ఇకనైనా విష ప్రచారం ఆపండి. అసత్యాలు రాయకండి

రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి  కొడాలి వెంకటేశ్వరరావు  

తక్కువ ధరకే బియ్యం ఎగుమతి చేయడం లేదు 

రైతులకు ఎక్కడా నష్టం, అన్యాయం జరగడం లేదు

ప్రతి రైతుకూ పూర్తి మద్దతు ధర లభిస్తోంది

ఈ క్రాపింగ్‌ ద్వారా పక్కాగా పంటల నమోదు 

ఆర్బీకేల ద్వారా ధాన్యం సేకరణ జరుగుతోంది

21 రోజుల్లోనే రైతులకు బిల్లులు చెల్లిస్తున్నాం

తాడేపల్లి:  పంట నష్టం జరిగితే రెండు నెలల లోపే ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇప్పటి వరకు దేశంలో ఎవ్వరూ ఇవ్వలేద‌ని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. కానీ ఇలాంటి దుర్మార్గులు సీఎం పదవి తమ వారికి రావాలని, వైయ‌స్ జగన్‌గారి ప్రతిష్టను దిగజార్చాలని చూస్తున్నారు. కాబట్టి వీరికి 2024 ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెప్పాల‌ని పిలుపునిచ్చారు.  వారిని గోతి తీసి పాతాలి. అలాగే ఇకనైనా ఇలాంటి వార్తలు రాయడం మానాలని రామోజీరావును కోరారు. గురువారం తాడేప‌ల్లిలోని వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాల‌యంలో మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు.

ఈనాడు పత్రిక ఇవాళ తొలి పేజీలో బ్యానర్‌ వార్త. చౌకగా బియ్యం. రూ.25కే కిలో బియ్యం విదేశాలకు అని రాశారు. ఇవాళ విపక్షనేతగా ఉన్న చంద్రబాబుకు, ఆయన కోసం పని చేస్తున్న కొన్ని తోక పార్టీలు, ఎలాగైనా చంద్రబాబును సీఎం చేయాలని పరితపించే రామోజీరావు, ఏబీఎన్‌ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్‌ నాయుడుకు నిద్ర లేని రాత్రులు. అందుకే పనికిమాలిన గాలి వార్తలు రాసి ఎలాగైనా జగన్‌గారిని అధికారంలో నుంచి దింపాలి. చంద్రబాబును అధికారంలో కూర్చోబెట్టి, రాష్ట్రాన్ని దోచుకుతినాలన్నది వారి తాపత్రయం. 
    నిజానికి ఈనాడులో ఇవాళ్టి వార్త చూస్తే ఆశ్చర్యం కలుగుతోంది. విదేశాలకు కాకినాడ పోర్టు నుంచి కిలో రూ.25కే సన్న బియ్యం ఎగుమతి అవుతోందని, ఆ బియ్యం ధర కనీసం రూ.40 ఉందని, రైతుల శ్రమ దోచుకుంటున్న పౌర సరఫరాల సంస్థ అని, అలా కాకపోతే, రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా బియ్యం తక్కువ ధరకు సేకరించి అమ్ముకుంటున్నారని ఏదేదో రాశారు.

కానీ ఇదీ వాస్తవం:
    చంద్రబాబును ఎలాగైనా సీఎంను చేయాలి. జగన్‌గారిని భ్రష్గు పట్టించాలని రాసి, రాసి మొహమెత్తించారు. నిజానికి కాకినాడ నుంచే కాకుండా చెన్నై పోర్టు నుంచి కూడా బియ్యం ఎగుమతి అవుతుంది. అంతే కాకుండా బిహార్, ఒడిషా, మధ్యప్రదేశ్‌ నుంచి కూడా ఇక్కడికి బియ్యం వస్తుంది. ఇది ఎన్నో ఏళ్ల నుంచి కొనసాగుతోంది. ధాన్యాన్ని ఎగుమతి చేయడంలో కాకినాడ పోర్టు అగ్రస్థానంలో ఉంది.

అంతా ఆర్బీకేల ద్వారా..:
    రాష్ట్రంలో ఇవాళ పంటల సాగు చాలా స్పష్టంగా ఈ–క్రాపింగ్‌లో నమోదు అవుతుంది. దాని వల్ల ఎక్కడ, ఏ పంట వేశారన్నది తెలుస్తుంది. 
ఇంకా ఆర్బీకేల వద్దే ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. రైతులు అక్కడికి ధాన్యం తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. వారు తమ ధాన్యం గురించి సమాచారం ఇస్తే, పౌర సరఫరాల శాఖ స్వయంగా కల్లాల వద్దకే వెళ్లి, ధాన్యం తీసుకుని, బిల్లులు చెల్లిస్తోంది. నిజానికి గతంలో రైతులు ధాన్యాన్ని మిల్లర్ల దగ్గర విక్రయిస్తే, వారికి రకరకాల కారణాలు చెప్పి, తక్కువ ఇస్తున్నారని చెప్పి, సీఎంగారు మొత్తం విధానాన్ని మార్చారు.
రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకున్నారు.

సార్టెక్స్‌ బియ్యం పంపిణీ:
    అలాగే బియ్యం నాణ్యత పెంచడం కోసం సార్టెక్స్‌ చేయడంతో పాటు, ప్రభుత్వం నూక శాతం తగ్గిస్తోంది. అందుకోసం రూ.700 కోట్లు ఖర్చు చేసి, పూర్తిగా నాణ్యతతో కూడిన బియ్యాన్ని రేషన్‌ షాపుల ద్వారా సరఫరా చేస్తోంది. అంతే కాకుండా అవి కల్తీ కాకుండా ఇంటి వద్దే సీల్‌ తీసి బియ్యం ఇస్తున్నారు.

వయసు రాగానే సరికాదు:
    ఇన్ని మంచి పనులు చేస్తున్న సీఎంగారి మీద అభాండాలు వేస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసే విధంగా వ్యవహరిస్తున్నారు.
వయసు రాగానే కాదు. కనీసం బుద్ధి రావాలి. 70 ఏళ్లు దాటినా బుధ్ధి రాలేదు. 50 ఏళ్లు దాటని జగన్‌గారిపై రోజూ దాడి చేస్తున్నారు. కానీ పైన దేవుడున్నాడు. అన్నీ చూస్తున్నాడు. అందుకే మీ వంటి వారికి ప్రజలు తగిన బుద్ధి చెబుతున్నారు. అయినా వాస్తవాన్ని గుర్తించడం లేదు. పనికి మాలిన వార్తలు రాసి ప్రజలను నమ్మించాలని చూస్తున్నారు. కానీ ప్రజలు ఏ మాత్రం నమ్మబోరు.

21 రోజుల్లోనే పైకం:
    ఈ ఖరీఫ్‌ (2021–22) సీజన్‌లో వచ్చే నెల వరకు దాదాపు 45 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా. ఇప్పటికే 34.28 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సేకరించగా, 5,02,132 మంది రైతులకు  రూ.6,667 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉండగా, ఇవాళ్టికి రూ.3,946 కోట్లు ఇవ్వడం జరిగింది. 21 రోజులు కూడా పూర్తి కాకముందే రైతులకు ధాన్యం బిల్లుల ఇస్తున్నాం. ఇంకా దాదాపు రూ.1600 కోట్లు బకాయిలు ఉండగా, రోజూ దాదాపు రూ.150 కోట్ల వరకు రైతులకు డబ్బులు ఇస్తున్నాం. 

చంద్రబాబు ఎగ్గొట్టినా..:
    గతంలో చంద్రబాబు పసుపు కుంకుమ కింద ఈ డబ్బులు వాడుకుని, దాదాపు రూ.1000 కోట్లు బాకీ పెట్టి పోయాడు. మరోవైపు దాదాపు రూ.2 వేల కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇంకా, విత్తనశుద్జి« కర్మాగారాలకు మరో రూ.700 కోట్లు బకాయి పెట్టి పోతే, ఈ సీఎంగారు అన్నీ చెల్లించారు. అంతే కాకుండా గత డిసెంబరులో పంట నష్టం జరిగితే, రెండు నెలల లోపే రూ.540 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీగా ఇచ్చారు.

     
చంద్రబాబు డైవర్షన్‌ పాలిటిక్స్‌:
    ఇవాళ విజయవాడలో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ పర్యటన ఉంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో చాలా ప్రాజెక్టులు సాధించుకున్నాం. రూ.10,600 కోట్లకు పైగా వ్యయంతో పూర్తి చేసిన రోడ్ల ప్రాజెక్టులు ఇవాళ కేంద్ర మంత్రి గడ్కరీగారు ప్రారంభించారు. అలాగే రూ.11 వేల కోట్లకు పైబడిన రోడ్డు ప్రాజెక్టు పనులు మొదలు పెట్టారు. విజయవాడలో మరో బైపాస్‌ రోడ్డుతో పాటు, అన్ని జిల్లాలలో చాలా రోడ్లకు సంబంధించి సీఎంగారు ప్రతిపాదిస్తే, కేంద్ర మంత్రిగారు సానుకూలంగా స్పందించారు. దాదాపు రూ.7 వేల కోట్ల పనులు కోరినా కేంద్ర మంత్రి అంగీకరించారు.
    ఆ స్థాయిలో మంచి పనులు జరుగుతుంటే, సీఎంగారు ఇంకా బలపడతారని అనుకున్న చంద్రబాబు, ఓడిపోయిన సర్పంచ్‌లతో అవగాహన సదస్సు పెట్టి, విమర్శలు చేశారు. వారికి ఆయన ఏం అవగాహన కల్పించాడంటే.. క్యాసినో గురించి, డీజీపీ గురించి, ఆయన బదిలీ గురించి, పోస్టింగ్‌ గురించి మాట్లాడాడు. చంద్రబాబు తాను అధికారంలో ఉన్నప్పుడు 14 ఏళ్లలో ఎంత మంది సీఎస్‌లను, డీజీపీలను మార్చాడు? ఒక్కరినే కొనసాగించలేదు కదా?

కోడిగుడ్డుకు ఈకలు:
    ప్రభుత్వం అన్నప్పుడు బదిలీలు సహజం. అయినా కోడిగుడ్డుకు ఈకలు పీకుతున్నాడు. అన్నీ డైవర్షన్‌ పాలిటిక్స్‌. గడ్కరీ వస్తున్నాడు. ఎన్నో మంచి పనులు మొదలయ్యాయి. అవి ప్రజల్లోకి పోకుండా, సర్పంచ్‌ల సమావేశం. తన కుల మీడియాలో ప్రచారం. పనికిమాలిన ప్రసారాలు. కానీ ప్రజలకు అన్నీ తెలుసు. జగన్‌గారిని ఎంత భ్రష్టు పట్టించాలని చూసినా, ఏమీ చేయలేరు. నిజానికి మీరు పార్టీని, పత్రికలను అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. అందుకే మీరు ఎన్ని చెప్పినా 2024లోనూ ప్రజలు నమ్మబోరు. మీకు మళ్లీ ఓటమి తప్పదు.

చంపితే ఏం వస్తుంది?:
    ఛార్జ్‌షీట్‌లో చాలా విషయాలు ఉంటాయి. కానీ అన్నీ బయటకు రావడం లేదు. ఎవరికి నచ్చిన అంశం వారు బయటకు తీసుకువస్తున్నారు. గతంలో జగన్‌గారిపై కేసు నడిచినప్పుడు కూడా చూశాం. సీబీఐ జేడీ తమకు కావాల్సిన వారికి లీక్‌లు ఇచ్చేవాడు.
ఎవరినైనా చంపితే వారి పదవులు, డబ్బులు వస్తాయా? నిజానికి నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి దింపి, ఆయన మరణానికి చంద్రబాబు కారణమయ్యాడు.
    కానీ ఇక్కడ అది కాదు కదా. ఆయనను (వివేకానందరెడ్డి) హత్య చేస్తే, జగన్‌ గారికి ఏమొస్తుంది? ఆయనకు ఏమైనా పదవి వస్తుందా? ఆస్తి వస్తుందా? నిజానికి వారి కుటుంబం దేవుడిని నమ్ముకున్న కుటుంబం. ప్రజలను నమ్ముకున్న కుటుంబం.

మేం మాట్లాడితే తట్టుకోగలరా?:
    ఇందాక ఆ పార్టీ నాయకురాలు జగన్‌గారి కుటుంబ సభ్యులు ఆడవారిపై మాట్లాడారు. మరి మేము కూడా అలా మాట్లాడితే మీరు తట్టుకోగలరా? ఏమాత్రమైనా సిగ్గు శరం ఉండాలి. పదవులు శాశ్వతం కాదు. చరిత్ర శాశ్వతం. ఎన్టీఆర్‌ చరిత్రలో నిల్చిపోయారు. వైయస్సార్‌ చనిపోతే ప్రజలు ఇప్పటికీ గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన కుమారుడిని సీఎం చేశారు. జగన్‌గారు నిరంతరం ప్రజల బాగు కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం తపించే మంచి మనసున్న వ్యక్తి.

ఆత్మస్థైర్యం దెబ్బ తీయలేరు:
    కానీ మీరు.. మీ పేపర్లు, ఛానళ్లను మాత్రమే నమ్ముకున్నారు. చివరకు కొడుకును ఎమ్మెల్యేగా కూడా గెలిపించుకోలేకపోయాడు. కుప్పంలో కనీసం సర్పంచ్‌ను కూడా గెలిపించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇవాళ సర్పంచ్‌లకు అవగాహన కల్పించడం ఏమిటి? పోనీ అక్కడైనీ పనికి వచ్చే విషయాలు చెప్పాడా? అంటే అదీ లేదు.
    అందుకే చంద్రబాబుకు డబ్బా కొట్టే పేపర్లు కానీ, ఛానళ్లు కానీ ఇంకా ఎంత మొరిగినా, ఏడ్చినా జగన్‌గారి ఆత్మస్థైర్యం ఏ మాత్రం దెబ్బ తీయలేరు.

ప్రజలకు అన్నీ తెలుసు:
    జగన్‌గారి క్యారెక్టర్‌ ప్రజలకు స్పష్టంగా తెలుసు కాబట్టే, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయాన్ని కట్టబెట్డడంతో పాటు, ఆ తర్వాత జరిగిన అన్ని ఉప ఎన్నికలతో పాటు, స్థానిక ఎన్నికల్లో కూడా పూర్తిగా గెలిపించారు. 
అందుకే ఆయన క్యారెక్టర్‌ గురించి, ఏ మాత్రం క్యారెక్టర్‌ లేని ఫోర్‌ ట్వంటీగాళ్లు చెబితే నమ్మే స్థితిలో ప్రజలు లేరు.. అని మంత్రి శ్రీ కొడాలి నాని స్పష్టం చేశారు.

తాజా వీడియోలు

Back to Top