మైనింగ్‌ శాఖ‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి సమీక్ష

కృష్ణా: ఇసుక బుకింగ్‌ ప్రక్రియను ఏపీఎండీసీ నుంచి గ్రామ సచివాలయాలకు అనుసంధానం చేస్తున్నామని పంచాయతీ రాజ్, మైనింగ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. మైనింగ్‌ అధికారులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ సచివాలయంలో వచ్చిన డిమాండ్‌ను బట్టి ఏపీఎండీసీ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక దుర్వినియోగం కాకుండా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేస్తున్నామన్నారు. ఇసుక యాడ్‌ నుంచి 10 కిలోమీటర్లలోపే స్టాక్‌ పాయింట్‌ ఉంచాలని నిర్ణయించామన్నారు. దీని వల్ల వినియోగదారులకు ట్రాన్స్‌పోర్టు ఖర్చులు తగ్గుతాయన్నారు. 
 

Back to Top