నిత్యవసర సరుకుల ధరలు పెంచారనడం అవాస్తవం

పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
 

అసెంబ్లీ: నిత్యవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగాయని, తినలేకపోతున్నారని ప్రతిపక్ష సభ్యులు చెప్పిన మాట అవాస్తవమని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రతి సంవత్సరం 10 శాతం పెరుగుతాయన్నారు. అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. కందిపప్పు మార్కెట్‌లో రూ.93 ఉంటే.. దాన్ని రూ.110 ఉందని చెబుతున్నారు. ఇది దేశ వ్యాప్తంగా హెచ్చుతగ్గులు ఉంటాయన్నారు.2015లో గత ప్రభుత్వంలో కందిపప్పు రూ.170కి అమ్మారని, మినప పప్పు ప్రస్తుతం రూ.86 ఉందని, 2015–16లో రూ.160, పెసర ప్రస్తుతం రూ.91 ఉంటే గతంలో రూ.123కి విక్రయించారన్నారు. కొన్ని ధరలు పెరిగి, కొన్ని ధరలు తగ్గాయన్నారు. కూరగాయల ధరలను మార్కెటింగ్‌ శాఖ మానెటరింగ్‌ చేస్తుందని వివరించారు. ఈ రాష్ట్రంలో ఉల్లిపాయ ధర ఎంతున్నా.. రూ.25కి 101 రైతుబజార్ల ద్వారా సప్లయ్‌ చేస్తున్నామన్నారు. వ్యవసాయ శాఖ, సివిల్‌ సప్లయ్, మార్కెటింగ్‌ శాఖ ఎప్పటికప్పుడు మానెటరింగ్‌ చేస్తూ.. పెరిగిన ధరలను ఎలా తగ్గించి ప్రజలకు అందించాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని వివరించారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై కేసులు పెట్టామని ప్రతిపక్ష సభ్యులు చెబుతున్నారని, అది అవాస్తవమన్నారు. ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ పరిపాలనపైనే దృష్టిపెట్టారన్నారు.

Read Also: పౌరసత్వ సవరణ బిల్లుకు వైయస్‌ఆర్‌ సీపీ మద్దతు

Back to Top