చంద్రబాబు, లోకేష్ ఏపీకి పట్టిన భయంకర వైరస్‌లు  

మంత్రి కొడాలి నాని

విజయవాడ హాస్పిటల్స్‌ లో ఆక్సిజన్ కొర‌త లేదు

విజ‌య‌వాడ‌: చంద్రబాబు, లోకేష్ ఇద్దరూ ఏపీకి పట్టిన కరోనా కంటే భయంకర వైరస్ లు అని మంత్రి కొడాలి నాని చురకలు అంటించారు.  వార్డు మెంబరుగా కూడా గెలవని లోకేష్ ట్వీట్లకు ఏం సమాధానం చెబుతామని మంత్రి కొడాలి నాని సెటైర్ వేశారు.  ఆక్సిజన్, వ్యాక్సిన్, రెమిడెసివర్ అంశాలను కేంద్రం పర్యవేక్షిస్తోందని..వైజాగ్ లో 170 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంటే 100 మెట్రిక్ టన్నులు మనకు ఇచ్చి మిగిలింది మహారాష్ట్ర కు ఇవ్వమన్నారని తెలిపారు. ఏపీని..ఒరిస్సా నుంచి తెచ్చుకోమంటున్నారని.. ఇదే దేశం అంతా ఉన్న సమస్య అని పేర్కొన్నారు.  సోషల్ మీడియా, కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని.. విజయవాడ హాస్పిటల్ లో ఆక్సిజన్ లేదు అన్న బుద్ధిలేని వాడు ఎవరు? అని ఫైర్ అయ్యారు.  విజయవాడ హాస్పిటల్ లో ఆక్సిజన్ కొరత లేదని.. తప్పుడు వార్తలు చూస్తే ప్రజలు భయాందోళనకు గురవ్వరా?అని తెలిపారు. 

తాజా వీడియోలు

తాజా ఫోటోలు

Back to Top