175 సీట్లు గెలుస్తాం

మంత్రి మేరుగ నాగార్జున‌
 

తాడేప‌ల్లి: వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాష్ట్రంలోని 175 సీట్లు గెలుస్తామ‌ని మంత్రి మేరుగ నాగార్జున ధీమా వ్య‌క్తం చేశారు. వైయ‌స్ఆర్‌సీపీ ప్లీన‌రీ చూశాక చంద్రబాబు పరిస్థితి అగమ్య గోచరంగా వుందన్నారు. వర్షం పడినా ప్రజలు లెక్కచేయకుండా ఉవ్వెత్తున ఎగసిన కెరటాల్లా ప్లీనరీకి వచ్చార‌ని తెలిపారు. ఎలాంటి అవరోధాలు వున్నా జనం ఉత్సాహంగా ప్లీనరీకి వచ్చార‌ని చెప్పారు. చంద్రబాబుకు కుప్పం సీటు కూడా చేజారీపోతుందేమో అన్న అనుమానం వచ్చింద‌ని అన్నారు.  సీఎం వైయ‌స్ జగన్ ను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో అన్ని వర్గాలు వున్నాయ‌ని చెప్పారు.

చంద్రబాబు మోసపూరిత మాటలు జనం నమ్మర‌ని పేర్కొన్నారు. మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే పరిస్థితులు వైయ‌స్ జగన్ కు వచ్చాయని చంద్రబాబు భయపడుతున్నార‌న్నారు. వైయ‌స్‌ విజయమ్మ మాటలను కూడా చంద్రబాబు, ఆయన తాబేదారులు వక్రీకరించార‌ని మండిప‌డ్డారు. విజయమ్మ ఈ రాష్ట్రానికి ఉక్కు మనిషిని ఇచ్చింద‌ని గ‌ర్వంగా చెప్పారు. ఎస్సీ, బీసీలను చంద్రబాబు అవహేళన చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. చంద్రబాబును ఈ సారి కుప్పంలో కూడా గెలువనీయమ‌న్నారు. చంద్రబాబుకు ఏ ఒక్క పథకానికీ పేటెంట్ లేద‌ని మంత్రి వ్యాఖ్యానించారు.

తాజా వీడియోలు

Back to Top