విజయవాడ: ఇంటింటికీ రేషన్ పంపిణీపై కొన్ని పత్రికలు చెత్త రాతలు రాస్తున్నాయని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. రేషన్ డోర్ డెలివరీపై ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు.ఇంటింటికీ రేషన్ ఇస్ఉతన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందని టీడీపీ కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు.కుట్రలు చేయడం దిక్కుమాలిన టీడీపీకి మాత్రమే అలవాటు అని దుయ్యబట్టారు. తొలి దశ ఎన్నికల్లో 83 శాతం సీట్లు గెలిచాం రాష్ట్రంలో జరిగిన తొలి దశ పంచాయతీ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు 83 శాతం సీట్లు గెలిచారని మంత్రి కొడాలి నాని వెల్లడించారు. తొలి దశ ఎన్నికలతో చంద్రబాబుకు మైండ్ బ్లాక్ అయ్యిందన్నారు. జూమ్ యాప్ పెట్టి చంద్రబాబు సొల్లు కబుర్లు చెబుతున్నారని విమర్శించారు. ఏకగ్రీవాలకు టీడీపీ క్యాడర్ ముందుకు వస్తుంటే చంద్రబాబు అడ్డుకుంటున్నారని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో గొడవలు సృష్టించాలనేదే చంద్రబాబు కుట్ర అని పేర్కొన్నారు. వైయస్ఆర్‌సీపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లోపు రాష్ట్రంలో టీడీపీకి క్యాడర్ ఉండదన్నారు. చంద్రబాబు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పారు. చంద్రబాబును పార్టీ నుంచి బయటకు గెంటితేనే టీడీపీకి మనుగడ ఉంటుందని సలహా ఇచ్చారు.ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వడం ఏ రాజ్యాంగంలో ఉందని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీలో కిస్‌మిస్ నాయుడు రాజ్యాంగం నడుస్తోందని ఎద్దేవా చేశారు. చిత్తూరు జి ల్లాలో సర్పంచ్ స్థానానికి లోకేష్ పోటీ చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో గెలవలేని లోకేష్‌కు మాట్లాడే అర్హత లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మంత్రి కొడాలి నాని తెలిపారు.