28న నెల్లూరులో మంత్రి మేక‌పాటి గౌతంరెడ్డి సంతాప స‌భ‌

నెల్లూరు: దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సంతాప సభ ఈనెల 28న నెల్లూరులో నిర్వ‌హిస్తున్నారు. కనుపర్తిపాడులోని వి.పి.ఆర్. కన్వెన్షన్ హాలులో జరుగుతున్న ఏర్పాట్లు, పరిసర ప్రాంతాలను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనీల్ కుమార్ ,రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తో కలిసి పరిశీలించారు.  సంతాప సభ ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని  సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా  పార్కింగ్, సీటింగ్, భోజన సదుపాయాలు, బందోబస్తు ఏర్పాట్లపై చర్చించారు.  కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర్ బాబు, ఎస్పీ విజయరావు, నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్, ఏఎస్పి వెంకటరత్నం, ఆర్.డి.ఓ. హుస్సేన్ సాహెబ్, తదితర అధికారులు పాల్గొన్నారు.

Back to Top