ఎల్లో వైరస్ కోరలు పీకే మందు మా వద్ద ఉంది

వృద్ధురాలి మృతిపై రాజకీయం తగదు

అందరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని 

కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా  పని చేస్తున్నారు

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

తాడేపల్లి: ఎల్లో వైరస్ కోరలు పీకే మందు తమ దగ్గర ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. కరోనా వైరస్‌కు భయపడి చంద్రబాబు ఇంట్లో దాక్కున్నారని, ఇంతటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వానికి సూచనలు ఇచ్చే విధంగా ప్రతిపక్షం ఉండాలని అన్నారు. మంగళవారం తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 

ప్రజలకు ఇబ్బంది లేకుండా నిత్యావసరాలు సరఫరా చేస్తున్నామని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. అందరికీ రేషన్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రేషన్ డిపోల వద్ద జనం గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్‌ డిపోల వద్ద సామాజిక దూరం పాటించాలని మంత్రి కోరారు. కరోనా నియంత్రణపై వలంటీర్లు సైనికుల్లా పనిచేస్తున్నారని అభినందించారు. వలంటీర్లు ప్రతి ఇంటికివెళ్లి వాళ్ల ఆరోగ్యంపై ఆరా తీస్తున్నారని పేర్కొన్నారు. చోడవరంలో వృద్ధురాలి మృతిపై చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని నాని విమర్శించారు. 

తాజా వీడియోలు

Back to Top