లక్ష కోట్ల అప్పును రూ.3 లక్షల కోట్లకు పెంచాడు. రూ. 60 వేల కోట్లు బకాయిలు చెల్లించకుండా వెళ్లాడు. ఈ విధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని అతలాకుతలం చేసినా.. సీఎం వైయస్‌ జగన్‌ అన్ని సంక్షేమ పథకాలు, మేనిఫెస్టోలోని అంశాలను అమలు చేశారు.  
  • ఎన్నికల కమిషనర్‌ చంద్రబాబు తొత్తు కాబట్టి అతన్ని అడ్డుపెట్టుకొని ఎన్నికలు వాయిదా వేయించాడు. ఆర్థికంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని, టీడీపీ ఉనికి కాపాడుకోవాలని చంద్రబాబు తాపత్రయం. రూ. 5200 కోట్ల డబ్బును రాకుండా ఎన్నికలు వాయిదా వేయించాడు.
  • మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఎన్నికలు జరపడం లేదని టీడీపీ నేతలు అంటున్నారు. అక్కడ ఎన్నికల నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. తప్పు కప్పిపుచ్చుకోవడానికి కుంటిసాకులు చెబుతున్నారు.
  • స్టేట్‌ కంట్రోల్‌ రూమ్‌ డైరెక్టర్‌ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం 160 దేశాల్లో ప్రభావితమైన కరోనా వైరస్‌ మన రాష్ట్రంలో 856 మందిని గుర్తించారు. 28 రోజుల్లో 150 మందిని అబ్జర్వేషన్‌లో పెట్టారు. హోమ్‌ ఐసోలేషన్‌లో 586 మంది, ఆస్పత్రుల్లో 20 మంది, టెస్టు చేసిన 102 మందిలో ఒక్కరికి మాత్రమే పాజిటీవ్‌ వచ్చింది. ఇంకా 11 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. రాష్ట్రంలో ఒక్కరే ఉన్నారు. ఇదే ఆరు వారాలు అంటే ఎక్కువ కూడా కావొచ్చు.
  • చంద్రబాబు ఒక అలవాటు ఉంది. తప్పు చేయాలంటే ముందుగానే గ్రౌండ్‌ ప్రిపేర్‌ చేస్తాడు. చేసిన తప్పును ఎదుటి పార్టీపై నెట్టే ప్రయత్నం చేస్తాడు. బాబు కుల గురువు, ఈ టీవీ చానళ్లు, ఈనాడు పత్రిక యజమాని, ఏబీఎన్‌ చానల్, ఆంధ్రజ్యోతి పత్రిక వాటిల్లో చూపించడం, వాటిని వీడియో రూపంలో చూపించడం. ఎక్కడైనా ఒక్క కేసు అయినా నమోదైందా..?
  • పంచాయతీలు ఏకగ్రీవం అయితే పెద్ద పంచాయతీ అయితే రూ. 20 లక్షలు, 5 నుంచి 10 వేల మంది జనాభా ఉంటే రూ.10 లక్షలు, చిన్న పంచాయతీ అయితే రూ.5 లక్షలు ఇస్తామని జీఓ కూడా ఇచ్చాం. గ్రామాల్లో కక్షలు తగ్గాలు, ఏకగ్రీవం అయితే గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని ప్రభుత్వం ఆలోచన చేసింది.
  • నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ వెంకటేశ్వర యూనివర్సిటీ విద్యార్థి, చంద్రబాబు వెంకటేశ్వర యూనివర్సిటీ, నేను కూడా అక్కడే చదువుకున్నాను. అప్పటి నుంచి రమేష్‌కుమార్‌తో చంద్రబాబు బంధం బలంగా ఉంది. బ్లాక్‌ క్యాట్‌ను చూసి ఇంకా ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు. వైయస్‌ఆర్‌ సీపీ విలువలకు కట్టుబడి ఉంది కాబట్టే చంద్రబాబుకు ఇంకా ప్రతిపక్ష నేత హోదా మిగిలి ఉంది.
  • ఇళ్ల పట్టాలు కూడా ఇవ్వకూడదని చంద్రబాబు ఎన్నికల కమిషన్‌తో ఆంక్షలు విధించేలా చేశాడు. నిబద్ధత కలిగిన అధికారి బాబూరావును ఎన్నికల పరిశీలకుడిగా నియమిస్తే.. అతన్ని చంద్రబాబు మార్చి తన తాబేదారు అయిన సిద్ధార్థ జైన్‌ను తీసుకువచ్చాడు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తలను చూసి రిపోర్టులు రాయడం. వాటిలో నిజానిజాలను చూడకుండా ఎన్నికల కమిషనర్‌ అత్యుత్సాహం ప్రదర్శించడం. చంద్రబాబు కోసం రమేష్‌కుమార్‌ పాకులాడుతున్నాడు.
  • చంద్రబాబు అక్రమాలు అన్ని బయటపెడుతున్నానని నాపై చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నాడు. చిత్తూరు జిల్లాకు చంద్రబాబు, కిరణ్‌కుమార్‌ రెడ్డి వల్ల చెడ్డపేరు వస్తుంది. తెలుగుదేశం పార్టీ నేతలు గొడవలు పెట్టుకుంటుంటే.. దాన్ని వైయస్‌ఆర్‌ సీపీపై నెట్టుతున్నారు. వక్రీకరించి మాట్లాడడం సరికాదు. చంద్రబాబు ఏం చేసినా యుగపురుషుడి మాదిరిగా ఈనాడు, ఆంధ్రజ్యోతి రాస్తుంటాయి. ఇలాంటి పద్ధతుల్లోనే చంద్రబాబు ఇంకా రాజకీయం చేస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికల వరకు టీడీపీని నిలబెట్టుకోలేడు
Back to Top