ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడండి

మంత్రి కొడాలి నాని వార్నింగ్‌ 
 

అమరావతి : టీడీపీ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని  పౌర సరఫరాలశాఖ మంత్రి కొడాలి నాని వార్నింగ్‌  ఇచ్చారు. సొంత మామనే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను విమర్శించే అర్హత లేదన్నారు. సొంత వదిన చావుకు కారణమైన దేవినేని ఉమ సీఎం వైయస్‌ జగన్‌ను విమర్శిస్తే సహించేది లేదన్నారు. పోలవరంలో జరిగిన అవినీతిని వెలికి తీసి బాబు దోపిడీని బయటపెడతామన్నారు. 

కాంట్రాక్టర్లతో కుమ్మక్కు
పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రీటెండర్లు పిలిస్తే చంద్రబాబు, దేవినేని ఉమకు ఉలుకెందుకని ప్రశ్నించారు. మాజీ సీఎం చంద్రబాబు, పోలవరం కాంట్రాక్టర్లు ట్రాన్స్‌ట్రాయ్, నవయుగ సంస్థతో కుమ్మక్కై రేట్లు పెంచేసి వాటాలు పంచుకున్నారని ధ్వజమెత్తారు. దేవినేని ఉమను చెంచాగా పెట్టుకుని చంద్రబాబు ఈ ప్రాజెక్టులో అడ్డంగా దోచుకున్నారన్నారు. దోపిడీని అరికట్టేందుకు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రయత్నం చేస్తుంటే దేవినేని ఉమ, టీడీపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

 
 

Back to Top