ప్రజాస్వామ్యం విరాజిల్లడానికి  రాజ్యాంగమే కార‌ణం

వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం 

తాడేప‌ల్లి:  భారతదేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లడానికి కారణం అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగమే అని మంత్రి మేరుగు నాగార్జున అన్నారు.   దేశ చరిత్రలో అణగారిన వర్గాలను ముందుకు తీసుకురావడంలో రాజ్యాంగం ప్రధాన పాత్ర వహించింది. భారతదేశంలో ప్రజాస్వామ్యం విరాజిల్లుతుందంటే దానికి అంబేద్కర్ ప్రసాదించిన రాజ్యాంగమే ప్రధాన కారణం. ప్రపంచ దేశాలలో భారత దేశం అతి పెద్ద ప్రజాస్వామ్యదేశంగా కీర్తిప్రతిష్టలు పొందగలిగిందంటే రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు కీలకభూమిక పోషిస్తున్నాయి అని రాష్ర్ట సాంఘికసంక్షేమ శాఖమంత్రి మేరుగ నాగార్జున అభిప్రాయపడ్డారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం రాజ్యాంగ ఆమోద దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మంత్రి మేరుగ నాగార్జున,శాసన మండలి లో ప్రభుత్వ విప్ శ్రీ లేళ్ళ అప్పిరెడ్డి తోపాటు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు చంద్రశేఖర్ రెడ్డి,పార్టీ అధికారప్రతినిిధి కాకుమాను రాజశేఖర్,ఎస్సి కార్పోరేషన్ ఛైర్మన్ కనకారావు మాదిగ,ఎస్సి కమీషన్ సభ్యుడు కాలే పుల్లారావు,ఆప్కో ఛైర్మన్ గంజి చిరంజీవి, పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య,దివ్యాంగుల కార్పోరేషన్ ఛైర్మన్ ముంతాజ్ పఠాన్, దివ్యాంగుల విభాగం పార్టీ అధ్యక్షుడు బందెల కిరణ్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.

      ఈ సందర్భంగా మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.... నేడు ఆంధ్రప్రదేశ్ లో అంబేద్కర్ రాజ్యాంగంలో ఏవైతే సూచించారో వాటిని తూచతప్పకుండా అమలు చేస్తున్న వ్యక్తి రాష్ర్ట ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ అన్నారు. ముఖ్యంగా పేదరికాన్ని రూపుమాపి సమానత్వం అందరికి సమాన అవకాశాలు కల్పించే లక్ష్యంతో జగన్ గారు పనిచేస్తున్నారన్నారు. బడుగు బలహీన మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో అత్యధికమందికి చోటుకల్పించారన్నారు. మండల,గ్రామ,పట్టణ స్దాయిలో అన్ని పాలకవర్గాలలో సైతం ఇదే సిధ్దాంతాన్ని అనుసరించారన్నారు. అంబేద్కర్ భావజాలాన్ని అమలు చేస్తున్నది జగన్ గారు మాత్రమేనన్నారు.గతంలో చాలా ప్రభుత్వాలు ఉన్నా వారు అంబేద్కర్ భావజాలాన్ని కేవలం మాటలకే పరిమితమయ్యారన్నారు. చంద్రబాబు హయాంలో రాజ్యాంగాన్ని,అంబేద్కర్ భావజాలాన్ని అవహేళన చేసేవిధంగా అవమానించేవిధంగా వ్యవహరించారన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాచారన్నారు.ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని వ్యాఖ్యానించారన్నారు.
నేడు రాజ్యాంగాన్ని అమలు చేస్తూ సమాన అవకాశాలను కల్పిస్తూ అనేక సంస్కరణలు తీసుకువస్తున్నారన్నారు. కుల,మత,ప్రాంతాలనే అభిప్రాయాలు లేకుండా అందరికి విద్య,వైద్యం,సంక్షేమ ప్రయోజనాలు అందేవిధంగా పధకాలను అమలు చేస్తున్నారన్నారు.రాజ్యాంగ విలువలు తొణికిసలాడుతున్నాయన్నారు. పేదవాడి పిల్లల చదువు బాధ్యత జగన్ గారు తీసుకున్నారన్నారు.

శాసన మండలి లో ప్రభుత్వ విప్  లేళ్ళ అప్పిరెడ్డి మాట్లాడుతూ...అంబేడ్కర్ రాజ్యాంగం దేశంలోని అన్నివర్గాల కు సమాన హక్కులు,అవకాశాలు కల్పించిందన్నారు. రాజ్యాంగం వల్లనే దేశంలో ప్రజాస్వామ్యం మనగలుగుతుందన్నారు. వైయ‌స్ జగన్ గారు అంబేడ్కర్ రాజ్యాంగం ప్రకారం పరిపాలన సాగిస్తున్నారని తెలిపారు .

Back to Top