ఉపాధి నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణం

ఉపాధి హామీ పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష
 

అమరావతి: ఉపాధి హామీ పథకం నిధులతో గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేపడుతున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉపాధి హామీ పథకంపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. తక్కువ ధరకే సిమెంట్‌ను అందించేలా సిమెంట్‌ కంపెనీలతో కలెక్టర్లు చర్చలు జరపాలని సూచించారు. 25 లక్షల పక్కా గృహాల నిర్మాణానికి అనుబంధంగా ఉపాధి హామీ పనులు చేపట్టాలన్నారు. గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ డ్రైన్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు. మన బడి నాడు-నేడు కింద పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన , ఉపాధి నిధులతో ప్రహారీ గోడల నిర్మాణాలకు రూ.601 కోట్లు,  2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ.3,335 కోట్ల ఉపాధి నిధులు కేటాయించామని, ఇప్పటి వరకు రూ.896 కోట్లు ఖర్చు చేసినట్లు మంత్రి వివరించారు.
 

Read Also: ఎస్పీజీ సవరణ బిల్లుకు వైయస్‌ఆర్‌సీపీ మద్దతు

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top