తాడేపల్లి: నీచమైన పనుల్లో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని మంత్రి కొడాలి నాని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ వర్ధంతి, జయంతి, టీడీపీ మహానాడు సభల రోజు మాత్రమే ఆయనకు భారత రత్న గుర్తుకు వస్తుందని విమర్శించారు. 14 ఏళ్లు సీఎంగా పని చేశానని చెప్పుకునే చంద్రబాబు, ఢిల్లీలో చక్రం తిప్పానని గొప్పలు చెప్పే వ్యక్తి ఎన్టీఆర్‌కు ఎందుకు భారత రత్న ఇప్పించలేకపోయారని నిలదీశారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రి పదవీ నుంచి దింపి, టీడీపీని లాక్కుని, ఆయనకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు ఉచ్చరించే నైతిక హక్కు కూడా లేదన్నారు. మతాలు, కులాల మధ్య చిచ్చుపెట్టే నీచమైన స్థాయికి బాబు వచ్చాడని ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్రంలో ఎప్పటికీ అధికారంలోకి రాదని పేర్కొన్నారు. తాడేపల్లిలోని వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కొడాలి నాని మాట్లాడారు. ఎన్టీఆర్ మరణానికి చంద్రబాబే కారణం స్వర్గీయ ఎన్టీ రామారావు మరణానికి దుర్మార్గుడైన చంద్రబాబే కారణమని మంత్రి కొడాలి నాని విమర్శించారు. ఎన్టీరామారావు చిరస్మరణీయుడు అని ఇవాళ కొందరు మంచిగా మాట్లాడుతున్నారు.. గొప్ప వ్యక్తి అని గొప్పగా చెప్పుకునే వెన్నుపోటు దారుడు, కుట్రదారుడు, రాజకీయ పదవుల కోసం అత్యంత దారుణంగా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవడమే కాకుండా ఆయన పెట్టిన పార్టీ లాక్కున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పదవిని దొంగతనంగా తస్కరించిన నీచుడు చంద్రబాబు అని మండిపడ్డారు. సీఎం పదవి కోసం పిల్లనిచ్చి మామనే వెన్నుపోటు పొడిచిన వ్యక్తి చంద్రబాబు. ఎన్టీఆర్ చావుకు కారణం ఎవరో ప్రజలకు తెలుసు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని ఆ పదవి నుంచిదింపి ఆయన చావుకు కారణమైన వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ అభిమానులు అంతా కలిసి చంద్రబాబు నాయుడి ని రాష్ట్ర సరిహద్దులు దాటించేలా తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌కు భారత రత్న..బాబుకు ప్రపంచ రత్న ఎన్టీఆర్‌కు భారత రత్న అవార్డు..చంద్రబాబుకు ప్రపంచ రత్న అవార్డు ఇవ్వాలని మంత్రి కొడాలి నాని కోరారు. ఎన్టీఆర్ జయంతి, వర్ధంతి రోజు, టీడీపీ మహానాడు సభలో మాత్రమే చంద్రబాబుకు భారతరత్న గుర్తుకు వస్తుందన్నారు. ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పే చంద్రబాబు నాయుడు 14 ఏళ్లు సీఎంగా అధికారంలో ఉన్నప్పుడు ఎన్టీఆర్‌కు భారతరత్న ఎందుకు ఇప్పించలేదన్నారు. బిజెపితో కలిసి నాలుగేళ్లు అధికారాన్ని పంచుకున్న వ్యక్తికి ఎన్టీఆర్ గుర్తుకు రాలేదా అని నిలదీశారు. ఎన్టీఆర్ చిత్ర సీమలో నటుడు అయితే.. చంద్రబాబు నాయుడు నిజజీవితంలో నటుడు అని అభివర్ణించారు. పదవి కోసం అడ్డమైన వాగ్దానాలు చేస్థాడని, చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకు మోసం చేస్తాడని విమర్శించారు. నీచమైన పనులు చేసే చంద్రబాబుకు ప్రపంచ రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వెన్నుపోటు బిరుదు ఇవ్వాలని కోరారు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో ఎందుకు కలిశారు.. రాజీవ్ గాంధీ మద్రాసులో చనిపోయినప్పుడు ఎన్టీఆర్ ఆస్తులపై కాంగ్రెస్ పార్టీ దాడులు చేయించిందని చంద్రబాబు అంటున్నారని, అలాంటప్పుడు కాంగ్రెస్ పార్టీతో కలిసి తెలంగాణలో ఎందుకు పోటీ చేశారని మంత్రి కొడాలి ప్రశ్నించారు. ఆ రోజు ఎన్టీఆర్ కాంగ్రెస్‌పై బొబ్బిలి పులిలా పోరాటం చేశారని, తాను కూడా బొబ్బిలి పులిలా పోరాటం చేస్తున్నానని ఆయనతో చంద్రబాబు పోల్చుకోవడం హాస్యాస్పదమన్నారు. ఎన్టీఆర్‌కు, చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. ఎన్టీఆర్ బెబ్బిలి పులి అయితే..చంద్రబాబు పిల్లి అని అభివర్ణించారు. చంద్రబాబుకు అవకాశముంటే ప్రధాని మోదీకి బుద్ధి చెప్పాలని అంటారని, అవకాశం లేకపోతే మోడీ కాళ్లు పట్టుకుంటారని విమర్శించారు. అందితే జుట్టు.. లేకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబునాయుడు అని ఫైర్ అయ్యారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే.. చంద్రబాబు నాయుడు, లోకేష్ తెలంగాణలో సర్వ నాశనం చేశారని పేర్కొన్నారు. ఎన్టీఆర్ టీడీపీ వ్యవస్థాపకుడైతే..చంద్రబాబు, లోకేష్ భూస్థాపకులని ఎద్దేవా చేశారు, అఖిల ప్రియ ఆంధ్రలో అరెస్టు అయి ఉంటే.. మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ కిడ్నాప్ కేసులో తెలంగాణ రాష్ట్రంలో అరెస్టు అయితే టీడీపీ నేతలు ఎందుకు నోరు మెదపడం లేదని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. అఖిల ప్రియ కనుక ఆంధ్ర రాష్ట్రంలో అరెస్టు అయి ఉంటే చంద్రబాబు నట విశ్వరూపం చూడలేక ప్రజలు భయభ్రాంతులకు గురయ్యేవారని అన్నారు. అఖిల ప్రియ అరెస్టు తప్పని, ఒప్పని మాట్లాడే నాయకుడు లేదన్నాడు. గతంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి పరారు అయ్యారని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు అన్నారు. ఆడపిల్ల అరెస్టు అయితే మాట్లాడలేని నీచాతి నీచమైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ అన్నారు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి, గొప్పతనం గురించి అందరికీ తెలుసన్నారు. ఎన్టీఆర్ ను మేము అందరం గౌరవిస్తాము అన్నారు. ఎన్టీఆర్ పేరు కూడా ఉచ్చరించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. ఎన్టీఆర్ దీవెనలు సీఎం వైయస్ జగన్‌కు, మాలాంటి వాళ్లకు మాత్రమే ఉంటాయి అన్నారు. ఆ దేవుడి ఆశీస్సులు, వైయస్సార్, ఎన్టీఆర్ ఆశీస్సులు వైయస్ జగన్‌కు తప్పక ఉంటాయన్నారు. విగ్రహాలు కూల్చి..మొసలి కన్నీరు కార్చుతున్నారు రాష్ట్రంలోని దేవాలయాలు, దేవుడి విగ్రహాలను కూల్చిన వ్యక్తులు మొసలి కన్నీరు కార్చుతున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాష్ట్రంలో దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయని, ఎక్కడో ఊరికి దూరంగా ఉన్న ఆలయాలను టార్గెట్ చేస్తూ విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు. తెల్లవారక ముందే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. హిందూ గుడులపై దాడులు చేయిస్తూ మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం వైయస్ జగన్, హోం మంత్రి, డీజీపీ క్రిస్టియన్లు అంటూ ప్రచారం చేయడం బాధాకరమన్నారు. సీఎం వైయస్ జగన్ ఓ మానవతావాది అన్నారు. రాష్ట్రంలో జరిగిన ఆలయాల దాడుల్లో 9 కేసుల్లో టీడీపీ, బీజేపీ నేతల ప్రమేయం ఉందని డీజీపీ విచారణలో తేలిందన్నారు. తమ బాంఢారం బయటపడటంతో చంద్రబాబు, ఆయన వద్ద ఉన్న నలుగురు వేస్ట్ గాళ్ళు ప్రెస్‌మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నామని, రేపు రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని పోలీసులను, డీజీపీని బెదిరిస్తున్నారన్నారు. గౌతమ్ సవాంగ్ గతంలో విజయవాడ సి పి గా పని చేశారన్నారు. ఆ రోజు ఆలయాలు కూల్చే సమయంలో టిడిపి నేతల ప్రమేయం ఉందని చెబితే..ఆయన్ను అప్పట్లో సెలవుల్లో వెళ్లేలా ఒత్తిడి చేశారని గుర్తు చేశారు. డీజీపీ గౌతం సవాంగ్ సిన్సియర్ ఆఫీసర్ అన్నారు. గౌతమ్ సవాంగ్ పార్టీలకు, కులమతాలకు అతీతంగా పని చేస్తున్నారని, అందరికీ న్యాయం చేస్తున్నారన్నారు. అలాంటి సిన్సియర్ ఆఫీసర్‌పై టీడీపీ నాయకులు, కాల్‌మనీ నిందితులు మాటల దాడికి దిగడం దుర్మార్గమన్నారు. రాష్ట్రంలో నూటికి ఎనభై శాతం ప్రజలు వైయస్ జగన్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. రాజకీయ బతకాలంటే కనీసం బిజెపి కంటే ఒక అడుగు ముందే ఉండాలి అంటే చంద్రబాబు ముందున్న ఏకైక మార్గం గుళ్లను ధ్వంసం చేయడమేనని అన్నారు. దేవుని విగ్రహాలను పడగొట్టి ముసలి కన్నీరు కారుస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలోని పోలీసులకు, డీజీపీకి ఈ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. టిడిపి నాయకులకు భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. రాష్ట్రంలోని పోలీసులు నిష్పక్షపాతంగా, కులమతాలకు అతీతంగా పని చేస్తున్నారని కొనియాడారు. తప్పు చేస్తే ఎంతటి వారినైనా వదలాల్సిన అవసరం లేదని పోలీసులకు సూచించారు. చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి ప్రతిపక్ష నేత చంద్రబాబు పక్కా రాజకీయ వ్యభిచారి అని మంత్రి కొడాలి నాని విమర్శించారు. గుడి, చర్చిలు, మసీదుల పై దాడి చేసే వారు ఎంతటి వారైనా సరే వదిలే ప్రసక్తే లేదన్నారు. సీఎం వైయస్ జగన్ మానవతావాది అని స్పష్టం చేశారు. గుడికి వెళ్తే పక్క హిందువులా పూజలు చేస్తారని, చర్చిలో క్రైస్తవుడిలా ప్రార్థిస్తారని, మసీదులో స్వచ్ఛమైన ముస్లిం లాగా ప్రార్థిస్తారని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంప్రదాయాలను, విశ్వాసాలను వైయస్ జగన్ గౌరవిస్తారని తెలిపారు. దేవున్ని అడ్డుపెట్టుకొని నాలుగు ఓట్లు సంపాదించాలనే నీచమైన, నికృష్టమైన ఆలోచన చంద్రబాబుదే అన్నారు. బీజేపీ ఆటలు సాగవు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ ఆటలు సాగవని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు. బిజెపి మత రాజకీయాలు చే్స్తుందని, మతోన్మాదాన్ని భుజాన వేసుకుందన్నారు. యూపీలో బీజేపీ రథయాత్ర చేస్తే..25 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిందని, ఏపీలో సోము వీర్రాజు ఇప్పుడు రథయాత్ర చేస్తే..మరో 25 ఏళ్లకు ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమే అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.