వైయస్‌ఆర్‌ దెబ్బేంటో.. నీ అబ్బనడుగు

లోకేష్‌పై పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ధ్వ‌జం

స్టేలు తెచ్చుకోవడంలో చంద్రబాబుది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డు

చంద్రబాబు బ్రోకర్‌ అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు

వర్థంతికి.. జయంతికి తేడా తెలియని చవట పప్పు 

రామలింగరాజు డబ్బుతో స్టాన్‌ఫర్డ్‌లో చదివిన బేవర్స్‌ లోకేష్‌

ఈ దద్దమ్మకు ఏ విధంగా సర్టిఫికెట్‌ ఇచ్చారని స్టాన్‌ఫర్డ్‌కు లేఖ రాస్తా..?

స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుడి ఆత్మహత్యను కూడా రాజకీయం చేస్తున్నారు

మీ తండ్రీకొడుకులకు దమ్మూ, ధైర్యం ఉంటే మోడీని ప్రశ్నించాలి

ప్రజలను నమ్ముకొని పార్టీపెట్టిన దమ్మున్న నాయకుడు సీఎం వైయస్‌ జగన్‌

వైయస్‌ జగన్‌ దెబ్బకు అబ్బాకొడుకులకు ఇంట్లోనే జైలు జీవితం

తాడేపల్లి: కేసులను ఎదుర్కోలేక అతి ఎక్కువ స్టేలు తెచ్చుకున్న నాయకుడిగా చంద్రబాబు గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో ఎక్కాడని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. చేసిన దొంగపనులకు సమాధానం చెప్పలేని చవట, దద్దమ్మ ఎవరైనా ఉన్నారంటే.. అతనే స్టే బాబు.. చంద్రబాబు అని దుయ్యబట్టారు. అమరావతి అసైన్డ్‌ భూముల కేసులో సీఐడీ ఇచ్చిన నోటీసులపై నిన్న 31వ స్టే తెచ్చుకున్నాడన్నారు. ఉచ్చం, నీచం లేని చంద్రబాబు.. కోర్టులో స్టేలు తెచ్చుకోవడానికి డబ్బు, ఇంకెవరినైనా పంపించి మేనేజ్‌ చేయగల బ్రోకర్‌ వెధవ చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు చేసిన తప్పులు ప్రభుత్వం దృష్టికి వచ్చిన వాటిపై తప్పకుండా కేసులు పెడతామని, న్యాయస్థానంలో శిక్షలు పడకపోతే.. ప్రజాక్షేత్రంలో ప్రజల చేత శిక్ష విధిస్తామన్నారు. 

తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొడాలి నాని విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు పుత్రరత్నం పప్పు ట్విట్టర్‌లో ఇష్టారీతిగా వాగుతున్నాడని, మహానేత వైయస్‌ఆర్, సీఎం వైయస్‌ జగన్‌ దెబ్బ ఏంటో నీ అబ్బ చంద్రబాబును లేపి అడుగు పప్పూ అని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలతో మూతిమీద కొడితే.. పప్పుతిని వారం పడుకున్న దున్నపోతు ట్విట్టర్‌లో పోస్టు పెడుతున్నాడు. తలకాయలో బు్రరలేని, వర్థంతికి.. జయంతికి తేడా తెలియని చవట వ్యక్తి లోకేష్‌ అని మంత్రి కొడాలి దుయ్యబట్టారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే..

‘వైయస్‌ఆర్‌ దెబ్బ అంటే ఏంటో.. 2004 ఎన్నికల్లో చంద్రబాబుకు రుచిచూపించాడు. 2009లో మహాకూటమి అని పందుల్లా గుంపులుగా వస్తే.. వైయస్‌ఆర్‌ సింహలా సింగిల్‌గా వచ్చి దెబ్బ చూపించాడు. రెండుసార్లు వైయస్‌ఆర్‌ దెబ్బ ఎలా ఉంటుందో.. ఆ దెబ్బతో చంద్రబాబు ఎంత దిక్కుమాలిన పరిస్థితికి వెళ్లారో రాష్ట్ర ప్రజలు, మీడియా, రాజకీయ పార్టీలు చేశాయి. అప్పుడు ఈ చవట లోకేష్‌ పప్పు తిని నిద్రిపోయినట్టున్నాడు. 

వైయస్‌ఆర్‌ దెబ్బ తెలియాలంటే.. నీ అబ్బను లేపిఅడుగు. నీ అబ్బ చంద్రబాబు  కథలుకథలుగా చెబుతాడు. సీఎం వైయస్‌ జగన్‌ 2019 ఎన్నికల్లో నీ తండ్రిని 23 సీట్లకు పరిమితం చేసి.. 50 శాతం ఓటు బ్యాంక్‌తో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. నీ తండ్రిని నాలుగు గోడల్లో బంధించిన వ్యక్తి సీఎం వైయస్‌ జగన్‌. పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికల్లో నీ అబ్బ నారా చంద్రబాబు నాలుగు గోడలకు పరిమితమై దయనీయమైన కుక్క బతుకు బతుకుతున్నాడు. 

వైయస్‌ఆర్‌ దెబ్బ, వైయస్‌ జగన్‌ దెబ్బ చూడాలంటే మీ బాబూకొడుకులు ఇంకొంతకాలం ఉండాలి. తండ్రీకొడుకులు ఇద్దరూ ఇంట్లో కూర్చోవడం, ఆరు నెలలకు, మూడు నెలలకు ఓ ఖైదీ బెయిల్‌ మీద వచ్చినట్లుగా ఒక ప్రోగ్రాంకి వచ్చి  మళ్లీ ఇంటికెళ్లి పడుకోవడం.. మీ బతుకులు జైలు జీవితం కాదా..?  

నువ్వు కోర్టుల్లో ఏరకంగా స్టేలు తెచ్చుకోగలవు, ఏరకంగా లాయర్లను పెట్టి వాదించగలవు.. ఎటువంటి బ్రోకర్‌ పనులు చేయగలవు అనేదానికి ఒకటే ఒక్క ఉదాహరణ.. ఎన్టీఆర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసి.. ఈ పార్టీ నాదే.. ఎన్టీఆర్‌ది కాదు, ఎన్టీఆర్‌ ట్రస్టు ఆస్తులన్నీ నావే.. అని ఆ రోజుల్లో చంద్రబాబు స్టే తెచ్చుకున్నాడు. చంద్రబాబు బ్రోకర్‌ అని ఎన్టీఆరే స్వయంగా చెప్పారు. సైకిల్‌ గుర్తు కోసం ఎలాంటి బ్రోకర్‌ పనులు చేశాడో ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. 

ప్రజా కోర్టులో 30 శాతం ఓటింగ్‌కు వచ్చాం.. రేపు జరగబోయే జిల్లా పరిషత్‌ ఎన్నికల్లో 20 శాతానికి పరిమితం చేసే పరిస్థితి. తిరుపతిలో జరిగే ఉప ఎన్నికలో 4 లక్షల మెజార్టీతో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీని గెలిపిస్తారు.

స్టాన్‌ఫర్డ్‌లో రామలింగరాజు డబ్బుతో చదివిన బేవర్స్‌ లోకేష్‌. నీ తండ్రి అకౌంట్‌ నుంచి డబ్బులు వచ్చాయా..? ఆ అకౌంట్‌ డీటైల్స్‌ బయటపెట్టు.. రామలింగరాజు నీకు ఏమవుతాడు..? ఏ సంబంధంతో నీకు డబ్బు పంపించాడు..? లోకేష్‌ స్టాన్‌ఫర్డ్‌లో చదివాను అని చెప్పుకుంటున్నాడు. ఈ దద్దమ్మకు ఏ విధంగా సర్టిఫికేట్‌ ఇచ్చారని స్టాన్‌ఫర్డ్‌కు లేఖ రాస్తా..? బు్రరలేని వారికి స్టాన్‌ఫర్డ్‌ సర్టిఫికెట్‌ ఇస్తుందా..? లోకేష్‌ దొంగ సర్టిఫికెట్లు తెచ్చుకున్నాడు. మంగళగిరిలో ఓడిపోయిన వ్యక్తికి ముఖ్యమంత్రి గురించి మాట్లాడే స్థాయి ఉందా..? నువ్వెంత.. నీ బతుకెంత లోకేష్‌.. 

స్టీల్‌ ప్లాంట్‌ కార్మికుడు ప్లాంట్‌ పరిరక్షణకు ఆత్మహత్య చేసుకుంటే.. ఆ చావును కూడా రాజకీయంగా వాడుకోవాలని పప్పు ట్విట్టర్‌లో ప్రభుత్వంపై నిందలు వేస్తున్నాడు. ప్రజలను నమ్ముకొని పార్టీ పెట్టిన వ్యక్తి, ప్రజలను నమ్ముకొని ఎన్నికలకు వెళ్లే వ్యక్తి.. సీఎం వైయస్‌ జగన్‌.. ప్రజల మద్దతుతో ఇన్ని ఘన విజయాలు సాధించడానికి సీఎం వైయస్‌ జగన్‌ వ్యక్తిత్వం, మంచితనమే కారణం. 

మీ తండ్రీకొడుకులకు దమ్మూ, ధైర్యం ఉంటే మోడీని ప్రశ్నించాలి. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేని విషయాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు. ఇలాంటి రాబంధులు ఈ ప్రాంతంలో పుట్టడం మన దురదృష్టం. గతంలో ధర్మపోరాట దీక్ష అని నల్లచొక్కాలు వేసుకొని డ్రామాలు వేశారు కదా.. ఇప్పుడు బట్టలు లేకుండా దీక్షలు చేయండి. 

స్టీల్‌ ప్లాంట్‌ పరిరక్షణ కోసం ఎలాంటి కార్యక్రమాలు చేయాలని, పార్లమెంట్‌లో ఎంపీలతో ఏం అడిగించాలి. బయట ఎలాంటి కార్యక్రమాలు చేయాలని వైయస్‌ఆర్‌ సీపీ చూసుకుంటుంది. చనిపోయిన కార్మికుడికి సానుభూతి తెలుపుతూ.. ఏ ఆశయంతో చనిపోయాడో.. ఆ ఆశయం నిలబెట్టడానికి అండగా ఉంటామని కార్మికులకు తెలియజేస్తున్నాను. చంద్రబాబు లాంటి గుంటనక్క ట్రాప్‌లో పడొద్దు.. దున్నపోతును, గుంటనక్కను ఉద్యమంలో పాల్గొనకుండా తరిమికొట్టాలి’ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు.
 

Back to Top