లక్షల ఉద్యోగాల భర్తీతో సీఎం వైయస్‌ జగన్‌ రికార్డు

వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు

తూర్పు గోదావరి: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల భర్తీతో ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చరిత్ర సృష్టించారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం ప్రారంభమైందనడానికి గ్రామ సచివాలయాల వ్యవస్థే నిదర్శనమన్నారు. పైరవీలకు చోటు లేకుండా నిరుద్యోగులు ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సంపాదించుకున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రతినిధులుగా గ్రామ సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం కావాలని పిలుపునిచ్చారు. పాదయాత్రలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలో భాగంగానే గ్రామ సచివాలయ ఉద్యోగాలు అందించారని, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చి సీఎం వైయస్‌ జగన్‌ జగన్‌ రికార్డు సృష్టించారన్నారు. 
 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top